Latest Updates
-
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు!
అందమైన..కోమలమైన పాదాల కోసం...

1. పాదాలను రొజూ గోరువెచ్చని నీటిలో శుభ్రపరచుకోవాలి. పాదాలను పూర్తిగా తడి ఆరనివ్వాలి, ముఖ్యంగా వేళ్ళ మధ్య.
2. పాదాలకి సరిగ్గా సరిపడే బూట్లను వాడాలి. బూటు లోపల వెళ్ళకు సరిపడా ఖాళీ ఉండాలి.
3. తడి పీల్చుకునే కాటన్ సాక్స్ ను వాడాలి. సాక్స్ లను రోజూ మార్చాలి.
4. కాలి గోళ్ళను నైల్ కట్టర్ తో తీయాలి. మరీ చిన్నగా తీయరాదు.డాయబటీస్ ఉన్నవారు డాక్టర్ సహాయంతో గోళ్ళను తీసుకోవాలి.
5. రోజూ పాదాలకు (వేళ్ళ మధ్య తప్ప) మాయిశ్చరైజర్ రాసుకోవాలి. అలా రాయడం వల్ల పగుళ్ళను నివారించవచ్చు. వేళ్ళ మధ్య మాయిశ్చరైజర్ రాయడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది.
6. ఎక్కువ సేపు కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని కూర్చోరాదు. అలా కూర్చోడం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరగదు.
7. పొడిబారిన చర్మాన్ని బ్లేడ్ తో కాని కత్తెరతో కాని తీయరాదు. పొడిబారిన చర్మాన్ని తీయుటకు ఫైలర్ ను ఉపయోగించండి. షుగర్ వ్యాధి ఉన్నా వాళ్లు డాక్టర్ ని సంప్రదించవలెను.
8. పాదాలను ఎక్కువ సేపు నీటిలో నాన్చరాదు. అలా చెయ్యడం వలన చర్మం పాడవగలదు. నీటిలో ఎక్కువ సేపు ఉండవలసి వస్తే చెప్పులు వేసుకోనవలెను.
9. ఇంట్లో మరియు బాత్రూంలలో చెప్పులు వేసుకోవలెను. అలా చెయ్యడం వలన పగుళ్ళను నివారించవచ్చు.
10. ఒక నిమ్మకాయ చెక్క తీసుకుని దానిపై గ్లిజరిన్ వేసి బాగా రుద్దాలి. అనంతరం ఆలివ్ ఆయిల్‌తో కాలును మొత్తం మసాజ్ చేయాలి. అనంతరం పాదాలకు సాక్స్ వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పగుళ్లు, దురద రాకుండా ఉంటాయి.



Click it and Unblock the Notifications
