Latest Updates
-
ఎండల దెబ్బకు పీసీఓఎస్, పీరియడ్స్ సమస్యలు పెరుగుతున్నాయా? ఈ జాగ్రత్తలు మీకోసమే! -
ఎండల మంటల్లో పెళ్లిళ్లు.. వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే ఈ మార్పులు తప్పనిసరి! -
జేబులో ఉల్లిపాయ పెట్టుకుంటే వడదెబ్బ తగలదా? -
సూరత్‌లో దారుణం: భార్యను సిమెంట్ బాక్సులో దాచిన భర్త.. బంధాల్లో ఈ 'రెడ్ ఫ్లాగ్స్' కనిపిస్తే జాగ్రత్త! -
షుగర్ ఫ్రీ పుదీనా లస్సీ.. వేసవిలో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం! -
వేసవి తాపాన్ని తగ్గించే సత్తు లడ్డూ.. ఈ ఎండలకు బెస్ట్ స్వీట్ ఇదే! -
NEET UG 2026 అడ్మిట్ కార్డులు వచ్చేసాయి.. పరీక్షలో విజయం సాధించాలంటే ఈ చివరి నిమిషం జాగ్రత్తలు తప్పనిసరి! -
పాలు వద్దు, పంచదార వద్దు.. పటిక బెల్లంతో 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ రవ్వ లడ్డు! -
ఏప్రిల్ 27 రాజయోగం: ఈ రాశుల వారికి ధన యోగం.. ఇక తిరుగులేదు! -
ఈ చేప మగాళ్లకు సర్వరోగ నివారిణి..ఒకేసారి బలం,ఓపిక వచ్చేస్తుంది!
దంతాలను తెల్లగా మిళమిళ మెరిపించే 13 పవర్ ఫుల్ హోం రెమెడీస్
దంతాలు ఎంత శుభ్రంగా అంటే ఆ వ్యక్తి అంత ఆరోగ్యం ఉంటారని డాక్టర్ల విశ్వాసం. అయితే కొంత మందిని దగ్గరగా చూసినట్లైతే, దంతాలు అశుభ్రంగా లేదా , పసుపు పచ్చవర్ణంలో ఉంటాయి. దంతాలను శుభ్రపరచడానికి, మరియు తెల్లగా మంచి షైనింగ్ పొందడానికి టూత్ పేస్ట్ ఒక్కటి సరిపోదు. టూత్ పేస్ట్ కంటే, మరింత గ్రేట్ గా, హెల్తీగా దంతాలను కనబడేలా చేసేవి కొన్ని ఉత్తమ హోం రెమెడీస్ కూడా ఉన్నాయి. దంతాలను తెల్లగా మెరిపించడానికి అనేక రకాలైన నేచురల్ హోం రెమెడీస్ ఉన్నాయి. వీటిని మనం సురక్షితంగా ఉపయోగించుకోవచ్చు.
అదెలాగంటే, మన వంటగదిలోని ఉప్పు తీసుకొని, నీటిలో వేసి నోట్లో పోసుకొని పుక్కలించడం వల్ల దంతాల మీద ఉన్న ఎనామిల్ తొలగిపోతుంది. లేదా పేస్ట్ కు కొద్దిగా ఉప్పు చేర్చి దంతాలను శుభ్రపరుచుకోవచ్చు. దంతాలను శుభ్రపరుచుకోవడంలో పేస్ట్ మాత్రమే కాదు, కోల్స్ మరియు ఉప్పు రెండింటిని కూడా పురాతన కాలంలో ఎక్కువగా ఉపయోగించే వారు.
కాబట్టి, మీ దంతాలు, క్లియర్ గా మంచి షైనింగ్ తో మెరిపించడానికి ఈ రోజు బోల్డ్ స్కై మీముందుకు కొన్ని చిట్కాలను తీసుకొస్తున్నది. వీటిని వారానికొకసారి ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఆలివ్ ఆయిల్ మరియు బాదం ఆయిల్:
ఆలివ్ ఆయిల్ మరియు బాదం ఆయిల్ రెండింటిని మిక్స్ చేసి దంతాలను శుభ్రం చేసుకోవాలి. ఉదయం నిద్రలేచిన వెంటనే ఈరెండింటి కాంబినేషన్ లో దంతాలను 5క్రమంగా శుభ్రం చేసుకోవడం వల్ల మీ దంతాలు తెల్లగా మారుతాయి.

