Latest Updates
-
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే..
నీళ్ళ వల్ల 15 ఆశ్చర్యకరమైన బ్యూటీ బెనిఫిట్స్
ప్రకృతి పరంగా మనకు లభించే నీళ్ళు పంచభూతాల్లో ఒకటి నీళ్ళు. నీళ్ళు ఒక బ్యూటీ ప్రొడక్ట్ గా చెప్పవచ్చు. ప్రతి రోజూ తగు మోతాదులో నీరు త్రాగడం వల్ల అనేకమైన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయనే విషయం అందరికీ తెలిసిన విషయమే..! రీరములో జరిగే మెటబాలిక్ చర్యల్కు నీరు అతిముఖ్యము. చాలా మందికి తెలియకునా నీరు, నీటి శాతం ఎక్కువగా ఉన్న పానీయాలు సేవించడం వల్ల ఎన్నో జబ్బులు దరి చేరవు. శరీరము లొ రక్తంకి ఎంత ప్రాధాన్యత ఉందో నీటికి అంతే విలువ ఉన్నది. మానవ శరీరములోని ద్రవ పదార్ధాల సమ్మేళనానికి, విటమిన్లు, మినరల్స్ అన్ని అవయవాలము సరఫరా చేయడంలో నీరు భూమిక వహిస్తుంది. నీటిలో క్లోరిన్, ఇయోడి్న్, ఆక్సిజన్ వంటి వాయువులు సమపాళ్ళ లో ఉంటే మనిషి ఎప్పుడూ ఆరోగ్యం గానే ఉంటాడు. మార్కెట్లో ఉండే వివిధ రకాలైన బ్యూటీ ప్రొడక్ట్స్ కంటే నీళ్ళు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అందాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది.
ప్రతి రోజూ తగు మోతాదులో నీళ్ళు తాడం వల్ల ఆరోగ్యకరమైన శరీరం, గ్లోయింగ్ స్కిన్, మరియు షైనీ హెయిర్ పొందవచ్చు. నీళ్ళు ఎక్కువగా తాగడం వల్ల ఇది శరీరంను డీటాక్సిఫై (మలినాలను తొలగించడానికి) చేయడానికి మరియు ఇతర ఆరోగ్యప్రయోజనాల కోసం అవసరం అయ్యే ఇంటర్నల్ ఆర్గాన్స్ పొందవచ్చు. కాబట్టి ప్రతి రోజూ తప్పనిసరిగా తగినంత నీళ్ళు తాగుతూ చెప్పలేనన్ని బ్యూటీ బెనిఫిట్స్ ను పొందండి . నీళ్ళుతో పొందే అత్యంత ఆసక్తికరమైన బ్యూటీ బెనిఫిట్స్ ఇక్కడ అందిస్తున్నాం. పరిశీలించి మీరు డైలీ తీసుకొనే నీటి శాతాన్ని పెంచండి..ఆరోగ్యంగా.. అందంగా జీవించండి..

మాయిశ్చరైజర్:
నీటిశాతం సక్రమంగా ఉండాలి. మన శరీరంలో నీటిశాతం సరిగ్గా లేకపోతే.. చర్మం ముడతలు పడటం, చర్మ సమస్యలు, చర్మం పొడి బారడం వంటివి ఏర్పడతాయి. అందుకే మన శరీరంలో 75 నుంచి 80 శాతం నీరు ఉండాలి. . ఈ సమస్యలన్నింటికి చక్కటి పరిష్కార మార్గం రోజులో తగుమోతాదులో నీళ్ళు తాగడం.ఇందుకు ప్రతిరోజూ ఆరు నుంచి ఎనిమిది గ్లాసుల నీరు సేవించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ముడుతలను నివారిస్తుంది:
ముడుతలు లేని చర్మసౌందర్య అందించడంలో నీళ్ళు ముఖ్య పాత్ర పోషిస్తాయి. రెగ్యులర్ గా నీళ్ళు తాగడం వల్ల చర్మంలో ఎటువంటి ముడుతలు లేకుండా చర్మానికి తగినంత తేమనందిస్తూ, ఎలాసిటి గుణాన్ని అందిస్తుంది.

