Latest Updates
-
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. ధనలాభం ఖాయం! - సోమవారం, 27 ఏప్రిల్ 2026 -
ఎండలకు నోటికి ఏదీ రుచించడంలేదా? అయితే కమ్మటి మునక్కాడ రసం'ట్రై చేయండి -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణీలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమేనా? -
వైవాహిక అత్యాచారం: పెళ్లి తర్వాత కూడా 'నో' చెప్పే హక్కు లేదా? చట్టాల్లో మార్పులు తప్పనిసరా? -
వాట్సాప్లో పెళ్లి పత్రికలు వస్తున్నాయా? ఈ ఒక్క తప్పు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ! -
చపాతీ, రైస్ దేనిలోకైనా పర్ఫెక్ట్ మ్యాచ్..అదిరిపోయే టమాటో చికెన్ గ్రేవీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వడదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు ఈ 'దేశీ' చిట్కాలు పాటించండి.. ఎండల నుంచి ఉపశమనం ఎలా? -
మండే ఎండలకు చెక్.. ఇంట్లో ఉండే పండ్లతోనే చల్లటి, క్రీమీ ఐస్ క్రీమ్ తయారీ! -
మీ చుట్టూ ఉన్న తేనె పూసిన కత్తులను ఎలా గుర్తించాలి? -
నీట్ యూజీ 2026 అడ్మిట్ కార్డులు వచ్చేస్తున్నాయి.. డౌన్లోడ్ చేసుకోవడం ఎలా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
నల్లగా ఉన్న మెడను తెల్లగా మార్చే హోం మేడ్ నెక్ మాస్క్
సాధారణంగా ఒక అమ్మాయి మెడ చూసిన వెంటనే వారి వయస్సు చెప్పేయచ్చు. దానికి కారణం మెడ యందు ఏర్పడే మడతలు, గీతలు. మృదువైన మెడపైన ఇలాంటి మడతలు ఉండుట కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. మీకు తెలుసా... మన శరీరంలో ఎక్కువగా నిరాదరణకు గురయ్యే భాగాలలో మెడ ఒకటి. సబ్బుతో రుద్ది కడిగినా, స్క్రబ్ చేసి మృతకణాలు తొలగించినా, ప్యాక్ వేసి చర్మం బిగుతుగా చేసినా...అన్నీ ముఖానికి మాత్రమే పరిమితం చేస్తాం. ఎన్ని పాట్లు పడినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అన్నీ కేవలం ముఖ సౌందర్యం పెంచుకోవటానికే!
కానీ దానికి అంటుకొని ఉన్న మెడను మాత్రం మనది కాదన్నట్టు అనాథగా వదిలేస్తాం. ఈ ప్రయత్నాలు వయసు పై బడే కొద్దీ మరింత ముమ్మరం అవుతాయి. కాని వృద్ధాప్యపు జాడలు ముందుగా కనపడేది మెడ మీద, మన చేతుల పై చర్మం మీద అని చాలా మంది గ్రహించరు. అందుకే ఈ రెండు ప్రదేశాలు ఎంతో నిరాదరణకు గురవుతుంటాయి. చక్కటి భుజాలపై అందమైన మెడ స్త్రీల అందాన్ని పెంచి వారిని పొడవుగా, ఎలిగెంట్‌గా కనపడేలా చేస్తాయనటంలో ఎలాంటి సందేహం లేదు. కాని క్రింది తెలుపబడిన చిట్కాలు చేసినట్లైతే అందమైన, మెడ పొందవచ్చును. అందంగా, మృదువుగా కనిపించే 'మెడ' భాగాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు జాగ్రత్తలు తప్పనిసరి.
మెడ అందం మెరుగుపరచడంలో హోం మేడ్ నెక్ మాస్క్ తప్పనిసరి. నెక్ మాస్క్ లు రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే, తప్పనిసరిగా మెడమీద డార్క్ మాస్క్ లేదా లైన్స్ ను నివారించబడుతుంది. ఈ మాస్క్ వేసుకోవడానికి మన వంటగదిలోనే కొన్ని పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఒక సారి చూద్దాం..

నిమ్మరసం & బేకింగ్ పౌడర్
ఒక ఉత్తమ హోం మేడ్ నెక్ మాస్క్ నిమ్మరసం మరియు బేకింగ్ పౌడర్ ఉపయోగించి తయారుచేసుకోవచ్చు . నిమ్మరసం ఒక బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేసి, చర్మాన్ని తేలికపరుస్తుండి. బేకింగ్ పౌడర్ సాగే చర్మంను టైట్ చేస్తుంది.

టమోటో మరియు లెమన్ మాస్క్
టమోటో ఒక బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. డార్క్ లైన్స్ ను నివారిస్తుంది. టమోటో స్లైస్ గా కట్ చేసి నేరుగా మెడ మీద మర్ధన చేయాలి . ఈ నెక్ మాస్క్ ను 20 నిముషాలు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి.

కీరదోసకాయ &టమోటో
కీరదోసకాయ మరియు టమోటోను రెండు మిక్సీలో వేసి మొత్తగా పేస్ట్ చేయాలి. ఈ కాంబినేషన్ పేస్ట్ ను మెడకు ప్యాక్ లా వేసుకోవాలి. ఈ ప్యాక్ చర్మంను టైట్ చేస్తుంది. డార్క్ లైన్స్ ను తొలగిస్తుంది . మీ చర్మంను తెల్లగా మార్చుకోవాలనుకుంటే, అందులో కొద్దిగా నిమ్మరసం జోడించుకోవచ్చు.

వాల్ నట్ మాస్క్
ఈ హోం మేడ్ నెక్ మాస్క్ డెడ్ స్కిన్ సెల్స్ ను నివారిస్తుంది. ముఖ్యంగా మెడ, వాల్ నట్ స్ర్కబ్ చర్మంను కాంతివంతంగా మార్చడంతో పాటు సాప్ట్ గా మార్చుతుంది. వాల్ నట్ లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది.కాబట్టి, నేచురల్ స్క్రబ్బింగ్ గా గ్రేట్ గా సహాయపడుతుంది.

బాదం ఆయిల్ & నిమ్మరసం
బాదం ఆయిల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఈ నేచురల్ ఆయిల్ కు 2టేబుల్స్ స్పూన్ల నిమ్మరసం జోడించాలి. ఈమిశ్రమాన్ని మెడ చుట్టూ అప్లై చేయాలి. ఆలివ్ ఆయిల్ ను జోడించడం వల్ల చర్మం కాంతివంతంగా మార్చుతుంది.

రైస్ వాటర్
బియ్యం కడిగిన నీళ్ళను నల్లగా ఉన్న మెడకు అప్లై చేయాలి. రైస్ వాటర్ గోరువెచ్చగా చేసుకొని తర్వాత అప్లై చేయాలి . ఈ హోం రెమెడీ చర్మాన్ని టైట్ చేస్తుంది.



Click it and Unblock the Notifications