స్ట్రాబెర్రీ స్ర్కబ్:
గుప్పెడు స్ట్రాబెర్రీ పండ్లను పేస్ట్ చేసి, ఆపేస్ట్ నుమీ దంతాల మీద కోటింగ్ లా పూతపూయాలి. కొద్దిసేపు నోరు అలాగే తెరిచి ఉంచుకొని, తడి ఆరనివ్వాలి . తడి ఆరిన తర్వాత పాలతో నోటిని శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది మరియు దంతాలు తెల్లగా మిళమిళ మెరుస్తుంటాయి.

నిమ్మరసం:
నిమ్మకాయను రెండు బాగాలుగా కట్ చేసి నిమ్మతొక్కను నీటిలో ముంచి, ఆ నీటితోనే నిమ్మతొక్కను తీసుకొని దంతాల మీద రుద్దాలి.ఈ చిట్కాను వారానికొకసారి ఉపయోగించడం

క్యారెట్ జ్యూస్:
దంతాలను తెల్లగా మిళమిళ మెరిపించడంలో ఒక బలమైన పదార్థం క్యారెట్ జ్యూస్ , క్యారెట్ జ్యూస్ ను అప్లై చేయడానికి ముందు దంతాలకు కొద్దిగా ఉప్పు రాసుకోవాలి.

బేకింగ్ సోడా:
చిటికెడు నిమ్మరసానికి, బేకింగ్ సోడా మిక్స్ చేసి, పేస్ట్ లా తయారుచేయాలి. ఈపేస్ట్ ను దంతాలకు పట్టించి, 10నిముషాల తర్వాత రుద్ద నీటితో కడిగేయాలి. అయితే, ఈ చిట్కాలను రెగ్యులర్ గా ఫాలో అవ్వకూడదు. ఎందుకంటే దంతాలు చాలా సెన్సిటివ్ గా ఉంటాయి కాబట్టి.

ఆపిల్ కొరికి తినడం:
రోజుకు ఒక్క ఆపిల్ తినడం వల్ల డాక్టర్ల అవసరం ఉండదని అంటుంటారు. అదే విధంగా ఆపిల్ ఆరోగ్యానికే కాదు, దంతాలకు కూడా చాలా మేలైన ఆహారం. ఆపిల్ తినడం వల్ల , దంతాల మీద ఏర్పడ్డ పాచి, ఎల్లో మరక తొలగిపోతుంది , అదే సమయంలో దంతాలను బలోపేతం చేస్తుంది.

ఆరెంజ్ తొక్కతో:
దంతాలను ముత్యాల్య మిళమిళ మెరిపించాలనుకుంటే, ఆరెంజ్ తొక్క చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఆరెంజ్ తొక్కను మీ దంతాల మీద వారానికొకసారి రుద్దడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

పాలు మరియు పెరుగు కాంబినేషన్:
పాలు మరియు పెరుగు కాంబినేషన్ క్రీమ్ గా తయారుచేసుకొని, దంతాల మీద మర్దన చేసి, 15నిముషాలు అలాగే వదిలేసి, తర్వాత మంచినీటితో శుభ్రం చేసుకోవాలి . ఇది మీ దంతాలకు మంచి షైనింగ్ ను అందిస్తుంది . దీన్ని వారానికి ఒకసారి అనుసరించవచ్చు.

బిర్యానీ ఆకు:
బిర్యానీ ఆకును మెత్తగా పొడి చేసి, కొద్దిగా పాలు మిక్స్ చేసి ఈ పేస్ట్ ను దంతాల మీద అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత నోటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఈనేచురల్ రెమెడీని తిరిగి అనుసరిస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్:
పసుపు దంతాలను త్వరగా నివారించుకోవాలనుకుంటే, ఆపిల్ సైడర్ వెనిగర్ తో నోటిని శుభ్రం చేసుకోవాలి. ఆపిల్ సైడర్ వెనిగర్ ను నోటిలో వేసి పుక్కలించిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొంటే పుల్లదనం పోతుంది.

అలోవెరా:
కలబందను దంతాలతో కొరకడం వల్ల, మీ దంతాలు తెల్లగా మెరుస్తుంటాయి. తెల్లని దంతాలను పొందడానికి ఇది ఒక నేచురల్ హోం రెమెడీ .

పసుపు:
పసుపు పొడి మీ దంతాలను పసుపుగా మార్చుతుందని మీరు అనుకుంటే పొరపాటే, ఎందుకంటే, పసుపు మరియు పాల యొక్క మిశ్రమం దంతాలను శుభ్రం చేయడంతో పాటు, ఇన్ఫెక్షన్ లేకుండా చేస్తుంది.

వేపాకు:
గుప్పెడు వేపాకును నోట్లో వేసుకొని నమలాలి. ఆకులను మెత్తగా పేస్ట్ చేసి, దంతాలకు అప్లై చేసి, తర్వాత బ్రష్ చేయాలి.



Click it and Unblock the Notifications