Latest Updates
-
International men's day: ప్రతి పురుషుడు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన టెస్టులు ఇవే! -
పిల్లల ఆట అనుకుంటున్నారా? పెద్దలు ఉయ్యాల ఊగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే! -
చలికాలం స్పెషల్ బ్రేక్ ఫాస్ట్..ప్రోటీన్, ఐరన్ పుష్కలంగా ఉండే పెసరపప్పు పాలకూర దోసె చేసుకోండిలా.. -
చలికాలంలో హార్ట్ ఎటాక్ ముప్పు? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు! -
కేరళ స్పెషల్ మలబార్ చికెన్ బిర్యానీ.. బ్యాచిలర్లు కూడా చిటికెలో చేసేయొచ్చు! -
చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచి, చర్మానికి మెరుపునిచ్చే తులసి తమలపాకు రసం..ఎలా చేసుకోవాలంటే.. -
మెగ్నీషియం లోపం వేధిస్తోందా? కండరాల నొప్పులు, అలసట తగ్గించే 5 ఫుడ్స్ ఇవే! -
కార్తీకమాసం స్పెషల్.. ఘుమఘుమలాడే అసలైన బ్రాహ్మిణ్ స్టైల్ సాంబార్ మీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
చలికాలంలో ఆరోగ్యానికి మేలు చేసే..విటమిన్ C, ప్రోటీన్లు మెండుగా ఉండే ఉసిరి కరివేపాకు పొడి ఎలా చేసుకోవాలంటే.. -
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఉప్పు ఇదే.. ధర ఎంతో తెలుసా..?
చాక్లెట్ బ్రౌనీ చీజ్ కేక్ రెసిపీ.. పురుషుల దినోత్సవాన మీ ప్రియమైన వారికి ఇలా స్వీట్ సర్ ప్రైజ్ ఇవ్వండి!
ఇవాళ(నవంబర్ 19) అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. మీ జీవితంలో ముఖ్యమైన పురుషులకు అంటే నాన్న, భర్త, సోదరుడు లేదా ప్రియమైన స్నేహితునికి ఈ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం నాడు మధురమైన సర్ప్రైజ్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారా? అయితే మీ చేతులతో ప్రేమగా చేసిన చాక్లెట్ బ్రౌనీ చీజ్‌కేక్ గిఫ్గ్ గా ఇస్తే ఆ ఆనందమే వేరు.
రెస్టారెంట్ స్టైల్ లో ఉండే ఈ స్పెషల్ డెజర్ట్ ను ఇంట్లోనే ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. రిచ్ ఫడ్జ్ బ్రౌనీ, క్రీమీ చీజ్‌కేక్ కలయికతో నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఈ అద్భుతమైన కేక్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
బ్రౌనీ కోసం:
డార్క్ చాక్లెట్- 100 గ్రాములు
మైదా పిండి- అర కప్పు
నెయ్యి లేదా వెన్న- అర కప్పు
కాస్టర్ షుగర్- అర కప్పు,
కోకో పౌడర్- 2 టేబుల్ స్పూన్లు,
గుడ్లు- 2
వెనిలా ఎసెన్స్- 1 టీస్పూన్
చీజ్‌కేక్ కోసం:
క్రీమ్ చీజ్- 200 గ్రాములు
ఫ్రెష్ క్రీమ్- పావు కప్పు
కాస్టర్ షుగర్(పొడి చక్కెర)- 1/3 కప్పు
కార్న్‌ఫ్లోర్- 1 టేబుల్ స్పూన్
నిమ్మరసం- 1 టీస్పూన్
అలంకరణ కోసం:
చాక్లెట్ చిప్స్- 2 టేబుల్ స్పూన్లు లేదా కరిగించిన చాక్లెట్
చలికాలం స్పెషల్ బ్రేక్ ఫాస్ట్..ప్రోటీన్, ఐరన్ పుష్కలంగా ఉండే పెసరపప్పు పాలకూర దోసె చేసుకోండిలా..
తయారీ విధానం
-ముందుగా, మీ ఓవెన్ ను 170 డిగ్రీల సెల్సియస్ దగ్గర ప్రీహీట్ చేసి ఉంచండి. కేక్ టిన్ అడుగున అంటుకోకుండా కొద్దిగా నూనె లేదా వెన్న రాసి పక్కన పెట్టండి.
-ఒక గిన్నెలో డార్క్ చాక్లెట్, నెయ్యి లేదా వెన్న వేసి, డబుల్ బాయిలర్ పద్ధతిలో లేదా మైక్రోవేవ్ లో పూర్తిగా కరిగించండి. అందులో కాస్టర్ షుగర్ (పొడి చక్కెర), కోకో పౌడర్ జతచేసి ఉండలు లేకుండా బాగా కలపండి.
-ఇప్పుడు అందులోనే గుడ్లు, వెనిలా ఎసెన్స్ ను ఒక్కొక్కటిగా వేస్తూ మృదువుగా కలపండి. తర్వాత జల్లించిన మైదా పిండిని వేసి పిండి గట్టిపడకుండా మెల్లగా ఫోల్డ్ చేయండి.
-సిద్ధమైన ఈ బ్రౌనీ మిశ్రమాన్ని కేక్ టిన్ లో పోసి, 170 డిగ్రీల దగ్గర 15 నుండి 18 నిమిషాల పాటు బేక్ చేయండి.
-బ్రౌనీ బేక్ అయ్యేలోపు, మరొక గిన్నెలో క్రీమ్ చీజ్, మిగిలిన కాస్టర్ షుగర్ ను క్రీమీగా, నునుపుగా అయ్యేవరకు బాగా బీట్ చేయండి.
-అందులో ఫ్రెష్ క్రీమ్, కార్న్‌ఫ్లోర్, నిమ్మరసం వేసి మళ్లీ చిక్కగా, మృదువుగా అయ్యేలా గిలకొట్టండి.
-బేక్ అయిన బ్రౌనీ పొర కొద్దిగా చల్లారిన తర్వాత, దానిపై చీజ్ కేక్ మిశ్రమాన్ని సమానంగా పరచండి.
-ఇప్పుడు ఓవెన్ ఉష్ణోగ్రతను 160 డిగ్రీల సెల్సియస్ కు తగ్గించి, మరో 25 నుండి 30 నిమిషాలు బేక్ చేయండి.
-కేక్ మధ్య భాగం కొద్దిగా కదులుతూ ఉన్నా కంగారుపడకండి, చల్లారాక అది గట్టిపడుతుంది.
-కేక్ ను బయటకు తీసి పూర్తిగా చల్లారనివ్వండి. ఆ తర్వాత కనీసం 4 నుండి 5 గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచితే కేక్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది.
-చివరగా, ఫ్రిజ్ నుండి కేక్ ను బయటకు తీసి చాక్లెట్ చిప్స్ లేదా కరిగించిన చాక్లెట్ తో అలంకరించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
