Latest Updates
-
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు! -
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
టెన్షన్స్ తో బీపీ పెరుగుతోందా? అయితే బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఉన్నట్లే!..బయటపడే బ్రహ్మాస్త్రం ఇదే! -
షుగర్ కి చెక్, బరువుకు బ్రేక్..రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ రాగి దోశ..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
ఓల్ద్ లుకింగ్ హ్యాండ్స్ తో షేమ్ గా పీలవుతున్నారా..?ఇవిగో సింపుట్ టిప్స్
అందం విషయంలో కళ్లు, ముక్కు, పెదాలు, చెవులు, చేతులు, వేళ్ళు, పాదాలు ఇలా ప్రతి ఒక్క అంగము ప్రాధానపాత్ర వహిస్తాయి. బ్యూటిఫుల్ ఫేస్ మాత్రమే ఉంటే సరిపోదు. చేతులు కూడా అందంగా కనబడాలి . అందం విషయంలో ముఖానికి తీసుకొన్నంత జాగ్రత్తలు చేతులకు, కాళ్లకు తీసుకోవరు . చేతులను నిర్లక్ష్యం చేస్తుంటారు.
మన చేతులతో వాష్ చేయడం, క్లీనింగ్, మొదలగు పనులను చేస్తుంటాము . మరియు కఠినమైన కెమికల్స్ బేస్డ్ డిటర్జెంట్స్ ను ఉపయోగిస్తుంటాము. ఇవి చేతులకు హాని కలిగిస్తాయి. కాబట్టి, మన చేతులకు ఎక్సట్రా కేర్ తీసుకోవడం చాలా అవసరం. చేతులకు కూడీ వీక్లీ మసాజ్ చేయడం షుగర్ తో స్ర్కబ్ చేయడం, ఓట్స్ మరియు నిమ్మరసంతో మాస్క్, ప్యాక్ లు వంటివి వేసుకోవడం మంచిది.
అలాగే వాషింగ్ మరియు క్లీనింగ్ సమయంలో గ్లౌజులు వేసుకోవడం వల్ల చర్మానికి హాని కలగకుండా రక్షణ కల్పించుకోవచ్చు. డిటర్జెంట్స్ లోని కఠినమైన కెమికల్స్ వల్ల చేతులకు రక్షణ కల్పించడానికి గ్లౌజులు సహాయపడుతాయి . రాత్రి పడుకొనే ముందు చేతులకు మాయిశ్చరైజర్స్, ఆయిల్స్ అప్లై చేయడం చాలా అవసరం . చేతులు రెస్ట్ లో ఉన్నప్పుడే ఆయిల్స్ కానీ, మాయిశ్చరైజర్స్ కానీ బాగా పనిచేస్తాయి .
చేతులు అందంగా కాపాడుకోవడనికి ఎలాంటి రాషెస్, ముడుతలు లేకుండా ఉండాలంటే కొన్ని సింపుట్ చిట్కాలను ఉపయోగించాలి. ఇలాంటి సింపుల్ చిట్కాల వల్ల మెనిక్యూర్ చేయించుకోవల్సిన అవసరం ఉండదు.
సింపుల్ హ్యాండ్ కేర్ టిప్స్ ..

1. వదులైన చర్మానికి మసాజ్ చేయాలి:
ఆలివ్ ఆయిల్ తో చేతులకు మసాజ్ చేయాలి. వారానికొకసారి మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది చర్మాన్ని టైట్ చేయడంతో పాటు , చేతుల్లో బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది.

2. చేతులకు సన్ స్క్రీన్ ను అప్లై చేయాలి:
హానికరమైన సన్ రేస్ నుండి చేతులకు రక్షణ కల్పించుకోవడం వల్ల చేతులు వయస్సు మళ్లిన వారివిగా కనిపించకుండా ఉంటాయి . ముఖంతో పాటు చేతులకు కూడా సన్ స్క్రీన్ లోషన్ ను అప్లై చేయాలి . బయట వెళ్లేటప్పుడు తప్పనిసరిగా సన్ స్క్రీన్ లోషన్ ను అప్లై చేసుకోవాలి.