కళ్ళను ప్రకాశవంతంగా చేస్తుంది:
అందం విషయంలో కళ్ళు కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది. నీళ్ళు తాగడంతో పాటు రోజులో అప్పడప్పుడు కళ్ళను చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల కళ్ళు తాజాగా మరియు ఆకర్షణీయంగా కనబడుతాయి. మరియు ఇది కళ్ళ ఇన్ఫెక్షన్స్ ను తగ్గిస్తుంది.

క్లెన్సింగ్:
చల్లటి నీటితో మీ శరీరం లేదా ముఖంను శుభ్రం చేసుకోవడం వల్ల, చర్మం తాజాగా మరియు క్లీన్ గా ఉంటుంది. నీళ్ళు చర్మంలో దాగి ఉన్న మురికిని మరియు చర్మానికి హాని కలిగించే రసాయనాలను తొలగిస్తుంది.

మొటిమలను తగ్గిస్తుంది:
గోరువెచ్చని నీటిలో ఒక కాటన్ వస్త్రాన్ని నానబెట్టి, ఐదు నిముషాల తర్వాత ఆ క్లాత్ ను తీసి ముఖం మీద పరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం రంద్రాలు తెరచుకొనేలా చేసి మురికిని తొలగితస్తుంది. ఇలా తరచూ చేయడం వల్ల మొటిమలు రాకుండా నివారిస్తుంది మరియు ఉన్న మొటిమలను తగ్గిస్తుంది.

చర్మాన్ని స్వచ్చంగా ఉంచుతుంది:
నీళ్ళు చర్మాన్ని డిటీక్సిఫై చేయడానికి మరియు బిగువుగా చేయడంలో వాటర్ థెరఫీ చాలా ప్రభావవంతమైన పద్దతి. గోరువెచ్చని నీళ్ళు చర్మ రంద్రాలు తెరచుకొనేలా చేసి మురికిని తొలగిస్తుంది. చల్లని నీళ్ళు తెరచుకొన్న చర్మ రంద్రాలు తిరిగి మూసుకొనేలా చేసి చర్మాన్నిబిగుతుగా చేస్తుంది.

యాంటీఏజింగ్:
యవ్వనంగా ఉండేలా మన అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నీళ్ళు ఉత్తమ ఔషదం వంటిది. ఇది చర్మం తేమగా ఉండేలా చేస్తుంది. చర్మం స్థితిస్థాపక గుణం కలిగి ఉండేలా చేయడంతో పాటు ముఖంలో, చర్మం మీద ఏర్పడ ముడుతలను నిరోధించడానికి సహాయపడుతుంది. తగుమెత్తంలో నీళ్ళు తాగడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మరియు అందంగా ఉండేలా చేస్తుంది.

అందమైన పెదాల కోసం:
పెదాలు సున్నితంగా మరియు అందంగా ఉండాలంటే ప్రతి రోజూ తగినన్ని నీళ్ళు తాగాలి. నీళ్ళు ఎక్కువగా తాగడం వల్ల చర్మం మాత్రమే కాదు పెదాల మీద అతి పల్చటి చర్మం కూడా హైడ్రేషన్ లో ఉంచుతుంది. నీళ్ళు నేచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది మరియు పగుళ్ళను నివారిస్తుంది.

స్కిన్ ఎలాసిటి:
చర్మం స్థితిస్థాపకత. చాలా మందిలో చిన్న వయస్సులోనే చర్మం సాగినట్లు అనిపిస్తుంటుంది. లేదా చాలా బిగువుగా ఉండి, చర్మ పగుళ్ళకు దారితీస్తుంటుంది. కాబట్టి నీళ్ళు తగుమోతాదులో తీసుకోవడం వల్ల మీ చర్మానికి అసరం అయ్యే హైడ్రేషన్ ను అందిస్తుంది. చర్మం సున్నితంగా మరియు స్థితిస్థాపకత కలిగి ఉండేలా సహాయపడుతుంది.

