Latest Updates
-
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా?
మిల్క్ బ్యూటీ తమన్నా బ్యూటీ సీక్రెట్...

టాలీవుడ్, కోలివుడ్, ఇక ముందు బాలీవుడ్‌లో కూడా తన హవా చాటుకోవాలని చూస్తున్న ఈ ముద్దుగుమ్మ బ్యూటీ సీక్రెట్స్ తన మాటల్లో..
రోజూ పొద్దునే యోగా చేయడం అలవాటు. గంటపాటు యోగా చేస్తాను. ఒకవేళ యోగా చేసే మూడ్ లేకపోతే డ్యాన్స్ చేస్తాను. ఆ డ్యాన్స్ కూడా కనీసం రెండు గంటలపాటు ప్రాక్టీస్ చేస్తాను. దానివల్ల వ్యాయామం పూర్తవుతుంది. నా డ్యాన్స్ ఇంప్రూవ్ కూడా అవుతుంది. నూనె పదార్థాలను చాలా వరకు దూరంగా ఉంచుతాను. ఎక్కువగా నీళ్లుతాగుతాను.
లేకపోతే పళ్లరసాలను, కొబ్బరినీళ్లను తాగుతాను. చపాతీలంటే అస్సలు ఇష్టం ఉండదు. చవాల్‌కత్రీ రైస్ మాత్రం ఇష్టంగా లాగించేస్తాను. అందులోకి ఏ కూర అయినా పర్వాలేదు. అది అమ్మ చేతి వంటకమైతే సూపర్. నాన్ కాస్త తక్కువ తింటాను. అన్ని రకాల వంటకాలను ఇష్టంగా తింటాను. అది కూడా సమయానికే. నాకు మాత్రం వంట రాదు. కనీసం టీ పెట్టడం కూడా చేతకాదు. అంతేకాదు, ఎక్కువ సేపు నిద్రపోవడమే నా హెల్త్ సీక్రెట్.
ఇక మేకప్ విషయంలో కూడా అందరూ ‘తమన్నా‘ ది బెస్టు' అని అంటున్నారు. మరి తమన్నా చెప్పే ఆ మేకప్ సీక్రేట్స్ కూడా ఏమో తెలుసుకొనేద్దామా... షూటింగ్ నుంచి రాగానే మేకప్ అంతా తుడిచేస్తాను. శనగపిండి, పెరుగు కలిపి వారానికి రెండు సార్లు క్రమం తప్పకుండా ప్యాక్ వేసుకుంటాను. ఇది ఎండ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. చర్మాన్ని కాంతివంతగా మారుస్తుంది కూడా. అదే నా బ్యూటీ సీక్రెట్ అంటోంది. మిగితా సీజన్లో ఎలా ఉన్నా చలికాలంలో మేకప్ విషయంలో ఎన్ని ప్రయోగాలైనా చేయవచ్చు. ఎందుకంటే అటు ఎండకి మేకప్ కరిగిపోదు. ఇటూ వర్షానికి మేకప్ చెరిగిపోదు. చలికాలంలో పింక్ కలర్ ను ఎక్కువగా ఉపయోగిస్తే భాగుంటుంది.
బేబీ పింక్, లైట్ పింక్, ఇలా గులాబీ రంగులో ఎన్నో రకాల షేడ్స్ లభిస్తాయి. వాటితో ఎన్ని ప్రయోగాలైనా చేయవచ్చు. బేబీ పింక్ రంగులో ఉండే గోళ్ళ రంగు వేసుకుని చూడండి. ఎంతో అందంగా ఉందని మీరే ఒప్పుకుంటారు. బాగా తెల్లగా ఉండేవారు పెదవులకు రోజ్ పింక్ లిప్ స్టిక్ వేసుకుని చూడండి ఫెయిర్ గా ఉండేవారికి ఈ రంగు లిప్ స్టిక్ బాగా నప్పుతుంది. కొంచెం రంగు తక్కువగా ఉన్నవారు. నల్లటి వారికి ఛెర్రీ పింక్ చక్కగా నప్పుతుంది. ఇక సెక్సీలిప్స్ కోసం మీరేం చేయాలంటే లైట్ పింక్ కలర్ లిప్ గ్లాస్ ఉపయోగించాలి. గులాబీ రంగు, గులాబీ రంగు షేడ్స్ నచ్చనివారు చాలా అరుదుగా ఉంటారు. ఒకవేళ మీరు కూడా ఈ కోవకు చెందిన వారైతే గోల్డ్, ట్రాంజ్, మల్బరీ రంగులలో లభించే లిప్ స్టిక్ ప్రయత్నించండి.



Click it and Unblock the Notifications
