Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి!
కాలి మడమలు నల్లగా ఇబ్బంది పెడుతున్నాయా..
మహిళల శరీరంలో మరో అందమైన భాగం కాళ్ళు. ముఖంతో పాటు, కాళ్ళు చేతులు కూడా శుభ్రంగా.. అందంగా..నాజూగ్గా ఉన్నట్లైతే చూడటానికి చాలా చక్కగా ఇతరులను కూడా ఆకర్షించే విధంగా ఉంటాయి. అయితే కొంత మంది స్త్రీలను పరిశీలించినట్లైతే వారి ముఖం, చేతులు అందంగా కనిపించినా, కాళ్ళు మాత్రం అసహ్యంగా ఉంటాయి. అందుకు కారణం వారు ముఖం మీద తీసుకొనే శ్రద్ద కాళ్ళ మీద చూపకపోవడమే.
కొంత మంది కాళ్ళను పరిశీలించినట్లైతే కాలి మడమల వద్ద బ్రౌన్ లేదా బ్లాక్ గా ఉంటుంది. అందుకు కారణం కాలి మడమ వద్ద ఉండే చర్మం మందంగా ఉండటం. ఆ ప్రదేశంలో షూ మరియు రఫ్ గా ఉండే దుస్తులు తగడం వల్ల డ్రైగా మారుతుంది . అంతే కాదు, ఆ ప్రదేశంలో శరీరంలో ఇతర భాగాల్లో కంటే, కాలిమడమల వద్ద రక్తప్రసరణ చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా ఎక్కువగా పొడి బారడం, సన్ టానింగ్ మొదలగునవన్ని కాలి మడమలు డార్క్ గా మారడానికి ప్రధాణ కారణలు . అయితే కొన్ని హోం రెమెడీస్ ఉపయోగించడం వల్ల కాలి మడమల వద్ద నలుపును నివారించవచ్చు.
READ MORE: అందమైన సున్నిత పాదాలకు 10 సులభ చిట్కాలు
ఈ సమస్య మహిళల్లోనే కాదు, పిల్లలు, వయస్సైన వారిలో కూడా ఈ సమస్య కనబడుతుంది. ముఖ్యంగా ఫెయిర్ స్కిన్ కలవారికి మరింత అసహ్యంగా కనబడుతుంది. అలా కనబడకుండా మీ పాదాలను అందంగా చూపించే కొన్ని హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ...

1. బాదం పేస్ట్ :
కొన్ని బాదంను నీళ్ళల్లో నానబెట్టి, ఒక గంట తర్వాత పాలు మిక్స్ చేసి, మిక్సీలో వేసి మెత్తగా పేప్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను కాళ్ళ మడమల వద్ద అప్లై చేసి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి . పాలకు బదులుగా తేనె కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ రెమెడీ రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

2. నిమ్మరసం:
నిమ్మరసం నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్ అందుకు బ్లాక్ యాంకిల్ రెమెడీగా దీన్ని ఉపయోగిస్తారు. నిమ్మ తొక్కతో నల్లగా ఉన్న మడమల వద్ద 5-10నిముషాల వరకూ మర్ధన చేయాలి.

3. క్యాస్ట్రోఆయిల్:
నిద్రించే ముందు కాలి మడమలకు ఆముదం అప్లై చేసి బాగా మసాజ్ చేయాలి. 10 నిముషాలు మసాజ్ చేసి తర్వాత, సాక్సులను ధరించాలి . తర్వాత రోజు ఉదయం స్నానం చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

4. కలబంద:
నల్లగా ఉన్న కాలి మడమల వద్ద కలబంద గుజ్జును అప్లై చేసి అరగంట పాటు అలాగే ఉండనిచ్చి తర్వాత కడిగేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా రెండు వారాల పాటు, రోజుకు రెండు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

5. బంగాళదుంప:
డార్క్ యాంకిల్ నివారించేడ మరో ఉత్తమ హోం రెమెడీ. ఎందుకంటే బంగాళదుంపలో మన్నికైన ఎసిడిక్ లక్షణాలున్నాయి. ఇది ఇక బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. బంగాళదుంపను ముక్కలుగా కట్ చేసి రెగ్యులర్ గా మసాజ్ చేయాలి మడిమల చుట్టూ డార్క్ స్కిన్ తొలగిస్తుంది.

