Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
బ్రా సైజ్ తప్పైతే..ఇటు బ్యూటీ..అటు హెల్త్ కు ఘోర ప్రమాదం..!
సాధారణంగా మహిళలు ఎంపిక చేసుకునే దుస్తుల్లో విశేష ప్రాధాన్యత కలిగింది 'బ్రా'నే...ఇది కేవలం అందాలకు... ఆకర్షణకు మాత్రమే పరిమితం కాదని...ఛాతి ఆకృతిని కప్పి ఉంచడంతో పాటు ఆరోగ్యాన్ని... ఆత్మ విశ్వాసాన్ని కలుగ చేస్తాయని...సరైన జాగ్రత్తలు తీసుకుని వీటిని కొనుగోలు చేసుకోకుంటే... ఇబ్బంది తప్పదంటున్నారు నిపుణులు మగాళ్ల మనసుల్ని దోచేలా ముగువలున్నారంటే... వారి అందమొక్కటే కాదు... అనేక అంశాలు అందుకు ప్రాధాన్యలుంటాయి. వీటిలో చెప్పుకోదగ్గ వాటిలో వారు ధరించే బ్రా ప్రధాన భూమిక పోషిస్తుందనటంలో సందేహంలేదు. మరి ఇంతలా అందర్నీ కట్టిపడేస్తున్న బ్రా కధాకమామిషేంటని ఓసారి పరిశీలిస్తే...
ఈ మోడ్రన్ యుగంలో కూడా చాలామంది మహిళలు తమ బ్రా కొనుగోలు చేయాలంటే ఇబ్బంది పడుతున్నారు. పురుషులు సేల్స్ మెన్ లుగా ఉండే షాపుల్లో అయితే పరిస్ధితి మరీ దారుణం. బ్రాలను అడిగి, పరిశీలించి కొనుగోలు చేయాలన్నా సిగ్గుపడుతూ, చేతికి అందిన దాన్ని తీసుకుని తిరుగుముఖం పడుతున్నారు. తీరా ఇంటికి వచ్చిన తర్వాత వేసి చూసుకుంటే అది వదులుగానో, బిగుతుగానో ఉండటాన్ని గ్రహించి దానిని బయటకు చెప్పుకోలేక అలానే వేసేసుకుంటూంటారు. బ్రా అంటే కేవలం అందం కోసమేనని అందరూ అనుకుంటారు. కానీ, అది ఆరోగ్యానికి కూడా పలు రకాలుగా మేలు చేస్తుందన్న విషయాన్ని వారు విస్మరిస్తున్నారు. సరైన సైజు బ్రాలు వాడితే మెడనొప్పి, వెన్నునొప్పి, తలనొప్పి వంటి వాటికి దూరంగా ఉండవచ్చు.
స్తనాల (వక్షోజ) సైజు పెద్దగా పెరగాలంటే ఇవి తినాల్సిందే:క్లిక్ చేయండి
అంతేకాదు, బ్రా ఎంపిక లొపాలే రొమ్ము కేన్సర్ కు పలు సందర్భాలలో కారణమవుతుందని కూడా నిపుణులు అంటున్నారు. మీరు ఎన్నుకొనే బ్రా కొంచెం కూడా స్తన భాగం బయటకు రాకుండా ఉండేవిధంగా ఉండాలి. కప్ సైజ్ బ్రాను కొనుగోలు చేయడంలో ఉన్న ఆసక్తిని, స్ట్రాప్ ఎంపికలోనూ చూపాలి. వెడల్పు తక్కువగా ఉండే స్ట్రాప్ లు వక్షోజాలను సరైన రీతిలో ఉంచలేవు. అలాగే ముందువైపు హుక్కులు ఉండే బ్రాల కంటే కూడా వెనుక హుక్కులు ఉండే బ్రాలు బాగా పట్టి ఉంచుతాయి. బ్రాలను వాడకపోతే వక్షోజాలు వదులుగా, జారిపోయినట్లగా ఉంటాయి. పాలు పట్టే పిల్లల తల్లులైతే డబుల్ కప్ టైప్ బ్రా తొడుక్కోవడం ఎంతైనా అవసరం. వ్యాయామం చేసేటపుడు కూడా బ్రా ను ఖచ్చితంగా వేసుకోవాలి. ఎటువంటి కాలంలోనైనా కాటన్ బ్రాలు తొడుక్కోవడం మంచిది.
బ్రా అన్నది కేవలం అందం కోసమే కాదు ఆరోగ్యాన్ని కూడా కాపాడేది అన్నది చాలా తక్కువమందికి తెలుసు. అయితే ఏదో ఓ బ్రా కొనేసుకున్నాం. వేసేసుకున్నాం అన్న తీరులో పోతే, వెన్ను నొప్పి, తలనొ ప్పి, మెడనొప్పితో పాటు రొమ్ము క్యాన్సర్ వచ్చే ఆస్కారం కూడా ఉందన్నది వైద్య నిపుణుల హెచ్చరిక. బ్రా సరిలేకుంటే... అంతే...శరీరాన్ని బిగుతుగా పట్టి ఉంచేలా ఉండే దుస్తులకు ఎక్కువగా నేటి యువత ఆకర్షింపబడుతున్న క్రమంలో బ్రా ఎంపిక కూడా చాలా జాగ్రత్తగా జరగాల ని... శరీరాకృతిని మార్పు చేసేలా బ్రాలుంటాయన్న విషయాన్ని పరిగణన లోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. అలా సరైన బ్రాను ఎంపిక చేసుకోకపోతే కొన్ని ప్రమాధకరమైన ఆరోగ్యసమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. అవేంటో ఒక సారి పరిశీలించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి...

