Latest Updates
-
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.!
పెళ్లిళ్ల సీజన్ రానుంది..మరి పెళ్లికూతురు అందంగా మెరవడం ఎలా
పెళ్లిళ్ల సీజన్ రానున్నది. పెళ్లి అనగానే ఎక్కడ లేని విధంగా కేర్ అందం మీద ముంచుకొస్తుంది అమ్మాయిలకు. వెంటవెంటనే ఏదో ఒకటి గాబరాగా ఫేషియల్స్, ప్యాక్స్, మొదలగు హడావుడి ఉదయం, సాయంత్రం, రాత్రి చేసేస్తుంటారు. ఆ తొందరే వద్దు. అతివేగం ప్రమాదం. నాలుగు రోజులు ముందు నుంచి కాకుండా తాంబూలాలు ముందు నుంచే రెగ్యులర్ కేర్ తీసుకుంటే ఆ సమయానికి పెళ్లి రోజు నాడు చిన్న ప్యాక్ వేసుకొని పెళ్లి పీటల మీద కూర్చున్నా మీరే అందంగా మెరిసిపోతారు. మీరింకా ఏమేమి పాటించాలో తెలుసుకుందామా!

పెళ్లి కూతురు అందంగా....
పెళ్లికి చాలారోజుల ముందు నుంచి కేర్ తీసుకోవడం వల్ల ముఖం ఆకర్షణీయంగా, సౌందర్యవంతంగా ఉంటుంది.

పెళ్లి కూతురు అందంగా....
కేవలం ఫ్రూట్స్ ఉపయోగించి చేసిన ప్యాక్స్, మాస్క్‌లే వాడండి.

పెళ్లి కూతురు అందంగా....
కళ్ల కింద రోజ్‌వాటర్‌లో ముంచిన కాటన్ క్లాత్‌ను ఉంచుకుంటే కళ్లు ఆకర్షణీయంగా ఉండడంతో పాటు కళ్ల కింద నల్లని వలయాలు కనిపించకుండా పోతాయి.

పెళ్లి కూతురు అందంగా....
పెళ్లి అనగానే సహజంగా అందరికి ఫోన్స్ చేయటం బిజి బిజి. దానికి తోడు గంటలు గంటల కొద్ది అబ్బాయి, అమ్మాయిల ఫోన్ సంభాషణ. అలాంటి వాటిని తగ్గించటం లేదా స్వస్తి చెప్పి వేళకి పడుకొనేలా చూడండి.

పెళ్లి కూతురు అందంగా....
ఫేస్ క్లెన్సర్‌లు కాంతివంతం, సహజమైన మెరుపును చర్మానికి ఇస్తుంది. దానితో పాటు మసాజ్ వల్ల రక్తప్రసరణ జరిగి తెలియని నూతన ఉత్సాహం వస్తుంది.

పెళ్లి కూతురు అందంగా....
ఉదయం లేవగానే ఫ్రిజ్‌వాటర్‌ని ముఖం మీద చల్లుకోండి. పొడిచర్మం గలవారు సోప్ వాడండి.

పెళ్లి కూతురు అందంగా....
ఆయిలీ చర్మం గలవాళ్లు ఓట్స్ పిండిని, నిమ్మపండు రసంని కలిపి పేస్ట్‌లా చేసుకుని దానిని ఫేస్‌కి బాగా రుద్దుకోండి. ఇలా చేయటం వల్ల మొటిమలు రాకుండా వుంటాయి.

పెళ్లి కూతురు అందంగా....
వేపుడు కూరలకు, నూనెపదార్థాలకు దూరంగా ఉండడమే మంచిది.

పెళ్లి కూతురు అందంగా....
ఉదయం లేవగానే నిమ్మరసం, తేనెలను కలిపి తాగండి.

పెళ్లి కూతురు అందంగా....
చేతివేళ్ల విషయంలో కేర్‌గా ఉండండి. వంటపాత్రలు కడగటం, బట్టలు ఉతకడం లాంటి వాటిని చేయవద్దు. వేళ్ల ఆకృతి చక్కగా ఉండాలంటే గోళ్లు నీట్‌గా పద్ధతిగా అందంగా కట్ చేసుకోండి.

పెళ్లి కూతురు అందంగా....
రాత్రిపూట వేళ్లకి, చేతులకి, పెదాలకి కోల్డ్‌క్రీమ్ అప్లై చేయండి. పెళ్లికి ముందు రోజుల్లో, ప్రతిరోజూ కొద్దిగా పంచదారని తీసుకుని అందులో నిమ్మరసం వేసుకొని రెండు చేతులను బాగా రుద్దుకోండి. పంచదారా కరిగేవరకూ ఇలా చేస్తే చేతివేళ్ల చర్మానికి మెరుపు వస్తుంది. తేనెతో కూడా ఇలా చెయ్చొచ్చు.

పెళ్లి కూతురు అందంగా....
రాత్రిపూట వేడిపాలు తీసుకోండి. పెళ్లి ఇంకా అయిదారు రోజులు ఉందనగా పెళ్లి దగ్గర పడే కొద్ది ఎంత వద్దనుకున్నా ఏదో తెలియని ఉద్వేగం ఆవహిస్తుంటుంది.

పెళ్లి కూతురు అందంగా....
పెళ్లికి సంబంధించిన ఏ విషయాలు మీరు ఆలోచించకండి. అలాగే మీ పెద్దల మాటలు, పట్టింపులను లైట్‌గా తీసుకోండి. ఇవన్నీ పెళ్లిలో మామూలే. తెలిసి, తెలియనితనంతో ఏదేదో ఊహించుకుని బాధపడుతుంటారు. పెళ్లికూతురు లేదా పెళ్లికొడుకు.



Click it and Unblock the Notifications
