Latest Updates
-
కొవ్వు తక్కువ, పోషకాలు ఎక్కువ..థైరాయిడ్ పేషెంట్లకు మఖానా ఎందుకు బెస్ట్? -
అసలైన అంబూర్ చికెన్ బిర్యానీ సీక్రెట్ ఇదే.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి! -
రియల్ లైఫ్ బిచ్చగాడు.. వేల కోట్ల ఆస్తి వదిలి ముంబై వీధుల్లో అడుక్కుంటూ..! -
పితృ పక్షాలకు ముందు అరుదైన కలయిక..ఈ 4 రాశుల దశ, దిశ మారనుంది! -
కోల్కతా ఫేమస్ టాంగ్రా డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది! -
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.! -
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.!
డియోడరెంట్స్..పెర్‌ప్యూమ్స్ వాడకంలో మెలకువులు...!

అందంగా అలంకరించుకుంటే ఉన్న అందానికి తోడు మరింత అందం సొంతమవుతుంది. నలుగురిలో వున్నప్పుడు అలాంటి అందం ప్రత్యేకతను తెచ్చిపెడుతుంది. మనం వాడే సెంటు అందాన్నివ్వకపోవచ్చు. కానీ అలంకరణ కంటే ప్రత్యేకతను సొంతం చేస్తుంది. పది అడుగుల దూరం నుండి సెంటు పరిమళాన్ని గుర్తించి మనిషిని చూడకుండా ఎవరొస్తున్నారో తేలిగ్గా చెప్పేయొచ్చు. సువాసనకు అంత గుర్తింపు ఉంది.
పెర్ఫ్యూమ్స్, సెంట్ వాసనలు ఎక్కువ సేపు ఉండాలంటే సెంటును స్ప్రే చేసే చోట కాస్త పెట్రోలియం చెల్లీని అప్లై చేయాలి. లేదా పెర్ ఫ్యూమ్ ని స్ప్రే చిసిన తర్వాత అక్కడ కొద్దిగా టాల్కం పౌడర్ ని అద్ది తిరిగి సెంట్ స్ప్రే చేస్తే సెంటు వాసన చాలా సేపు నిలిచి ఉంటుంది.
డియోడరెంట్స్: వాస్తవానికి వీటిని నేరుగా చర్మం మీద స్ప్రే చేసుకోకూడదు. బట్టల మీదో, దూరం నుంచో స్ప్రే చెయ్యాలి. కానీ చాలామంది నేరుగా వాడతారు. వీటిలో బిథియొనాల్ వంటి 'క్లోరినేటెడ్ ఫినాల్స్' ఉంటాయి. వీటిని స్ప్రే చేసుకుని, సూర్యరశ్మిలోకి వెళితే 'ఫోటో సెన్సిటైజేషన్' వచ్చి, నల్లగా అయిపోవచ్చు. చంకల్లో చర్మం నల్లగా, దళసరిగా మారటం, దురద, అక్కడి చర్మం బాగా పల్చబడి నీరుగారుతుండటం వంటి సమస్యలన్నీ వస్తాయి.
పర్ ఫ్యూమ్: కేవలం అత్తర్లు, సెంటు, పర్ ఫ్యూములే కాదు.. ప్రతి సౌందర్య సాధనంలోనూ సువాసన కోసం వీటిని ఎంతోకొంత కలుపుతారు. ఇవి చర్మానికి తగిలినప్పుడు అలర్జీ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ. వీటివల్ల చర్మం మీద రకరకాల అలర్జీలు, నలుపు లేదా తెలుపు మచ్చలు వస్తాయి. కాబట్టి పర్ ఫ్యూములను దుస్తుల మీదే స్ప్రే చేసుకోవాలి. నేరుగా చర్మం మీద తగలనివ్వకుండా చూసుకోవటం చాలా అవసరం.



Click it and Unblock the Notifications
