Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
శరీరం తాజాగా..గుభాళింపుగా ఉండాలంటే...

శరీరంలో జరిగే పలు రకాల మార్పులు, రసాయనిక ప్రక్రియల కారణంగా దేహం నుంచి చెడు వాసన చెమట రూపంలో వెలువడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో నలుగురిలోకి వెళ్లాలంటే నామోషిగా ఫీలవుతుంటారు. ఎదుటివారి ముందు చిన్న చూపుకూ లోనవుతాం. సంబంధాలు కూడా దెబ్బతింటాయి. కనుక దేహం నుంచి దుర్వాసన వెలువడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
1. మంచి మన్నికైన సబ్బుతో స్నానం చేయాలి.
2. కాటన్ వస్త్రాలను ధరించడమే అన్ని విధాలా మంచిది. ముఖ్యంగా లోపలి వస్త్రాలు కాటన్‌వే వాడాలి.
3. చెమట పట్టే ప్రాంతాల్లో వెనిగర్ రాసుకోవడం మంచి ఫలితాన్నిస్తుంది. డియోడరెంట్ కన్నా ఇది మేలు. అలాగే చెమట పట్టే ప్రాంతాల్లో బేకింగ్ సోడా కూడా రాసుకోవచ్చు.
4. చాలామంది స్నానాన్ని ఏదో ముగించాం అన్నట్లు చేస్తుంటారు. కానీ శరీరంపై పేరుకున్న మలినాలు, బ్యాక్టీరియాపోయే విధంగా స్నానం చేయాలి. లేకుంటే స్నానం చేసిన నిమిషాల్లోనే దుర్వాసన వస్తుంది.
5. ఒకసారి ధిరించిన వస్త్రాలనే మళ్లీ మళ్లీ వేసుకోవడం, పరిశుభ్రమైన నీటితో ఉతక్కపోవడం కూడా కారణాలే. శరీరతత్వం, జన్యుసంబంధిత కారణాల వల్ల కూడా ఈ పరిస్థితి ఏర్పడుతుంది.
6. శరీరానికి అతుక్కుపోయే వస్త్రాలను వేసుకోకండి. అన్ని ప్రాంతాలకూ గాలి తగిలేలా వస్త్రాలుండాలి.
7. ఒకేవేళ మీరేవైనా మందులు వాడుతున్న కారణంగా చెమట అధికంగా పట్టి, దుర్వాసన వస్తుందనుకుంటే డాక్టర్ ను సంప్రదించండి.
8. కాళ్లకు అధికంగా చెమట పట్టేవారు షూ వాడకుండా ఉండడమే మంచిది. సాక్స్ ను ఒకరోజు కంటే ఎక్కువగా వాడకూడదు. * కాఫీ, టీలను మరీ ఎక్కువగా సేవించకండి.
9. స్నానం చివరిలో ఒక మగ్గులో ఒక టేబుల్ స్పూన్ తేనెవేసి ఆ నీళ్లతో శరీరాన్ని తడుపుకోండి.
10. పుదీనా ఆకులను నీటిలో మరగబెట్టి ఆ నీళ్లను స్నానపు నీటిలో కలుపుకుని స్నానం చేయండి.



Click it and Unblock the Notifications
