అందమైన అమ్మాయి పిలిచిందని వెళ్తే..యువకుడికి ఊహించని షాక్!

ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు జరగ్గక కొందరు, పెళ్లయి భాగస్వామితో సంతృప్తి చెందక మరొికొందరు ఆన్ లైన్ డేటింగ్ యాప్ ల ద్వారా కొత్త వ్యక్తులను పరిచయం చేసుకుని వారితో గడిపేందుకు ఇష్టపడుతన్నారు. అయితే ఇదే అదునుగా చేసుకుని కొందరు వ్యక్తులు ముఠాలుగా ఏర్పడి మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా డేటింగ్ యాప్ లో పరిచయం అయిన ఓ అమ్మాయి కలుద్దాం అని చెప్పగానే ఎగరేసుకుంటూ వెళ్లిన యువకుడి జీవితంలో మర్చిపలేని అనుభవ మిగిలిపోయింది. అందమైన అమ్మాయి రా అంటే ఎగేసుకు వెళ్లకూడదు, ఒక్క నిమిషం ఆలోచించాల్సిందేనని అతడికి జరిగిన ఉదంతం పట్ల నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అసలేం జరిగిందో ఇక్కడ చూడండి.

బీహార్ రాష్ట్రంలోని వెస్ట్ చంపారన్ కు చెందిన జైద్ అహ్మద్(zaid ahmad)అనే వ్యక్తి ఆన్ లైన్ డేటింగ్ ఫ్లాట్ ఫామ్ అయిన టిండర్ యాప్ వాడుతుంటేవాడు. ఈ క్రమంలో ఇటీవల ఆ యాప్ లో సన్యా పేరుతో ఉన్న ఒక ఫ్రొఫైల్ ఉన్న అమ్మాయితో కనెక్ట్ అయ్యాడు. ఇద్దరూ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. బ్లైండ్ డేట్ కోసమని నవంబర్ 1న ఢిల్లీలోని జీటీబీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర కలుద్దాం రా అహ్మద్ ని పిలిచింది. అందమైన అమ్మాయి పిలిస్తే మనోడు ఆగుతాడా ఇక ఎగరేసుకుంటూ ఆ అమ్మాయి చెప్పిన టైంకి వెళ్లాడు. అనుకున్నట్లే ఇద్దరూ కలుసుకున్నారు కూడా. సాయంత్రం సమయంలో కాసేపు కబర్లు చెప్పుకున్నారు.

Tinder Date Trap Youth Falls for Blind Date Scam Forced to Pay 26K Cafe Bill in Delhi

ఆ తర్వాత అహ్మద్ ని ముఖర్జీ నగర్ లోని హడ్సన్ లేన్ లోని బ్లాక్ ఫాంథర్ కేఫ్ కి తీసుకెళ్లింది. మంచిగా ఫుడ్ ఐటమ్స్, విస్కీ, ఇతర కాస్ట్లీ మందు బ్రాండ్స్ ఆర్డర్ చేసి పీకల దాకా తిని,తాగి చిల్ అయ్యింది. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ కేఫ్ లోని ఒక వెయిటర్ వచ్చి అహ్మద్ చేతికి 26 వేల రూపాయలు అయ్యింది బిల్లు కట్టండి అని ఒక చేతిరాతతో ఉన్న స్లిప్ ఇచ్చాడు. అయితే ఇంత ఎందుకు అయ్యింది అని అహ్మద్ ప్రశ్నించాడు. వెంటనే కేఫ్ ఓనర్, ఇతర ఉద్యోగులు అక్కడికి వచ్చి నిన్ను డబ్బులు కట్టకపోతే వెళ్లనివ్వం అని అడ్డుకున్నారు.

 కీళ్ల నొప్పులు మాయం చేసే 1:4 మ్యాజిక్..ఇలా చేస్తే జీవితంలో మోకాళ్ల నొప్పులు రావు! కీళ్ల నొప్పులు మాయం చేసే 1:4 మ్యాజిక్..ఇలా చేస్తే జీవితంలో మోకాళ్ల నొప్పులు రావు!

దీంతో భయపడి అహ్మద్ తన తండ్రికి ఫోన్ చేసి కేఫ్ వాళ్లు ఇచ్చిన క్యూఆర్ కోడ్ పంపగా..ఆయన ఆ డబ్బులను స్కాన్ చేశాడు. దీంతో అహ్మద్ ని అక్కడి నుంచి వెళ్లేందుకు వదిలిపెట్టారు. అయితే ఆ మహిళ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అక్కడి నుంచి సైలెంట్ గా ఎస్కేప్ అయ్యింది. తర్వాత అహ్మద్ పోలీసులకు కంప్లెయింట్ ఇచ్చాడు.పోలీసులు కేసు నమోదుచేసి బ్లాక్ ఫాంథర్ కేఫ్ ఓనర్ జావేద్(38), మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. పారిపోయిన మహిళ అసలు పేరు నికితాగా గుర్తించారు.

Story first published: Monday, November 9, 2026, 12:52 [IST]
Desktop Bottom Promotion