Latest Updates
-
బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే రవ్వ బన్ అప్పం.. తింటే వదలరు..10 నిమిషాల్లోనే చేసుకోండిలా -
కీళ్ల నొప్పులు మాయం చేసే 1:4 మ్యాజిక్..ఇలా చేస్తే జీవితంలో మోకాళ్ల నొప్పులు రావు! -
చలికాలంలో ఎముకలను దృఢంగా ఉంచే రాగి మునగాకు రోటీ..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ -
టపాసుల నిప్పురవ్వలు పడి చర్మం కాలితే వెంటనే చేయాల్సిన, చేయకూడని పనులివే! -
దీపావళి స్పెషల్..బ్యాచిలర్స్ కూడా సులభంగా వండేలా.. అదిరిపోయే పొల్లాచి చికెన్ బిర్యానీ చేసుకోండిలా.. -
దీపావళి స్పెషల్.. రొటీన్ కు భిన్నంగా నోరూరించే గుంటూరు చికెన్ రోస్ట్.. ఈజీగా చేసుకోండిలా.. -
నువ్వు దేవుడివి సామీ: ఉద్యోగులకు దీపావళి బోనస్ గా 20 లక్షల రూపాయలు ఇచ్చిన వ్యాపారి..వీడియో చూడండి -
డాక్టర్ హెచ్చరిక..సైలెంట్ గా కాలుతాయి కదా అని ఈ 3 టపాసులు పిల్లలకు ఇస్తే పెను ప్రమాదమే! -
ఎముకలను బలపరిచే పోషకాల నిధి.. దీపావళి పండుగ స్పెషల్ గా పెసరపప్పు పాయసం చేయండిలా.. -
Diwali 2026 Wishes in Telugu: మీ బంధుమిత్రులకు ప్రత్యేకంగా దీపావళి శుభాకాంక్షలు చెప్పండిలా..
విటమిన్ A, C, K, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉండే ఈ కూర తింటే చలికాలంలో రోగాలన్నీ పరార్!
ఆవాల ఆకు కూర, జొన్న రొట్టె.. చలికాలంలో ఈ కాంబినేషన్ ఇచ్చే అద్భుతమైన రుచి మరొకటి ఉండదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ ఆకుకూరల మిశ్రమం, చలిలో మన శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుంది. ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా పంజాబ్లో అత్యంత ప్రజాదరణ పొందిన సాంప్రదాయ వంటకం.
ఆవకూరలో విటమిన్ A, విటమిన్ C, విటమిన్ K, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఉండే అధిక ఫైబర్ పదార్థం జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి శరీరాన్ని రక్షించి, వెచ్చదనాన్ని ఇస్తుంది. ఆవకూర కాస్త చేదు,ఘాటుగా ఉంటుంది కాబట్టి దాని చేదును బ్యాలెన్స్ చేయడానికి దీని తయారీలో పాలకూర, బతువా ఆకులు ఉపయోగిస్తుంటారు. ఆవాల ఆకూ కూర ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
తాజా ఆవాల ఆకులు - 500 గ్రాములు
లేత పాలకూర - 250 గ్రాములు
బతువా ఆకులు (చక్రవర్తి కూర) - 125 గ్రాములు
మెంతి ఆకులు - 100 గ్రాములు
అల్లం - 1 అంగుళం ముక్క
వెల్లుల్లి రెబ్బలు - 10
పచ్చి మిరపకాయలు - 3
నీరు - 1 కప్పు
ఉప్పు - మీ రుచికి తగినంత
మొక్కజొన్న పిండి - 4 టేబుల్ స్పూన్లు
తాలింపు కోసం కావలసినవి:
నెయ్యి లేదా తెల్ల వెన్న - 3 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - 1 టీస్పూన్
ఇంగువ - ఒక చిటికెడు
పెద్ద ఉల్లిపాయ - 1
టమోటాలు - 2
అల్లం - 1 అంగుళం
వెల్లుల్లి రెబ్బలు - 4
ఎండు మిరపకాయలు - 2
ఎర్ర కారం పొడి - అర టీస్పూన్
చలికాలంలో ఎముకలను దృఢంగా ఉంచే రాగి మునగాకు రోటీ..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్
తయారీ విధానం
-ముందుగా ఆవాలు, పాలకూర, బతువా, మెంతి ఆకులను మట్టి లేకుండా రెండుసార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని, అందులో ఈ ఆకుకూరలు అన్నీ వేయండి. దానికి సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, సరిపడా ఉప్పు మరియు ఒక కప్పు నీరు కలపండి. కుక్కర్ మూతపెట్టి, మధ్యస్థ మంట మీద 4-5 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించండి. ఆకులు మెత్తబడ్డాక, స్టవ్ ఆపి ప్రెషర్ దానంతట అదే పోయే వరకు ఆగి, ఆ తర్వాతే మూత తెరవండి.
-ఉడికించిన ఆకుకూరలను మిక్సీలో వేయకుండా, ఒక పప్పు గుత్తి లేదా మ్యాషర్ తీసుకుని చేత్తో బాగా మెత్తగా రుబ్బాలి. ఇప్పుడు మొక్కజొన్న పిండిని ఒకేసారి వేయకుండా, కూర ఉండలు కట్టకుండా గరిటెతో నిరంతరం కలుపుతూ కొద్దికొద్దిగా వేయాలి. పిండి కలిశాక, ఈ మిశ్రమం చిక్కగా, మృదువుగా మారే వరకు, సుమారు 10 నుండి 15 నిమిషాల పాటు తక్కువ మంట మీద నెమ్మదిగా ఉడకనివ్వాలి.
-ఒక బాండీలో నెయ్యి లేదా వెన్న వేడి చేయండి. నెయ్యి కరిగాక జీలకర్ర, చిటికెడు ఇంగువ, ఎండు మిరపకాయలు వేసి వేయించండి. సువాసన రాగానే సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం వేసి లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి లేత గోధుమ రంగులోకి మారే వరకు వేపాలి. ఆ తర్వాత టమోటా ముక్కలు, ఎర్ర కారం పొడి వేసి, నెయ్యి మిశ్రమం నుండి వేరుపడటం ప్రారంభమయ్యే వరకు అనగా టమోటాలు బాగా మగ్గేదాకా ఉడికించండి.
-సిద్ధం చేసుకున్న ఈ ఘుమఘుమలాడే తాలింపులో, ఉడికించి పెట్టుకున్న చిక్కటి ఆకుకూరల మిశ్రమాన్ని వేయండి. తాలింపు రుచులన్నీ బాగా పట్టేలా అన్నీ కలిపి, సుమారు 5 నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడికించండి.
-అంతే ఆవాల ఆకు కూర రెడీ. పక్కన కొంచెం తెల్ల వెన్న, బెల్లం ముక్క పెట్టుకుని తింటుంటే, ఆ రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
