Latest Updates
-
చాక్లెట్ బ్రౌనీ చీజ్ కేక్ రెసిపీ.. పురుషుల దినోత్సవాన మీ ప్రియమైన వారికి ఇలా స్వీట్ సర్ ప్రైజ్ ఇవ్వండి! -
International men's day: ప్రతి పురుషుడు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన టెస్టులు ఇవే! -
పిల్లల ఆట అనుకుంటున్నారా? పెద్దలు ఉయ్యాల ఊగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే! -
చలికాలం స్పెషల్ బ్రేక్ ఫాస్ట్..ప్రోటీన్, ఐరన్ పుష్కలంగా ఉండే పెసరపప్పు పాలకూర దోసె చేసుకోండిలా.. -
చలికాలంలో హార్ట్ ఎటాక్ ముప్పు? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు! -
కేరళ స్పెషల్ మలబార్ చికెన్ బిర్యానీ.. బ్యాచిలర్లు కూడా చిటికెలో చేసేయొచ్చు! -
చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచి, చర్మానికి మెరుపునిచ్చే తులసి తమలపాకు రసం..ఎలా చేసుకోవాలంటే.. -
మెగ్నీషియం లోపం వేధిస్తోందా? కండరాల నొప్పులు, అలసట తగ్గించే 5 ఫుడ్స్ ఇవే! -
కార్తీకమాసం స్పెషల్.. ఘుమఘుమలాడే అసలైన బ్రాహ్మిణ్ స్టైల్ సాంబార్ మీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
చలికాలంలో ఆరోగ్యానికి మేలు చేసే..విటమిన్ C, ప్రోటీన్లు మెండుగా ఉండే ఉసిరి కరివేపాకు పొడి ఎలా చేసుకోవాలంటే..
పురుషుల దినోత్సవం స్పెషల్ స్వీట్..నోట్లో వెన్నలా కరిగిపోయే క్రీమీ రబ్రీని ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా!
ఇవాళ(నవంబర్ 19) అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా మీ జీవితంలో ముఖ్యమైన పురుషులకు అంటే కొడుకు, నాన్న, భర్త, సోదరుడు లేదా ప్రియమైన స్నేహితునికి స్వీట్ సర్ ప్రైజ్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారా? మీరు రబ్రీ తినడానికి ఇష్టపడతారా? అయితే బయట స్వీట్ షాపుల్లో దొరికే నోరూరించే క్రీమీ రబ్రీని ఇంట్లోనే ట్రై చేసి చూడండి.
దీని చిక్కటి క్రీమీ పొరలు, ప్రతి స్పూన్ లో తగిలే మీగడ రుచిని రెట్టింపు చేస్తాయి. అన్నింటికన్నా గొప్ప విషయం ఏమిటంటే.. దీనిని తయారు చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. పండుగలైనా, ప్రత్యేక సందర్భాలైనా లేదా భోజనం తర్వాత నోరు తీపి చేసుకోవాలన్నా ఈ వంటకం అద్భుతంగా ఉంటుంది. నార్త్ ఇండియా ఫేమస్ స్వీట్ క్రీమీ రబ్రీని ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
-ఒకటిన్నర లీటర్ల పాలు
-3 టేబుల్ స్పూన్ల చక్కెర
-కొద్దిగా నట్స్
-ఎండిన గులాబీ రేకులు
లచ్చాదార్ రబ్రీ తయారీ విధానం
-ముందుగా పాలు అడుగున మాడిపోకుండా ఉండేందుకు పెద్ద, మందపాటి అడుగు ఉన్న పాత్రను తీసుకోండి. అందులో పాలు పోసి మంటను మీడియంలో ఉంచి, అడుగు పట్టకుండా గరిటెతో నెమ్మదిగా కలుపుతూ మరిగించండి.
-పాలు మరిగేటప్పుడు, మధ్యలో మీగడ పొర ఏర్పడుతుంది. అలా ఏర్పడినప్పుడల్లా ఒక గరిటె సహాయంతో ఆ మీగడను గిన్నె అంచుకు లాగి జాగ్రత్తగా అంటించండి. ఇలా చేయడం వల్ల మీగడ అంచులకు అతుక్కుని పొరలు పొరలుగా పేరుకుపోతుంది.
-మీగడ త్వరగా కట్టడానికి ఒక చిన్న చిట్కా ఉంది. చేతి విసనకర్రతో లేదా చదునైన పళ్ళెంతో పాల ఉపరితలంపై గాలి వీచండి. గాలి తగలడం వల్ల పాలపై మీగడ త్వరగా, దట్టంగా కడుతుంది. పాలలో మూడింట ఒక వంతు మాత్రమే మిగిలే వరకు ఈ ప్రక్రియను ఓపికగా కొనసాగించండి.
-పాలు మూడో వంతుకు తగ్గిన తర్వాత, చక్కెర వేసి అది కరిగే వరకు కలపండి. అయితే అంచులకు అంటిన చిక్కటి మీగడ పొరను అప్పుడే పాలలో కలపకండి. చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత, గరిటెతో అంచుల మీగడను తీసి పాలలో మెల్లగా కలపండి.
-ఈ సమయంలో గిన్నె అంచుల దగ్గర మాడి గోధుమ రంగులోకి మారిన భాగాలను గీకకుండా జాగ్రత్త పడండి. మీగడను కలిపిన తర్వాత, 2 నుండి 3 నిమిషాల పాటు అధిక మంట మీద ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి.
-ఈ దశలో రబ్రీ కాస్త పల్చగా అనిపించవచ్చు, కానీ చల్లారినప్పుడు చక్కగా చిక్కబడుతుంది. అసలైన రబ్రీలో మీగడ రేకులతో పాటు కొద్దిగా పాలు కూడా ఉండాలి.
-రబ్రీని ఒక గిన్నెలోకి మార్చి ఫ్రిజ్ లో పెట్టండి. చల్లారిన తర్వాత నట్స్, ఎండిన గులాబీ రేకులతో అలంకరించి వడ్డించండి. పొరలు పొరలుగా ఉండే ఈ రుచికరమైన క్రీమీ రబ్రీని చల్లచల్లగా వడ్డిస్తే ఇంట్లో వారంతా ఎంతో ఇష్టంగా తింటారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
