Latest Updates
-
చలికాలంలో ఎముకలను దృఢంగా ఉంచే రాగి మునగాకు రోటీ..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ -
టపాసుల నిప్పురవ్వలు పడి చర్మం కాలితే వెంటనే చేయాల్సిన, చేయకూడని పనులివే! -
దీపావళి స్పెషల్..బ్యాచిలర్స్ కూడా సులభంగా వండేలా.. అదిరిపోయే పొల్లాచి చికెన్ బిర్యానీ చేసుకోండిలా.. -
దీపావళి స్పెషల్.. రొటీన్ కు భిన్నంగా నోరూరించే గుంటూరు చికెన్ రోస్ట్.. ఈజీగా చేసుకోండిలా.. -
నువ్వు దేవుడివి సామీ: ఉద్యోగులకు దీపావళి బోనస్ గా 20 లక్షల రూపాయలు ఇచ్చిన వ్యాపారి..వీడియో చూడండి -
డాక్టర్ హెచ్చరిక..సైలెంట్ గా కాలుతాయి కదా అని ఈ 3 టపాసులు పిల్లలకు ఇస్తే పెను ప్రమాదమే! -
ఎముకలను బలపరిచే పోషకాల నిధి.. దీపావళి పండుగ స్పెషల్ గా పెసరపప్పు పాయసం చేయండిలా.. -
Diwali 2026 Wishes in Telugu: మీ బంధుమిత్రులకు ప్రత్యేకంగా దీపావళి శుభాకాంక్షలు చెప్పండిలా.. -
రెస్టారెంట్ స్టైల్ పనీర్ భుర్జీ మసాలా గ్రేవీ.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
బంగాళదుంపతో ఇలా దోశ వేస్తే రుచికి ఫిదా అవ్వాల్సిందే.. తయారీ విధానం ఇదే..
కీళ్ల నొప్పులు మాయం చేసే 1:4 మ్యాజిక్..ఇలా చేస్తే జీవితంలో మోకాళ్ల నొప్పులు రావు!
చిన్నా, పెద్ద అనే ఏజ్ తేడా లేకుండా ఈ రోజుల్లో చాలామంది జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్, మోకాళ్ల నొప్పుల సమస్యలతో బాధపడతున్నారు. అయితే రోగం వచ్చాక దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే మందే దాన్ని రాకుండా అడ్డుకోవడం ఉత్తమైన పద్దతి. మీకు భవిష్యత్తులో కూడా జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్, మోకాళ్ల నొప్పులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీ జాయింట్స్ కి (కీళ్లు)ఆయుష్షు పెంచే మూడు పద్ధతులను ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ హారతి సూచించారు. అవేంటో ఇక్కడ చూడండి.
1:4 మ్యాజిక్
మీ శరీర బరువు మీ మోకాళ్లపై చాలా ప్రభావం చూపుతుంది. మీ బరువు ఎంతైనా ఉండనీ..మీరు 1 కేజీ బరువు తగ్గినట్లయితే దానర్థం 4 కేజీల ఒత్తిడిని జాయింట్స్ నుంచి దించేస్తున్నారని అర్థం. బరువును అదుపులో ఉంచుకోవడం వల్ల కీళ్లపై అనవసరమైన ఒత్తిడి తగ్గి, నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.

మూమెంట్(Movement)
కదలిక అనేది జాయింట్ హెల్త్ కి చాలా ముఖ్యమైనది. కదలిక లేకపోతే యంత్రాలైనా, మన కీళ్లైనా బిగుసుకుపోతాయి. మీరు ఎంత యాక్టివ్ గా కదులుతూ ఉంటే, కీళ్ల మధ్య రాపిడిని నివారించే సహజమైన గుజ్జు (జిగురు) అంత బాగా ఉత్పత్తి అవుతుంది. ఇందుకోసం వారానికి కనీసం 3 సార్లు కండరాలను బలపరిచే (స్ట్రెంగ్తెనింగ్) వ్యాయామాలు చేయాలి. అలాగే స్విమ్మింగ్, సైక్లింగ్ వంటివి మీ దినచర్యలో భాగం చేసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పులు దరిచేరవని డాక్టర్ హారతి వివరిస్తున్నారు.

యాంటీ ఇన్ ఫ్లమేటరీ డైట్(anti inflammatory diet)
కీళ్ల ఆరోగ్యానికి ఏది మంచి డైటో అది తీసుకోవాలి. కీళ్లలో మంట, వాపు రాకుండా ఉండాలంటే.. ఒమేగా 3 ఉన్న వాల్ నట్స్, బెర్రీలు లేదా ఆకు కూరలు, ఎక్స్ ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ 1 స్పూన్ తీసుకోవాలని డాక్టర్ హారతి సూచించారు. ఇదే సమయంలో విటమిన్ డి కూడా శరీరానికి చాలా చాలా ముఖ్యమని తెలిపారు.
చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారాలు, ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్స్, బ్యాడ్ ఆయిల్స్ కు పూర్తిగా దూరంగా ఉండి.. మంచి యాంటీ ఇన్ ఫ్లమేటరీ డైట్ తీసుకోవడం వల్ల మీ జాయింట్స్ మీరు కాపాడుకోవచ్చని డాక్టర్ తెలిపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
