Latest Updates
-
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.! -
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.! -
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.! -
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.! -
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.! -
ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.! -
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.!
కోమలమైన హస్తాలు...నఖాలు నగీషీలు....

నిజానికి ఈ గోళ్ళు (నఖములు) పెంచుకోడం అనేది అనాది కాలం నుంచీ వస్తున్నదే. మగువలకి గోళ్ళు కూడా ఒక అలంకారమే. అందాన్ని ఇనుమడింప జేసేవే. చేతులు కోమలంగా కనిపించడానికి గోళ్ళు ఎంతో సహకరిస్తాయి. ఈ రోజుల్లో గోళ్ళ రంగులతో పాటు అనేక రకాల డిజైన్లు, ఆర్టిఫిషియల్ (కృత్రిమ) గోళ్ళు మార్కెట్ లోకి వచ్చాయి. పార్టీలలోనూ, విందువి నోదాల్లోనూ మహిళలు వీటిని ఎక్కువగా వాడటం మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. వాటి మాట ఎలా ఉన్నా, గోళ్ళు సంరక్షించుకోవాలంటే...
1. మనకి కావలసిన రీతిలో గోరు పెంచుకో వాలంటే కొంతకాలం పడుతుంది. కనీసం 5-6 సెంటీమీటర్ల వరకూ పెంచిన గోరు కావలసిన షేప్‌లో గ్రైన్ చేసుకోడానికి వీలవు తుంది. ఈ విధంగా గోర్లు అందంగా పెంచు కుందామనే ఆలోచన, సరదా ఉన్నవాళ్ళు ప్రతిరోజూ గోళ్ళలో మట్టి చేరకుండా నీట్‌గా శుభ్రం చేసుకుంటూవుండాలి.
2. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒక చిన్న పాత్రలో తీసుకుని ఐదువేళ్ళూ మునిగేలా ఉంచితే గోళ్ళలో పేరుకున్న నల్లని మట్టి పోయి, బాక్టీ రియా కూడా పోతుంది.
3. కొంత వరకూ పెరిగిన గోళ్ళని మీరు ఏ షేప్‌లో మార్చుకోడానికి ఇష్టపడుతున్నారో ఆషేప్‌లోనే కట్ చేసుకుంటూ మరికొంత పెరగనివ్వాలి.
4. ఇలా గోళ్ళు గ్రైనింగ్ చేసుకోడానికి మార్కెట్లో నెయిల్ బఫర్ సెట్లు దోరుకుతు న్నాయి. వాటిని ఉపయోగించడమే మంచిది. మన శరీర పరిస్థితిని బట్టి గోళ్ళు రంగులు మారుతూ ఉంటాయి. రక్తదోషాలు లేనివారి గోళ్ళు మంచి గులాబీ రంగులో ఎంతో అందంగా కనిపిస్తాయి.
5. రక్తహీనత ఉన్నవారిగోళ్ళ తెల్లగా పాలి పోయి, తెల్లని నిలువు చారలు ఏర్పడతాయి. అటువంటి వారు బీట్‌రూట్, క్యారెట్, తాజాపండ్లు, ఆకుకూరలు, పాల పదార్థాలు అధికంగా తీసుకుంటూ ఉంటే కొంత ప్రయోజనం ఉంటుంది.
6. ఇటువంటి లోపాలు కనబడకుండా చేయడానికి అనేక రంగుల్లో గోళ్ళరంగులు దొరుకుతున్నాయి. అయితే వాటిని ఉపయోగించేటప్పుడు, వీలైనంత వరకూ నేచురల్ కలర్స్ నే వాడుతుంటే అందంగానూ, కోమలంగానూ ఉంటాయి.
7. అప్పుడప్పుడూ ఈ రంగులు వాడినా, వీలైనంత వరకూ గోరింటాకు పెట్టుకుంటే, ఎర్రగా పండి అందంగా కనిపించడమేకాక, సూక్ష్మక్రిములు చేరకుండా కాపాడుతూంటుంది.
8. ఒక సారి గోళ్ళు పెంచుకున్నాకా అవి మరీ పొడవుగా పెరిగిపోకుండా ట్రిమ్ చేసుకుంటూ ఉండాలి. గోళ్ళు కత్తిరించుకునే ముందు కొద్ది సెకన్లు గోళ్ళని నీటిలో ముంచి ఉంచితే మెత్తగా అయ్యి, కావలసిన షేప్‌లో తేకికగా కత్తిరించుకునే వీలుంటుంది. గోరు విరిగి పోకుండా ఉంటుంది.
9. అలాగే పెరిగిన గోళ్ళని ఉంచెయ్యకుండా కొంతకాలం తరువాత పూర్తిగా కత్తిరించి, తిరిగి పెంచుకోడం మొదలెడితే మంచిది. అంతేగానీ పెరిగినవాటినే కావలసినంత మేరకి కత్తిరించుకుంటూ అలాగే ఏళ్ళ తరబడి ఉంచడం మంచిదికాదు.
10. గోళ్లు అందంగా కనబడాలంటే అందుకు తగిని చెయ్యి ఆ సబ్బు తాలూకు రసాయనాలు చేతుల మీద ప్రభావం చూపుతాయి. అందుకే వస్త్రాలు, గిన్నెలు శుభ్రపరిచిన వెంటనే చేతులకు మాయిశ్చరైజర్ రాయాలి. వేడి నీరు తైలగ్రంథులపై ప్రభావం చూపుతాయి.
11 చల్లటి నీరు సహజ మాయిశ్చరైజర్‌లా పనిచేస్తాయి. అందుకే చలికాలంనూ చల్లని నీటికే ప్రాధాన్యం ఇవ్వాలి.
12. తేమ ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ చర్మంలోకి ఇంకిపోతుంది. అందుకే సాన్నం చేయగానే చేతులకు రాసుకోవాలి.
13. నిద్రకు ఉపక్రమించే ముందు పెట్రోలియం జెల్లితో చేతులను మృదువుగా మర్దన చేసుకోవాలి. బయటకు వెళుతున్నప్పుడు తప్పనిసరిగా చేతులకు గ్లౌజులు ధరించాలి. ఇవి ఎండనుంచి చేతులకు రక్షణనిస్తాయి.
14. శరీరానికి సరిపడా మినరల్స్, విటమిన్స్ అందితే చర్మం మృదువుగా ఉంటుంది. విటమిన్ సి, ఈ లు చర్మం మీద మరింత ప్రభావం చూపుతాయి.
15. నెలలో ఆరుసార్లు చేపలు తీసుకోవాలి. వీటిలోని ఎసెన్షియల్ ఫ్యాటీ ఆమ్లాలు చర్మ సౌందర్యానికి ఉపకరిస్తాయి. అ ఫ్యాటీ ఆమ్లాలు గుండెకూ మేలు చేస్తాయి.



Click it and Unblock the Notifications
