Latest Updates
-
100 ఏళ్లు గుర్తుండిపోయే పచ్చిమిర్చి పచ్చడి..ఎందులోకి అయినా అమృతమే! -
ఖాళీ స్వీట్ బాక్సులు పారేస్తున్నారా?.. ఈ ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు! -
హోటల్ స్టైల్ పూరీ మసాలా ఇంట్లోనే.. ఈ సీక్రెట్ టిప్స్ తో చేసి చూడండి! -
నెల రోజులు నిల్వ ఉండే ఆరోగ్యకరమైన మరమరాల లడ్డు..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోరూరించే రుచి, ఆరోగ్యానికి మేలు..క్రీమీ పనీర్ నూడుల్స్ ఒక్కసారి రుచి చూశారంటే రోజూ ఇదే కావాలంటారు.. -
ఐరన్, ప్రోటీన్ నిండిన బలవర్థకమైన వేరుశెనగ చిక్కీ..చలికాలంలో బెస్ట్ హెల్తీ స్నాక్..ఈ కొలతలతో చేస్తే పర్ఫెక్ట్! -
వైద్య రంగంలో సంచలనం..కొత్త యూరిన్ టెస్ట్ తో బ్లడర్ క్యాన్సర్ ను ప్రాథమిక దశలోనే గుర్తింపు! -
తిరుమల శ్రీవారి ప్రసాదం మలహోర.. ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
అనిరుధ్ - కావ్య మారన్ వెడ్డింగ్: గ్రీస్లోనే పెళ్లి ఎందుకు? అక్కడ ఉన్న ప్రత్యేకతలేంటి? -
జింక్, కాల్షియం, విటమిన్ ఈ, ప్రొటీన్ పుష్కలంగా ఉండే లడ్డు ఇదే ..ఎలా చేసుకోవాలో చూడండి
చలికాలంలో గొంతు నొప్పి, గరగర వేధిస్తున్నాయా? వంటింట్లో దొరికే ఈ పదార్థాలతో చిటికెలో రిలీఫ్..
సీజన్ మారినప్పుడల్లా మన శరీరంపై ఆ మార్పు ప్రభావం పడుతుంది. ముఖ్యంగా చలికాలంలో చాలా మంది గొంతు నొప్పి, బొంగురు గొంతు, గొంతులో గరగర లేదా చికాకు వంటి సమస్యలతో బాధపడుతుంటారు. చల్లటి పదార్థాలు తీసుకోవడం, వైరల్ ఇన్ఫెక్షన్లు, అలర్జీలు లేదా గంటల తరబడి మాట్లాడటం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. గొంతు నొప్పి కారణంగా ఉమ్మి మింగాలన్నా విపరీతమైన అసౌకర్యం కలుగుతుంది. ఈ సమస్య నుండి తక్షణ ఉపశమనం పొందడానికి కొన్ని అద్భుతమైన ఇంటి చిట్కాలు ఉన్నాయి అవేంటో ఇక్కడ చూడండి.
గొంతు నొప్పికి ప్రభావవంతమైన హోం రెమెడీస్
గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ ఉప్పు వేసి బాగా కరిగించాలి. ఈ నీటితో రోజుకు 2 నుండి 3 సార్లు పుక్కిలించాలి. ఇది గొంతులోని వాపును తగ్గించడమే కాకుండా, ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడుతుంది.

తేనెలోని అద్భుత గుణాలు
తేనెను ఆయుర్వేదంలో పోషకాల భాండాగారంగా భావిస్తారు. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గొంతు నొప్పిని, చికాకును ఇట్టే తగ్గిస్తాయి. రోజూ ఒక స్పూన్ తేనెను నేరుగా తీసుకోవచ్చు లేదా గోరువెచ్చని నీటిలో లేదా గ్రీన్ టీలో కలుపుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది.
అల్లం టీతో ఉపశమనం
ఇన్ఫెక్షన్లను సమర్థవంతంగా ఎదుర్కొనే ఔషధ గుణాలు అల్లంలో మెండుగా ఉంటాయి. రోజూ అల్లం దంచి తయారుచేసిన టీ తాగడం వల్ల గొంతు నొప్పి నుండి చక్కటి ఉపశమనం లభిస్తుంది. టీ తాగడం ఇష్టం లేని వారు చిన్న అల్లం ముక్కను నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉండవచ్చు.

శరీరానికి తగినంత విశ్రాంతి, నిద్ర
శరీరం ఏదైనా ఇన్ఫెక్షన్‌తో పోరాడుతున్నప్పుడు దానికి తగినంత విశ్రాంతి చాలా అవసరం. నిద్రపోవడం వల్ల రోగ నిరోధక శక్తి బలపడి, త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. కాబట్టి ఈ సమయంలో శరీరానికి పూర్తి విశ్రాంతి ఇవ్వడం ముఖ్యం.
డాక్టర్ ని ఎప్పుడు సంప్రదించాలి?
చిట్కాలు పాటించినప్పటికీ సమస్య తగ్గకపోతే నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా గొంతు నొప్పి వారం రోజుల కంటే ఎక్కువగా ఉన్నా, విపరీతమైన జ్వరం వచ్చినా, శ్వాస తీసుకోవడంలో లేదా ఆహారం మింగడంలో తీవ్రమైన ఇబ్బంది ఉన్నా వెంటనే డాక్టర్ ని సంప్రదించి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం ఉత్తమం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
