పిల్లల ఆట అనుకుంటున్నారా? పెద్దలు ఉయ్యాల ఊగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే!

చిన్నప్పుడు ఆడుకునే ఆటల్లో ఊమల ఊగడం కూడా ఒకటి. గాలిలో తేలియాడుతూ ఆకాశాన్ని అందుకుంటున్నట్లు అనిపించే ఆ స్వచ్ఛమైన ఆనందం, వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తుంది. అందుకే నడకకు లేదా పార్కులకు వెళ్లినప్పుడు, పెద్దలు కూర్చోవడానికి వీలుగా ఉయ్యాలలు ఉంటే చాలు.. వయసును సైతం మర్చిపోయి పిల్లలతో పాటు ఉత్సాహంగా ఊగుతూ కనిపిస్తారు. ఉయ్యాల ఊగడం కేవలం పిల్లల ఆట మాత్రమే కాదు అది పెద్దల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడే ఒక శక్తివంతమైన వ్యాయామం కూడా.

శరీరానికి తెలియకుండానే వ్యాయామం

ఉయ్యాల ఊగే సమయంలో శరీరం ఎంతో చురుకుగా పనిచేస్తుంది. మనం ఎంతో ఆనందంగా ఊగుతుండటం వల్ల అసలు వ్యాయామం చేస్తున్నామన్న భావనే కలగదు. అయినప్పటికీ ఇది శరీరంలోని ప్రధాన కండరాలన్నింటినీ కదిలిస్తుంది. ఉయ్యాలను స్థిరంగా ఉంచి, ముందుకు వెనుకకు ఊపడానికి మనం పాదాలపై బరువు వేయాలి. అలాగే గొలుసులను గట్టిగా పట్టుకుని శరీర సమతుల్యతను కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. ఈ కదలికల వల్ల ఉదర కండరాలు, చేతులు, కాళ్లకు మంచి వ్యాయామం లభిస్తుంది. అంతేకాదు హార్ట్ బీట్ రేటు పెరిగి గుండె ఆరోగ్యం మరింత బలోపేతమవుతుంది.

Not Just for Kids Play Surprising Health Benefits of Swinging for Adults You Need to Know

కీళ్లకు హాయి.. కేలరీలకు చెక్

పరిగెత్తడం లేదా భారీ వ్యాయామాలు చేసేటప్పుడు చాలామంది కీళ్ల నొప్పులు, బిగువు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. కానీ ఉయ్యాల ఊగడం వల్ల కీళ్లపై ఎలాంటి అదనపు భారం పడదు. ముఖ్యంగా నడివయసు వాళ్లు, వృద్ధులు ఎలాంటి గాయాల భయం లేకుండా ఈ సులువైన వ్యాయామాన్ని నిరభ్యంతరంగా ఎంచుకోవచ్చు. క్రమం తప్పకుండా ఉయ్యాల ఊగడం రక్త ప్రసరణను మెరుగుపరిచి, శరీర సౌలభ్యాన్ని పెంచుతుంది. ఇది పూర్తిస్థాయి వ్యాయామానికి ప్రత్యామ్నాయం కానప్పటికీ, విసుగు చెందకుండా చురుకుగా ఉండటానికి అద్భుతమైన మార్గం. ఒక గంట ఉయ్యాల ఊగితే సుమారు 100 నుండి 200 కేలరీలు సులభంగా ఖర్చవుతాయి.

చలికాలంలో హార్ట్ ఎటాక్ ముప్పు? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు!చలికాలంలో హార్ట్ ఎటాక్ ముప్పు? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు!

సమతుల్యత, అవగాహన పెంపు

ఉయ్యాల గాలిలోకి వెళ్లి వస్తున్నప్పుడు, మన శరీర కదలికల మధ్య ఒక సూక్ష్మమైన సమన్వయం ఏర్పడుతుంది. గాలిలో ఊగే వేగానికి అనుగుణంగా శరీరాన్ని నియంత్రించడం వల్ల మెదడు, శరీరం మధ్య అనుసంధానం మరింత బలపడుతుంది. ఈ ప్రక్రియ మన శారీరక బ్యాలెన్స్ పెంచడమే కాకుండా, చుట్టుపక్కల పరిసరాల పట్ల అవగాహనను, అప్రమత్తతను కూడా మెరుగుపరుస్తుంది.

ప్రశాంతత

యోగా లేదా ధ్యానం చేసినప్పుడు లభించే ప్రశాంతత ఉయ్యాల ఊగడం ద్వారా కూడా మనకు సొంతమవుతుంది. ఉయ్యాలలోని లయబద్ధమైన కదలిక మనసుపై ఎంతో సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది శ్వాసను నెమ్మదింపజేసి, నాడీ సంబంధిత ఒత్తిడిని దూరం చేస్తుంది. ముఖ్యంగా శరీరంలో ఆనందాన్నిచ్చే ఎండార్ఫిన్ హార్మోన్లు విడుదలయ్యేలా ప్రోత్సహిస్తుంది. అలసిపోయిన రోజు తర్వాత కాసేపు ఉయ్యాల కుర్చీలో ఊగితే చాలు.. మానసిక అశాంతి తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Thursday, November 19, 2026, 11:02 [IST]
Desktop Bottom Promotion