చలికాలంలో హార్ట్ ఎటాక్ ముప్పు? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు!

గుండె జబ్బు ఎప్పుడైనా, ఏ వయసులోనైనా రావచ్చు. ఒకప్పుడు నలభై ఏళ్లు పైబడిన వారిలోనే కనిపించే ఈ సమస్య, నేడు ఇరవై, ముప్పై ఏళ్ల యువతను సైతం వదలడం లేదు. జీవనశైలిలోని క్రమరాహిత్యాలు గుండెపోటుకు ఎలా కారణమవుతున్నాయో, వాతావరణంలో వచ్చే మార్పులు కూడా ప్రమాదాన్ని అంతే స్థాయిలో పెంచుతున్నాయి. ముఖ్యంగా చలికాలంలో గుండెపోటు ముప్పు గణనీయంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

శీతాకాలంలో గుండె జబ్బుల ప్రమాదం ఎందుకు పెరుగుతుంది?

రక్తనాళాల సంకోచం (వాసోకాన్స్ట్రిక్షన్)

ఆరోగ్యకరమైన వ్యక్తి గుండె, శరీరంలోని కణాలన్నింటికీ ఆక్సిజన్‌ తో కూడిన స్వచ్ఛమైన రక్తాన్ని అందించడానికి నిమిషానికి 60 నుండి 80 సార్లు కొట్టుకుంటుంది. ఈ పంపింగ్ సామర్థ్యాన్ని నడిపించడానికి గుండెకు సైనస్ నోడ్ అనే స్వంత పేస్‌ మేకర్ ఉంటుంది. గుండెకు సంబంధించిన ఈ పేస్‌ మేకర్ రోజుకు 24 గంటలూ విరామం లేకుండా పనిచేస్తూ విద్యుత్ ప్రేరణలను సృష్టిస్తుందని, తద్వారా గుండె కొట్టుకుని శరీరమంతటా స్వచ్ఛమైన రక్తాన్ని పంపింగ్ చేస్తుంది.

Why Does Heart Attack Risk Increase in Winter 3 Key Medical Reasons Explained

ఈ ప్రక్రియలో ఏదైనా సమస్య ఏర్పడితే గుండె కొట్టుకోవడం క్రమరహితంగా మారుతుంది. శీతాకాలంలో రక్తనాళాలు ఎక్కువగా సంకోచించడం వల్ల రక్త ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుంది. ఇది రక్తపోటును పెంచి, గుండె కొట్టుకోవడంలో మార్పులకు దారితీసి తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది.

రక్తం చిక్కబడటం, గడ్డకట్టే ప్రమాదం

తక్కువ ఉష్ణోగ్రతలు రక్తంలోని ప్లేట్‌ లెట్ల సాంద్రతను, అలాగే రక్తం గడ్డకట్టడానికి సహాయపడే ఫైబ్రినోజెన్ వంటి ప్రోటీన్ల పనితీరును మార్చివేస్తాయి. చల్లని వాతావరణం రక్తాన్ని మరింత చిక్కగా మారుస్తుంది. దీనివల్ల రక్తనాళాలలో గడ్డలు ఏర్పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే గుండె జబ్బులు ఉన్నవారు, కుటుంబంలో గుండె వ్యాధుల చరిత్ర ఉన్నవారు, అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారికి రక్తం గడ్డకట్టడం, గుండెపోటు వచ్చే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వారు చలికాలంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

కేవలం వారం రోజుల్లో బరువు తగ్గడం ఎలా? ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు..కేవలం వారం రోజుల్లో బరువు తగ్గడం ఎలా? ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు..

హార్మోన్ల మార్పులు

చల్లని వాతావరణంలో శరీరం నుండి అడ్రినలిన్, నొరాడ్రినలిన్ వంటి హార్మోన్లు అధిక మోతాదులో విడుదలవుతాయి. ఈ హార్మోన్లు రక్తనాళాలను మరింతగా సంకోచింపజేసి, హార్ట్ బీట్ రేటును పెంచుతాయి. ఫలితంగా రక్తపోటు అమాంతం పెరిగి, గుండెపై అదనపు ఒత్తిడి పడుతుంది. ముఖ్యంగా హై బీపీ, డయాబెటిస్ ఉండి, రక్తంలో చక్కెర స్థాయిలు, రక్తపోటు అదుపులో లేని రోగులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం అత్యధికంగా ఉంటుంది.

కాబట్టి శీతాకాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. జీవనశైలిలోని లోపాలను సరిదిద్దుకుంటూ ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించాలి. గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి, శరీరం ఇచ్చే ముందస్తు సంకేతాలను గమనించుకోవడం ద్వారా ఈ శీతాకాలపు ముప్పు నుండి మన గుండెను సురక్షితంగా కాపాడుకోవచ్చు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Wednesday, November 18, 2026, 22:13 [IST]
Desktop Bottom Promotion