Latest Updates
-
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.?
చర్మం సౌందర్యాన్ని మెరుగుపరిచే హోం మేడ్ షుగర్ స్ర్కబ్
ముందు పంచదారను వైట్ గోల్డ్ అని పిలిచేవారు. ఎందుకంటే ఇది అరుదుగా దొరికే వస్తువు కాదు కాబట్టి ముందు దీని విలువ కూడా ఎక్కువగా ఉండేది. పంచదార స్వీట్స్ తయారు చేయడంలో అతి ముఖ్యమైన వస్తువు. ప్రస్తుతం దీన్ని చర్మ సౌందర్య సాధనాల్లో కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు. దీన్ని చర్మ సౌందర్యానికి ఉపయోగించడం వల్ల చర్మానికి సహజ సౌందర్యాన్ని అందిస్తుంది. ముఖంలో రంధ్రాలు, మతకణాలు ఏర్పడకుండా చేసతుంది. చర్మంలోని నూనె గ్రంధులను సమతుల్యం చేస్తుంది. ముఖ చర్మం జిడ్డు బారకుండా చేస్తుంది.
పంచాదర గ్లైకోల్ యాసిడ్, ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ కలిగి ఉండటం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయ పడుతుంది. నేచురల్ గ్లైకోల్ యాసిడ్ చర్మానికి మంచి కండీషనర్ గాను మాయిశ్చరైజర్ గాను, టాక్సిన్స్ నుండి రక్షణ కల్పిస్తుంది. పంచదారతో ప్రతి రోజు స్ర్కబ్ చేయడం వల్ల చర్మ ఆరోగ్యంగా ఉంటుంది. డెడ్ స్కిన్ ని తొలగించి తాజా చర్మ సౌందర్యాన్ని ఏర్పరుస్తుంది. చాలా సున్నితంగా తయారవుతుంది. పంచదార స్ర్కబ్బింగ్ అన్ని రకాల చర్మాన్ని డీ హైడ్రేట్ చేస్తుంది.
చర్మ సౌందర్యంపై నేటి యువతరం ఎంతగానో జాగ్రత్త పడుతుండటం తెలిసిన విషయమే. మరి పంచదారలో చర్మ రక్షణ అంశాలు ఎంతవరకు ఉన్నాయని తెలుసుకుందామా? పంచదార మృతకణాలను నశింపజేస్తుందని బ్యూటీషియన్లు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఉప్పు వేసి బాడీ స్క్రబ్ కంటే పంచదారతో బాడీ స్క్రబ్ చేసుకోవడం ద్వారా చర్మం మృదువుగా తేమగా ఉంటుందని వారు చెబుతున్నారు.
మరి పంచదారతో బాడీ స్ర్కబ్ ఏవిధంగానో చూద్దాం...

బేసిక్ స్ర్కబ్:
ప్రారంభంలో చాలా సింపుల్ గా మీరు ఉపయోగించుకోవచ్చు. ఒక బౌల్లో అరకప్పు పంచదార తీసుకొని అందులో కొన్ని చుక్కల నీళ్ళు పోసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ఫేస్ ప్యాక్ గా వేసుకొని, మసాజ్ చేసుకోవాలి. ఇది డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది.

ల్యావెండర్ విత్ పంచదార:
ఒక బౌల్లో షుగర్, ఒక చెంచా ల్యావెండర్ ఆయిల్ వేసి బాగా మిక్సి చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చర్మం డ్రైగా ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి . ఇది చర్మంను స్మూత్ గా మరియు పపెల్ గా మార్చుతుంది.

పంచదార మరియు నిమ్మరసం:
ఒక కప్పులు నిమ్మరసాన్ని పిండి అందులో కొద్దిగా షుగర్ మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. ఇది చర్మ సంరక్షణకు ఒక బ్లీచింగ్ ఏజెంట్ గా ఉపయోగపడుతుంది. నిమ్మరసానికి షుగర్ మిక్స్ చేయడం వల్ల ఒక బెస్ట్ క్లీనింగ్ స్క్రబ్ గా మారుతుంది. దీన్ని ఉపయోగించడం వల్ల చర్మం కూడా తెల్లగా మారుతుంది. పంచదార డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది

పంచదార మరియు బ్రౌన్ షుగర్:
బ్రౌన్ షుగర్ ను అప్లై చేస్తే ఇది చర్మంలోని మచ్చలు మరియు మొటిమలు నివారిస్తుంది. అందులో కొద్దిగా వైట్ షుగర్ ను మిక్స్ చేయడం వల్ల స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తుంది.

పంచదార మరియు తేనె:
మీ చర్మం గ్రేట్, సాప్ట్, ఫ్రెష్ మరియు టైట్ గా ఉండాలని కోరుకుంటున్నట్లైతే ఒక కప్పులో వైట్ షుగర్ వేసి మిక్స్ చేయాలి. చిక్కగా పేస్ట్ అయిన తర్వాత దీన్ని శరీరానిక అప్లై చేయాలి. ఇది ఒక బెస్ట్ షుగర్ స్ర్కబ్.

షుగర్ విత్ ఆలివ్ ఆయిల్:
ఆలివ్ ఆయిల్ మరింత బెటర్ స్కిన్ పొందడానికి గ్రేట్ గా సహాయపడుతుంది . ఆలివ్ ఆయిల్ కి కొద్దిగా వైట్ షుగర్ ను అప్లై చేస్తే స్కిన్ రీజనరేట్ అవుతుంది. దాంతో చర్మం ప్రకాశవంతంగా మారుతుంది . డ్రై స్కిన్ కు ఇది ఒక ఫర్ఫెక్ట్ షుగర్ స్ర్కబ్.

పంచదార-కొబ్బరి నూనె:
3చెంచాలా కొబ్బరి నూనెలో కొద్దిగా పంచదార వేసి బాగా మిక్స్ చేయాలి. పంచదార కరిగడం ప్రారంభం అయినప్పుడు ఈ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేయాలి. కొబ్బరి నూనె చర్మానికి పోషణను అందిస్తుంది . మరింత బెటర్ లుక్ ను అందిస్తుంది. ఇంది మరో బెస్ట్ షుగర్ స్ర్కబ్ రిసిపి.



Click it and Unblock the Notifications