Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
చంకల్లో డార్క్ ప్యాచ్ ను తొలగించే ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ మాస్క్
' స్లీవ్‌లెస్ టాప్‌లను' ధరించే పలువురు మహిళలు నలుగురిలో కాస్తంత ఇబ్బందులు పడుతున్నట్లు కనిపిస్తుంటారు. కారణం వారి చంకల కింద భాగం నల్లబడి ఉండటమే. ఈ నల్లదనాన్ని పోగొట్టి, మీ చంకలు నిఘారింపు సంతరించుకునేందుకు ప్రకృతిలోదాగున్న ఔషుధాలు బేషుగ్గా పనిచేస్తాయి.
చంకల్లో చెమట-దుర్వాసన: నివారించే చిట్కాలు
ఛామన ఛాయ రంగు కలిగిన మహిళలకు చంక కింద భాగంలో ఏర్పడ్డ నల్లదనం స్లీవ్‌లెస్ దుస్తులు ధరించినప్పుడు మరింత చికాకును కలిగిస్తుంది. ఎవరైనా చూస్తే ఎమనుకుంటారోనన్న అపోహలు వెంటాడుతుంటాయి. ఈ సమస్యలకు ఫ్రీక్వెంట్ వ్యాక్సింగ్ అందుబాటులో ఉన్నప్పటికి ఈ పద్ధతి నొప్పికి గురిచేస్తుంది. అయితే పలు సహజసిద్ధమైన చిట్కాలు పాటిస్తే మీ చంక బాగాలను కాంతి వంతం చేసుకోవచ్చు.
మోచేయి నలుపును నివారించడానికి 9సులభ చిట్కాలు
చంక భాగంలో నలుపును నేచురల్ గా నివారించుకోవడానికి పండ్లు మరియు వెజిటేబుల్స్ చాలా గ్రేట్ గా సహాయపడుతాయని నిపుణులు తెలుపుతున్నారు . ఈ పండ్లు, కూరగాయలు ఎఫెక్టెడ్ ఏరియాలో స్కిన్ బ్లీచింగ్ గా పనిచేస్తాయని అంటున్నారు. అలా పనిచేసే వాటిలో నిమ్మరసం, టమోటో మరియు కీరదోస వంటివి ఉన్నాయి. వీటిలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల చర్మం త్వరగా ఫెయిర్ గా కనిపిస్తుంది. మరియు వీటిని ఎలా ఉపయోగించాలో ఈ క్రింది విధంగా తెలుసుకుందాం..

నిమ్మరసం:
నిమ్మరసం చాలా ఎఫెక్టివ్ స్కిన్ బ్లీచింగ్ ఏజెంట్ . సమయం లేనప్పుడు ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . నిమ్మకాయను రెండుగా కట్ చేసి చంక బాగంలో సర్కులర్ మోషన్ లో మర్ధన చేయాలి. తడి ఆరే వరకూ అలాగే ఉండి తర్వాత తిరిగి ప్రయత్నించాలి . ఈ చిట్కాలను నెలలో రెండుసార్లు ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది.

కీరదోసకాయ:
చాలా సింపుల్ గా చంక బాగంలో ఈ కీరదోసకాయ రసాన్ని అప్లై చేయాలి. కీరదోస రసం తడి ఆరిన తర్వాత పెరుగు మీద ఉండే మీగడను తీసిఅప్లై చేయాలి. 15నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. డార్క్ గా ఉండే అండర్ ఆర్మ్ ను తేలికగా తెల్లగా మార్చే ఎఫెక్టివ్ హోం రెమెడీ.

బంగాళదుంప:
బంగాళదుంపను మెత్తగా చేసి అందునుండి తీసిన రసాన్ని లేదా పేస్ట్ ను చంక బాగంలో అప్లై చేయాలి . దీన్ని 15నిముషాలు డ్రైగా మార్చాలి . ఈ పేస్ట్ డ్రైగా మారిన తర్వాత కాటన్ బట్టను నీటిలో డిప్ చేసి చంకల్లో తుడవాలి. ఈ హోం రెమెడీని ప్రతి 15రోజులకొకసారి చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఆరెంజ్:
ఆరెంజ్ తొక్కను మెత్తగా పౌడర్ చేసి, అందులో 3 చెంచాల నిమ్మరసం మిక్స్ చేయాలి . దీన్ని చిక్కగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను చంకల్లో అప్లై చేసి బాగా డ్రై అయిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఆపిల్ :
ఆపిల్ జ్యూస్ సింపుల్ గా చాలా బెస్ట్ గా ఉంటుంది . ముందగా అండర్ అర్మ్ ను శుభ్రం చేసుకొని ఆపిల్ పేస్ట్ ను అప్లై చేసి డ్రై అయిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.

టమోటోలు:
టమోటోలను మెత్తగా పేస్ట్ చేసి దీన్ని చంక బాగంలో అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత మరో సారి రెండో కోట్ గా అప్లై చేయాలి . ఈ వెజిటేబుల్ జ్యూస్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది

పైనాపిల్:
పైనాపిల్ రసాన్ని చంక బాగంలో అప్లై చేసి 10 నిముషాలు బాగా డ్రై అవ్వనివ్వాలి . తర్వాత కాటన్ బాల్ ను మిల్క్ లో డిప్ చేసి చంకబాగంలో తుడవాలి. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

పుసుపు, పాలు
స్నానానికి ముందు పుసుపు, పాలు, నిమ్మరసం కలిపిన పేస్ట్ ను మీ చంకల భాగంలో ఆప్లై చేయండి. ఈ ప్రభావంతో మృతకణాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి.

శాండిల్ ఉడ్ పౌడర్ వెన్
స్నానం చేసిన వెంటనే శాండిల్ ఉడ్ పౌడర్‌ను, వెన్నతో కలిపి చంక భాగంలో రాసుకోండి. ఇలా చేయటం వల్ల చల్లదనంతో పాటు నలుపుదనం మటుమాయమౌతుంది.

విటిమన్ - ఇ ఆయిల్
నాణ్యమైన పసుపుతో పాటు విటిమన్ - ఇ ఆయిల్ తో చంక భాగంలో మర్ధనా చేస్తే మార్పు కనిపిస్తుంది.



Click it and Unblock the Notifications