శరీరా ఆకృతి:
తగినన్ని నీళ్ళు తాగడం వల్ల శరీరం హైడ్రేషన్ లో ఉంచుకోవడంతో పాటు బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. భోజనానికి ముందు నీళ్ళు తాగడం వల్ల కడుపు ఫుల్ గా ఉన్న అనూభూతి కలిగి తక్కువ ఆహారాన్ని తీసుకుంటారు. మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వాటర్ ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలిగి మరియు లోక్యాలరీలు కలిగిన బెస్ట్ డ్రింక్.

ఇన్ఫెక్షన్ తొలగిస్తుంది:
ప్రతి రోజూ గోరువెచ్చని నీటితో స్నానం చేసుకోవడం వల్ల, వ్యాధులకు దారితీసే అనేక ఇన్ఫెక్ష నుండి మన శరీరానికి రక్షణ కల్పించబడుతుంది. స్నానం వల్ల చర్మంరంద్రాల్లో ఉన్న మురికి సులభంగా తొలగించబడుతుంది. అలాగే మీరు ఫ్రెష్ గా ఉండేలా చేస్తుంది.

మొత్తం ఆరోగ్యంను మెరుగుపరుస్తుంది:
రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగడం వల్ల.. చక్కటి ఆరోగ్యం సొంతమవుతుంది, శరీరంలోని వ్యర్థాలు దూరమవుతాయి. కొన్ని పరిశోధన ప్రకారం ఎక్కువ నీరు త్రాగడం వల్ల ఆరోగ్యానికి అపాయమే అంటున్నారు. ఎందుకంటే ఎక్కువ నీరు శరీరం గ్రహించడం వల్ల శరీరంలో ఉండే రక్తంలో ఉన్న సోడియం అంశాలను తక్కువ చేస్తుంది. కిడ్ని ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. మూత్రపిండాలపై అధిక భారం పడుతుంది. దాంతో అనారోగ్య బారీన పడాల్సి వస్తుంది. కాబట్టి అధిక నీరు అంటే పది గ్లాసుల కంటే ఎక్కువ నీరు త్రాగకపోవడమే ఆరోగ్యానికి మంచిది. ఒకేసారి ఎక్కువ నీరు తాగకూడదు. దఫ దఫాలు గా కొంచెం కొంచం గా తాగుతూ ఉండాలి.

డిటాక్సిఫికేషన్:
శరీరం నుండి మలినాలు విసర్జించడంలోను నీరు ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. శరీరం నీటిని చెమట, మూత్రాల రూపంలో నష్టపోతుంది. ఈ నష్టాన్ని ఎప్పటికప్పుడు శుభ్రమైన నీటిని త్రాగి భర్తీ చేయాలి.

శరీరో ఉష్ణోగ్రతనులను క్రమబద్దం చేస్తుంది :
రెగ్యులర్ గా స్నానం చేసుకోవడం వల్ల, శరీరంలో ఉష్ణోగ్రతలు నార్మల్ గా ఉండేలా నిర్వహించబడుతుంది. శరీరంలో టెంపరేచర్ నార్మల్ గా ఉన్నప్పుడు చర్మానికి సోకే అనేక ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది.

శరీర దుర్వాసనను తగ్గిస్తుంది :
తగినన్ని నీళ్ళు తీసుకోవడం ల్ల శరీరం యొక్క దుర్వాసనను తగ్గిస్తుంది. ఎక్కువగ నీళ్ళు త్రాగడం వల్ల చెమట రూపంలో మలినాలు బయటకు నెట్టివేడం వల్ల దుర్వాసన దూరం అవుతుంది.



Click it and Unblock the Notifications











