Latest Updates
-
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.?
పాదాలు మీద డ్రై అండ్ డార్క్ స్కిన్ నివారించడం కోసం ఎఫెక్టివ్ హోం రెమెడీస్..
అందం విషయంలో ముఖానికి తీసుకొన్నంత జాగ్రత్తలు, కాళ్ళు, చేతులకు తీసుకోరు. అందమైన ముఖ్యం కలిగి ఉండి...కాళ్ళు, పాదాలు చూసినప్పుడు పగుళ్ళతో డర్టీగా కనబడితే ఎలా ఉంటుంది. నలుగురిలో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.
కాళ్ళు, పాదాలు డ్రైగా...డార్క్ గా ఉన్నప్పుడు ఎంత అందమైన చెప్పులు ధరించినా ఆ కాళ్ళను చూడటానికి అందవిహీనంగానే కనబడుతాయి. అలాంటి కాళ్లకు పట్టీలు పెట్టుకోవాలన్నా..అందమైన సాండిల్స్ వేసుకోవాలన్నా కుదరదు. కాబట్టి, మీ కాళ్ళను అందంగా, సాఫ్ట్ గా ..తెల్లగా మెరిపించడానికి కొన్ని హోం రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి .
వేసవిలో చర్మ..కేశ సంరక్షణ ఎంత అవసరమో..పాదసంరక్షణ కూడా...
అయితే, ఈ హోం రెమెడీస్ ను అప్లై చేయడానికి ముందు మీరు కాళ్ళు, పాదాలు ఎందుకు డ్రైగా మరియు డార్క్ గా మారుతాయో తెలుసుకోవాలి. సహజంగా కాళ్ళ వద్ద చర్మం మిగిలిన శరీరంబాగా మీద ఉండే చర్మం కంటే డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి, స్కిన్ డ్రైగా మారినప్పుడు క్రమంగా కాళ్ళు పగుళ్లు ఏర్పడుతాయి . ఇది చూడటానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది . పాదాలు, మడిమలు డ్రైగా మారడానికి వివిధ రకాల కారణాలుంటాయి .
ఇలాంటి పాదాలను కవర్ చేయడానికి షూలు మరియు బూట్స్, వెట్ క్లాత్ వేసుకోడం మొదలగు కారణాల వల్ల కాళ్ల వద్ద స్కిన్ టోన్ మారుతుంది . పాదాలను మరింత డ్రైగా మార్చుతుంది. మెడికల్ కండీషన్స్ లో మడమల వద్ద ఒత్తిడి, లేదా బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా ఉండటం వల్ల కూడా డ్రై అండ్ డార్క్ స్కిన్ కలిగి ఉంటారు . ఇలా డ్రై స్కిన్ ఉన్నప్పుడు పాదల చీకాకుపెడుతుంటాయి.
వేసవిలో పాదాల మంటలను నివారించే వంటింటి చిట్కాలు
పాదాల మీద పగుళ్ళను డార్క్ స్కిన్ నివారించుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి . మార్కెట్లో దొరికే లోషన్స్ మరియు క్రీమ్స్ మీ సమస్యను నివారించడానికి చాలానే ఉన్నా...అవన్నీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని నిర్ధారించలేము. కాబట్టి ఎఫెక్ట్ గా నేచురల్ రెమెడీస్ ను ఉపయోగించుకోవడం మంచిది. మరి అవేంటో ఒకసారి చూద్దాం...

నిమ్మరసం:
డ్రై స్కిన్ నివారించడంలో ఎఫెక్టివ్ హోం రెమెడీ , నిమ్మకాయను కట్ చేసి, చిన్న ముక్కతో రసాన్ని పాదాలకు పట్టించి అలాగే మర్ధన చేయాలి . రెగ్యులర్ గా ఇలా చేస్తుంటే పాదాలు డ్రైగా మరియు డార్క్ స్కిన్ ను ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.

బాదం పేస్ట్:
పాదాల మీద మాయిశ్చరైజర్ ను అప్లై చేయడం వండర్ఫుల్ ఆప్షన్ . 5-6 బాదంను రాత్రుల్లో నీటిలో నానబెట్టి ఉదయం పేస్ట్ చేసి పాదాలకు అప్లై చేసి ఒక గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. లేదా రాత్రుల్లో నిద్రించడానికి ముందు అప్లై చేయడం వల్ల మరింత ఎఫెక్టివ్ ఫలితాలుంటాయి.

అలోవెర జెల్:
అలోవెర జెల్ లేకుండా పాదాలు..మోకాళ్ల నలుపును మరియు పగుళ్ళను పోగొట్టుకోలేరు . అలోవెర నుండి కొంత జెల్ తీసుకొని డ్రైగా మారిన పాదాల మీద అప్లై చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

గ్లిజరిన్ మరియు రోజ్ వాటర్:
గ్లిజరిన్ మరియు రోజ్ వాటర్ ఈక్వెల్ గా తీసుకొని, అందులో కొద్దిగా తేనె మిక్స్ చేసి పాదాలకు మరియు మడిమల వద్ద అప్లై చేయాలి. తర్వాత నిధానంగా మసాజ్ చేయాలి . ఒక గంట తర్వాత మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది . ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే పాజిటివ్ రిజల్ట్ పొందుతారు.

కొబ్బరి నూనె :
మరో ఈజీ హోం రెమెడీ . ఇది ఒక బెస్ట్ అండ్ సింపుల్ హోం రెమెడీ డార్క్ గా మరియు డ్రైగా ఉన్న పాదాల మీద అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 15నిముషాలు అప్లై చేస్తే చాలు . తర్వాత గోరువెచ్చని నీరు, షాంపుతో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

బేకింగ్ సోడ:
ఒక బకెట్ హాట్ వాటర్ తీసుకొని , అందులో రెండు, మూడు స్పూన్ల బేకింగ్ సోడా వేసి బాగా మిక్స్ చేసి పాదాలను అందులో డిప్ చేయాలి. 20 నిముషాల తర్వాత కాళ్ళు బయట పెట్టి పొడి టవల్ తో పూర్తిగా తుడుచుకోవాలి . ఈ పద్దతిని రెగ్యులర్ గా ఫాలో అవుతుంటే మంచి ఫలితం ఉంటుంది. డార్క్ , మందంగా మరియు డ్రై స్కిన్ తొలగించడం బేకింగ్ సోడా మంచి ఎంపిక

ఆముదం :
వింటర్ సీజన్ లో రెగ్యులర్ గా ఈ పద్దతిని ఫాలో అవుతుంటే మంచి ఫలితం ఉంటుంది. నిద్రించడానికి ముందు ప్రతి రోజూ రాత్రి ఆముదంను అప్లై చేయాలి . పాదాలను సాప్ట్ గా మరియు స్మూత్ గా ఉంచుకోవడానికి సాక్స్ లు ధరించడం మర్చిపోకండి.

బేసన్ ప్యాక్:
బేసన్ లేదా శెనగపిండి అన్ని రకాల చర్మ సమస్యలకు మంచిది. శెనగపిండి, తేనె మరియు పెరుగు మూడు మిక్స్ చేసి పాలకు అప్లై చేయాలి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి . ఇది డ్రై స్కిన్ నివారించడానికి ఇది ఒక బెస్ట్ హోం రెమెడీ.



Click it and Unblock the Notifications