International men's day: ప్రతి పురుషుడు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన టెస్టులు ఇవే!

ప్రతి ఏటా నవంబర్ 19న అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ ఏడాది భవిష్యత్తు ప్రతి ఒక్కరిది(the future is everyone)అనే థీమ్ తో మెన్స్ డేతో జరుపుకుంటున్నారు. కుటుంబాలకు, సంఘాలకు, సమాజానికి పురుషులు అందిస్తున్న కృషిని, సహకారాన్ని గుర్తిస్తూ ఈ రోజుని జరుపుకుంటారు. మగవాళ్ల జీవితం అంటే ముళ్ల కంప మీద చెప్పులు లేకుండా నడవడం లాంటిది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ముళ్లు గుచ్చుకోవడం ఖాయం.

కుటుంబబాధ్యతలు, ఆఫీసులో లేదా పనిచేస్తూ మగాళ్లు తమ ఆరోగ్యంపై శ్రద్ద పెట్టడం చాలా తక్కువగా ఉంటది. డబ్బులు ఖర్చు చేస్తే కుటుంబాన్ని పోషించలేం అనే కారణంతో చాలామంది మగాళ్లు తమ ఆరోగ్య సమస్యలను బయటకు చెప్పకుండా బాధను భరిస్తూ కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తుంటారు. ఏదైనా పెద్ద అనారోగ్య లక్షణం కనిపించే వరకు వైద్యుడిని కలవడాన్ని వాయిదా వేస్తుంటారు. నేను బాగానే ఉన్నాను కదా అనే భావనతో సాధారణ పరీక్షలను నిర్లక్ష్యం చేస్తారు.

International Men s Day 2026 Essential Medical Tests Men Shouldn t Ignore

అనారోగ్యకరమైన ఆహారం, బరువు పెరగడం, ధూమపానం, వ్యాయామం లేకపోవడం, నిద్రలేమి వంటి అలవాట్ల వల్ల 20 ఏళ్ల చివరి దశలోనే సమస్యలు మొదలవుతున్న క్రమంలో పురుషులు తప్పనిసరిగా కొన్ని టెస్టులు చేయించుకోవాలని వైద్య నిపుణలు సూచిస్తుంటారు. అవేంటో ఇక్కడ చూడండి.

బీపీ చెకప్

అధిక ఉప్పు, ధూమపానం, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల బీపీ పెరుగుతుంది. ఇది పైకి కనిపించకపోయినా గుండె, మూత్రపిండాలు, రక్తనాళాలను దెబ్బతీస్తుంది. పురుషాంగానికి రక్త ప్రసరణ తగ్గి అంగస్తంభన లోపానికి కూడా దారితీస్తుంది. రీడింగ్ ఎక్కువగా ఉంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.

షుగర్ టెస్ట్

కుటుంబంలో ఎవరికైనా షుగర్ ఉండి ఉంటే, అధిక బరువు, శారీరక శ్రమ లేని జీవనశైలి ఉన్నవారు షుగర్ స్థాయిలను అదుపులో ఉంచుకోవాలి. ఉపవాస (ఫాస్టింగ్), భోజనానంతర రక్త చక్కెరతో పాటు గత మూడు నెలల సగటును చూపే HbA1c టెస్ట్ చేయించుకోవాలి.

పిల్లల ఆట అనుకుంటున్నారా? పెద్దలు ఉయ్యాల ఊగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే!పిల్లల ఆట అనుకుంటున్నారా? పెద్దలు ఉయ్యాల ఊగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే!

కొలెస్ట్రాల్, లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్

ఈ పరీక్ష కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను చెక్ చేస్తుంది. అనారోగ్యకరమైన ఆహారం, వ్యాయామం లేకపోవడం వల్ల ధమనులలో కొవ్వు పేరుకుపోతుంది. కాలక్రమేణా ఇది రక్త ప్రసరణను దెబ్బతీసి గుండె సమస్యలు, అంగస్తంభన లోపానికి కారణమవుతుంది.

మూత్రపిండాలు, కాలేయ పనితీరు టెస్ట్ లు

మధుమేహం, అధిక రక్తపోటు లేదా జీవక్రియ సమస్యలు ఉన్న పురుషులు ఈ పరీక్షలు చేయించుకోవాలి. బయటకు స్పష్టంగా కనిపించని అంతర్గత సమస్యలను, అవయవ నష్టానికి సంబంధించిన తొలి సంకేతాలను ఇవి ముందే గుర్తిస్తాయి.

హార్మోన్ల ప్రొఫైల్

పురుషుల లైంగిక, పునరుత్పత్తి, సంపూర్ణ ఆరోగ్యంలో హార్మోన్లు కీలకం. శక్తిహీనత, లైంగిక కోరిక తగ్గడం, సంతానలేమి, మానసిక స్థితిలో మార్పులు ఉంటే టెస్టోస్టెరాన్, SHBG, ప్రోలాక్టిన్, ఈస్ట్రాడియోల్, థైరాయిడ్ పరీక్షలు అవసరం.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Thursday, November 19, 2026, 13:25 [IST]
Desktop Bottom Promotion