Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
కొబ్బరినూనెలో దాగున్న అమేజింగ్ బ్యూటీ బెన్ఫిట్స్..!!
శతాబ్దాలుగా కొబ్బరినూనెను ఉపయోగిస్తూ వస్తున్నాం. ఇది చర్మానికి, జుట్టుకి, అనేక సమస్యలకు చక్కటి పరిష్కారం. శరీరంలోని అన్ని భాగాలకు ఉపయోగపడే గుణాలు కొబ్బరినూనెలో దాగున్నాయి. అలాగే కొబ్బరినూనె మల్టీ టాస్కింగ్ ప్రొడక్ట్,.
మనపూర్వీకులు.. కొబ్బరినూనెను బాగా ఉపయోగించడమే కాకుండా.. రకరకాల సమస్యలకు చక్కటి పరిష్కారం అని నమ్ముతారు. కొబ్బరినూనెలోని సౌందర్య గుణాలను ఇప్పుడిప్పుడే.. అందరూ ఉపయోగించుకుంటున్నారు. ప్రతి ఇంట్లోనూ.. కంపల్సరీ.. కొబ్బరినూనె ఉంటుంది.
అయితే.. కొబ్బరినూనెను మన పూర్వీకులు ఎన్ని రకాల ఉపయోగించుకుని, అద్భుతమైన ప్రయోజనాలు పొందేవాళ్లో ఇప్పుడు చూద్దాం..

డీప్ కండిషనర్
జుట్టుకి డీప్ కండిషనర్ గా కొబ్బరినూనెను ఉపయోగించవచ్చు. కొద్దిగా కొబ్బరినూనెను గోరువెచ్చగా చేసి.. కుదుళ్లపై మసాజ్ చేయాలి. దీనివల్ల.. స్కాల్ప్ కి బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడి.. జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది.

ఐ క్రీమ్
ఐ క్రీమ్ కోసం అదనపు ఖర్చు అవసరం లేదు. కొబ్బరినూనె ఉపయోగిస్తే చాలు. చర్మంలోపలికి వెళ్లి పోషణ అందిస్తుంది. ఇది హైడ్రేటింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. దీనివల్ల కంటి కింద ఉండే చర్మంపై ఫైన్ లైన్స్, ముడతలు తొలగిపోతాయి.

మేకప్ రిమూవర్
మేకప్ తొలగించడం ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. కానీ.. కొన్ని వాటర్ ఫ్రూఫ్ మేకప్ థింక్స్ తొలగించడం కష్టం. కొబ్బరినూనె మేకప్ తొలగించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

బాడీ లోషన్
బాడీ లోషన్ గా కొబ్బరినూనె అద్భుతం చేస్తుంది. అలోవెరా, కొబ్బరినూనెతో పాటు మరో పదార్థం కలిపి..బాడీ లోషన్ గా ఉపయోగించవచ్చు.

స్ల్పిట్ ఎండ్
డ్యామేజ్ అయిన జుట్టు చివర్లను కొబ్బరినూనె ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. మాయిశ్చరైజర్ లేకపోవడం వల్లే.. జుట్టు చివర్లు డ్యామేజ్ అవుతాయి. అలాంటి సమస్య ఉన్నవాళ్ల కొబ్బరినూనెను ఉపయోగించడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

వేళ్లకు
పగిలిన, డ్రైగా మారిన చేతి వేళ్లు అసహ్యంగా కనిపిస్తాయి. అలాంటప్పుడు కొబ్బరినూనెలో కాసేపు నానబెట్టుకుంటే.. అవి సాఫ్ట్ అండ్ షైనీగా మారతాయి.

మసాజ్ ఆయిల్
బాడీ పెయిన్స్ నివారించడంలో.. కొబ్బరినూనె చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కొబ్బరినూనె బెస్ట్ మసాజ్ ఆయిల్. కాబట్టి కొన్ని చుక్కుల కొబ్బరినూనె, లావెండర్ ఆయిల్ మిక్స్ చేసి.. మసాజ్ చేసుకుంటే.. ఒత్తిడి నుంచి బయటపడతారు.

షేవింగ్ బామ్
కొబ్బరినూనెను చేతులు, కాళ్లకు షేవింగ్ కి ముందు అప్లై చేయాలి. కొబ్బరినూనె షేవింగ్ సమయంలో.. కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది.



Click it and Unblock the Notifications