బ్రా సైజ్ తప్పుగా ఎంచుకోవడం వల్ల చాలా ప్రమాధకరమైన ఆరోగ్య సమస్య ఏర్పడుతుంది. బ్రా సైజ్ తప్పుఅయితే చాలా టైట్ గా ఉండటం వల్ల అసౌకర్యం కలిగించడంతో పాటు రొమ్ము నొప్పికి కారణం అవుతుంది.

మీరు వేసుకొనే బ్రాసైజ్ ఎంపిక సరిగా లేనట్లైతే వెన్ను నొప్పితో బాధపడాల్సి వస్తుంది.

బ్రా సైజ్ తప్పుగా ఉన్న బ్రాను ధరించడం వల్ల మీ బ్రెస్ట్ షేప్ ను పాడుచేస్తుంది . ఫిట్ గా మరియు మంచి షేప్ లో ఉంచడానికి కి బదులు బ్రెస్ట్ సాగినట్లుగా లేదా బారీగా కనబడేలా చేస్తాయి.

భుజాలు మరియు మెడ నొప్పి కి ప్రధాన కారణం సైజు తప్పుగా ఉన్న బ్రాను ధరించడమే. తప్పు సైజు బ్రాను ధరించడం వల్ల అనారోగ్యానికి దారితీసే సమస్యలో ఇది కూడా ఒకటి. కాబట్టి ఆరోగ్య సమస్యలను నివారించేందుకు కరెక్ట్ బ్రాను ఎంపిక చేసుకోవడం మంచిది.

స్మాల్ కప్ ఉన్న బ్రాలను ధరించడం వల్ల లిఫ్ గ్రంథుల వైఫల్యానికి దారితీస్తుంది. కాబట్టి ఆరోగ్య సమస్యలను నివారించేందుకు కరెక్ట్ బ్రాను ఎంపిక చేసుకోవడం మంచిది.

మీకు సౌకర్యంగా మరియు ఫిట్ గా ఉండే బ్రాలను వేసుకోకపోతే మీ బ్రెస్ట్ సైజ్ పెరగడం కానీ లేదా తగ్గడం కానీ జరుగుతుంది.

మీరు ఎంపిక చేసుకొనే బ్రా సైజ్ తప్పుగా ఉంటే మీ భంగిమను పాడు చేస్తుంది. అంతే కాదు ఇది వెన్ను, భుజాలు, మరియు మెడ నొప్పికి దారితీస్తుంది.

వ్రాంగ్ బ్రా సైజ్ ను ఎంపిక చేసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ దుష్ప్రభాన్ని ఎదుర్కోవల్సి వస్తుంది. వ్రాంగ్ సైజ్ బ్రా ఎంపిక వల్ల రక్త ప్రసరణ బ్రెస్ట్ కు సరైన రక్త ప్రసరణ జరగక రొమ్ముక్యాన్సర్ కు దారితీస్తుంది. అందుకే మహిళలు బ్రాలను ఎంపిక చేసుకొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మీరు మీకు సరిపడాని బ్రాలను వేసుకుంటున్నట్లైతే, అప్పుడు మీరు మీ ఛాతీ చుట్టూ ఉన్న చర్మం రాపిడికి గురిఅవుతుంది. చర్మ రాపిడిని అభివృద్ధి చేస్తుంది.



Click it and Unblock the Notifications