6. ఆరెంజ్ తొక్క:
డార్క్ యాంకిల్ ను నివారించడంలో ఆరెంజ్ తొక్క చాలా గ్రేట్ గా పనిచేస్తుంది. మడమల వద్ద డార్క్ స్పాట్స్ ను నివారించడానికి ీ హోం రెమెడీ గ్రేట్ గా సహాయపడుతుంది . ఆరెంజ్ తొక్క, రోజ్ వాటర్, పాలు వేసి బాగా మిక్స్ చేయాలి . ఈ మిశ్రమాన్ని మడమల వద్ద అప్లై చేసి 20నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. మరింత ఉత్తమ ఫలితాలకోసం చిటికెడు పసుపు వేసుకోవాలి. అందులో నిమ్మరసం కూడా జోడిస్తే మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

7. గ్లిజరిన్ మరియు రోజ్ వాటర్:
గ్లిజరిన్ లో బ్లీచింగ్ లక్షణాలు పుష్లకంగా ఉన్నాయి. గ్లిజరిన్ మరియు రోజ్ వాటర్ సమంగా తీసుకొని అందులో కొద్దిగా తేనె మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని డార్క్ మడమల వద్ద అప్లై చేయాలి. 45నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా 10రోజుల పాటు క్రమం తప్పకుండా అనుసరిస్తే మంచి ఫలితం ఉంటుంది.

8. బేకింగ్ సోడా:
బేకింగ్ సోడాలో కొద్దిగా వాటర్ మిక్స్ చేసి, పేస్ట్ లా చేసి 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. అలాగే రెండు మూడు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాను గోరువెచ్చని నీటిలో వేసి కాళ్ళను అందులో డిప్ చేసి తర్వాత బయట తీసి, మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నల్లగా ఉండే మడమలు, రంగులో మార్పు వస్తుంది.

9. కొబ్బరి నూనె మరియు నిమ్మరసం:
ఒక చెంచా కొబ్బరి నూనెలో అరచెంచా నిమ్మరసం మిక్స్ చేసి, బ్లాక్ గా ఉన్న ప్రదేశంలో అప్లై చేసి 15నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

10. పాలు :
పాలలో విటమిన్స్ మరియు ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది స్కిన్ వైటనింగ్ పదార్థంగా పనిచేస్తుంది. ఇది స్కిన్ టోన్ మార్చడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . ఒక చెంచా బియ్యం పిండిలో 3 చెంచాలి ఫ్రెష్ మిల్క్ వేసి, బాగా మిక్స్ చేసి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

11. కోక బట్టర్:
డార్క్ యాంకిల్ కు కొద్దిగా కోకబట్టర్ అప్లై చేయాలి 5నిముషాల సున్నితమైన మసాజ్ చేయాలి. 20నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

12. కీరదోసకాయ:
కీరదోసకాయ రసంలో కొద్దిగా పసుపు మిక్స్ చేసి కాలి మడమల వద్ద అప్లై చేయాలి . ఇది ఒక అద్భుతమైన హోం రెమెడీ.

13. ఆలివ్ ఆయిల్:
రోజూ నిద్రపోయే ముందు రెండు, మూడు చుక్కల ఆలివ్ ఆయిల్ తీసుకొని డార్క్ గా ఉన్న కాలిమడమల వద్ద అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

14. స్క్రబ్బింగ్:
ఫ్యూమిస్ స్టోన్ తో డార్క్ యాంకిల్ వద్ద స్ర్కబ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. డెడ్ స్కిన్ తొలగిపోతుంది. నలుపును తేలిక పరుస్తుంది.



Click it and Unblock the Notifications











