Latest Updates
-
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు! -
ప్రేమంటే రొమాన్స్ మాత్రమేనా.. ఎన్ని రకాలు ఉన్నాయో తెలిస్తే ఇట్టే లవ్లో పడిపోతారు.! -
త్వరగా ప్రెగ్నెన్నీ రావాలంటే..భార్యాభర్తలు తప్పక తినాల్సిన ఫ్రూట్ ఏది? -
వర్షాకాలంలో ఇంట్లో ఆ వాసన పోవాలంటే.. ఈ ఐదు జాగ్రత్తలు తప్పనిసరి.! -
కేవలం 1 స్పూన్ నూనెతో కుక్కర్ లో పానీ పూరీలు..డీప్ ఫ్రై లేకుండానే బండి మీది టేస్ట్! -
అభిజిత్ ముహూర్తం: ఈ రాశుల వారికి నేడు ధనయోగం.. పట్టిందల్లా బంగారం! -
ఎదుటి వ్యక్తిని ఈ నాలుగు ప్రశ్నలు అడుగుతున్నారా.. వారి దృష్టిలో మీ విలువ తగ్గినట్లే.! -
జూన్ 22న వరీయాన్ యోగం.. ఈ రాశుల వారికి కెరీర్, వ్యాపారాల్లో తిరుగులేని అదృష్టం!
డార్క్ సర్కిల్స్ కు కారణం ఈ ఆహారాలలే
డార్క్ సర్కిల్స్ ను నివారించుకోవడానికి వివిధ రకాల కన్సీలర్స్ ను అప్లై చేసి అలసిపోయారా?చర్మ సమస్యలకు వివిధ కారణాలున్నాయి. కొన్ని రకాల చర్మ సమస్యలకు ముఖ్య కారణం నిద్రలేమి, స్ట్రెస్, డీహైడ్రేషన్, పిగ్మెంటేషన్, అనమిక్ టెండెన్సీ మరియు అనారోగ్యకరమైన జీవనశైలి.
అంతే కాదు, కొందరి నిపుణుల అభిప్రాయం ప్రకారం మనం తీసుకొనే ఆహారం మన చర్మం మరియు ముఖం మీద ప్రభావం చూపుతుంది. డార్క్ సర్కిల్స్ కు ఇది ఒక ముఖ్యమైన కారణం. కొన్ని ప్రత్యేమైన ఆహారాలు ముఖంలో డార్క్ సర్కిల్స్ తో పాటు, స్కిన్ డ్యామేజ్ చేస్తుంది. ఉదాహరణకు: మీరు కాఫీకి అలవాటు పడినట్లైతే మీరు తప్పనిసరిగా డార్క్ సర్కిల్స్ కు గురికావల్సి ఉంటుంది. డార్క్ సర్కిల్స్ కు కెఫిన్ ఒక ముఖ్య కారణం . అంతే కాదు అధిక సోడియం మరియు పొటాషియం కలిగినటువంటి ఆహారాలు కూడా డార్క్ సర్కిల్స్ కు ప్రధాణ కారణం అవుతాయి.
కిడ్నీ సమస్యలు, హార్మోనుల అసమతుల్యత మరియు ఫుడ్ అలర్జీ వంటి సమస్యల వల్ల కూడా డార్క్ సర్కిల్స్ కు కారణం అవుతుంది . అంతే కాదు, విటమిన్ సి మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లోపం వల్ల కూడా కళ్ళక్రింద డార్క్ సర్కిల్స్ కు ప్రధాణ కారణం అవుతుంది. పోషకాహారం లోపంతో పాటు, నిద్రలేమి మరియు సరిపడా నీళ్ళు త్రాగకపోవడం వల్ల కూడా డార్క్ సర్కిల్స్ కు ప్రధానకారణం అవుతుంది.
డార్క్ సర్కిల్స్(నల్లటి వలయాలు)కలిగి ఉండటం వల్ల మీరు అలసిపోయి మరియు డల్ గా కనబడుతారు. నల్లటి వలయాలను తొలగించుకోవడానికి కొన్ని రకాల కెమికల్స్ ఉపయోగించడం వల్ల అవి మీ చర్మానికి హాని కలిగిస్తాయి. అంతే కాదు, కొన్ని రకాల ఆహారాలు ఐ సైట్ కు కూడా కారణం అవుతాయి. అందువల్ల డార్క్ సర్కిల్స్ నివారించడానికి, అవి ఏర్పడటానికంటే ముందే కొన్ని రకాల ఆహారాలను నివారించండి.
డార్క్ సర్కిల్స్ కు కారణం అయ్యే ఆహారాలు :

కాఫీ:
డార్క్ కాఫీ చర్మానికి హాని కలిగించడం మాత్రమే కాదు, మొత్తం ఆరోగ్యానికే హాని చేస్తుంది. స్ట్రాంగ్ కాఫీలు డార్క్ సర్కిల్స్ ను ఏర్పరచడంతో పాటు, నిద్రలేమికి దారితీస్తాయి.

టర్కీ:
పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు మోతాదుకు మించి తీసుకోవడం వల్ల కళ్ళ క్రింది ఉబ్బడం మరియు డార్క్ సర్కిల్స్ ఏర్పడటానికి కారణం అవుతుంది. అధిక పొటాషియం ఆహారాలు ఉదా: టర్కీ వంటి ఆహారాలు డార్క్ సర్కిల్స్ కు కారణం అవుతాయి.

స్వీట్ పొటాటో:
స్వీట్ పొటాటో అద్భుతమైన రుచిని కలిగించవచ్చు, కానీ మోతాదు మించితే బ్యూటీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఉదా: కళ్ళక్రింది నల్లటి వలయాలతో బాధపడాల్సి వస్తుంది.

సాల్ట్ ఫుడ్స్:
సాల్టీ ఫుడ్స్ సోడియం అధికంగా ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో నీటి కంటెంట్ ను తగ్గించేస్తుంది . ఇది కళ్ళ క్రింద ఉబ్బు మరియు టైయర్డ్ ఐస్ కు కారణం అవుతుంది. మీరు ఎక్కువ సాల్ట్ ఆహారాలు తీసుకోవడం వల్ల అది డార్క్ సర్కిల్స్ కు కారణం అవుతుంది.

డార్క్ చాక్కెట్స్:
స్వీట్ చాక్లెట్స్ తినడం అంటే మనందరికీ చాలా ఇష్టం . మంచి టేస్ట్ తో నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే చాక్లెట్స్ మన మూడ్ ను కూడా మార్చుతాయి. అయితే చాక్లెట్స్ లో కెఫిన్ అధికంగా ఉండటం వల్ల ఇది చర్మానికి చాలా హాని కలిగిస్తుంది. చాక్లెట్స్ ఎక్కువగా తినడం నివారిస్తే డార్క్ సర్కిల్స్ ను నివారించుకోవచ్చు.

పీనట్ బట్టర్:
పీనట్ బటర్ లో పొటాషియ అధికంగా ఉంటుంది. ఇది డార్క్ సర్కిల్స్ కు కారణం అవుతుంది.



Click it and Unblock the Notifications