3. చేతులకు డీప్ మాయిశ్చరైజింగ్:
చేతులకు డీప్ గా మాయిశ్చరైజర్ ను అప్లై చేయడం వల్ల చేతుల మీద డ్రై మరియు ఫ్లాకీ స్కిన్ ను నివారించుకోవచ్చు . చేతులు ఎప్పుడు తేమలో ఉండటం వల్ల లేదా తరచూ కడగడం వల్ల చేతుల్లో నేచురల్ మాయిశ్చరైజర్స్ కోల్పోతుంది . కాబట్టి రాత్రి పడుకొనే ముందు చేతుకు పెట్రోలియం జెల్లీని అప్లై చేయాలి.

4. గ్లౌజులు వేసుకోవాలి:
క్లీనింగ్ మరియు వాషింగ్ సమయంలో చేతులకు గ్లౌజులను వేసుకోవడం వల్ల కఠిమనమైన కెమికల్స్ నుండి రక్షణ పొందవచ్చు. చేతుల మీద ఉండే చర్మం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి హార్స్ కెమికల్స్ వాడేటప్పుడు గ్లౌజులు తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి.

5. స్ర్కబ్బింగ్:
షుగర్, ఓట్స్, లేదా కాఫీ, గ్రౌండ్ నట్స్ తో స్ర్కబ్ చేయడం వల్ల చేతుల మీద పెళుసుతనం పోతుంది . మాశయిశ్చరైజర్స్ చర్మం లోతుగా వెళ్ళడం వల్ల మంచి ఫ్లాకీ స్కిన్ నివారించుకోవచ్చు.

6. ఏజ్ స్పాట్స్ ను లైట్ చేస్తుంది:
చేతుల మీద ఏజ్ స్పాట్స్ లేదా చిన్న పిగ్మెంటేషన్ డాంట్స్ ను నివారిస్తుంది. దాంతో చేతులు చూడటానికి అందంగా కనబడుతాయి . ఈ ఏజ్ స్పాట్ సన్ ఎక్స్ ఫోజర్స్ వల్ల జరుగుతుంది. కాబట్టి, చేతులకు బంగాళదుంప, నిమ్మరసం వంటివి అప్లై చేయడం వల్ల ఏజ్ స్పాట్స్ ను తగ్గించుకోవచ్చు.

7. చేతుల మీద ముడుతలను తగ్గించుకోవాలి:
డ్రై స్కిన్ వల్ల చేతుల మీద ముడుతలు కనబడుతుంటాయి. వీటిని తగ్గించుకోవడం కోసం ఎండలో తిరగడం తగ్గించాలి. చేతుల్లో డ్రైనెస్ ను తగ్గించుకోవాలి. అందుకు చేతులకు మాయిశ్చరైజర్స్ మరియు ఆముదం వంటివి అప్లై చేయడం వల్ల చర్మం తెరచుకొనేలా చేసి చర్మం లోపలి నుండి మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. అందుకు వీటిలో ఉండే ఫ్యాటీ ఆసిడ్స్ గ్రేట్ గా సహాయపడుతాయి.

8. చేతులను సోక్ చేయాలి :
రెండు చెంచాల వెనిగర్ మరియు 1చెంచా బేకింగ్ సోడా ఒక బౌల్ గోరువెచ్చని నీటిలో వేసి ఆ నీటిలో 15నిముషాల పాటు సోక్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఫ్లాకీ మరియు డెడ్ స్కిన్ తొలగిపోతుంది. తర్వాత చేతులకు మాయిశ్చరైజర్ ను అప్లై చేయడం వల్ల షాప్ట్ అండ్ సపెల్ హ్యాండ్స్ పొందవచ్చు.



Click it and Unblock the Notifications











