Latest Updates
-
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్
బ్లాక్ హెడ్స్ ని ఎఫెక్టివ్ గా తొలగించే టెస్టెడ్ హోంమేడ్ స్క్రబ్స్..
బ్లాక్ హెడ్స్ ముఖంపై ఉండే.. ఎంత నిగారింపు ఉన్నా, ఎంత మేకప్ వేసుకున్నా ఆ లుక్ మొత్తం చెడిపోతుంది. బ్లాక్ హెడ్స్ మన ఆకర్షణను, చర్మ సౌందర్యాన్ని నిర్జీవంగా మార్చేస్తాయి. మొటిమలు నివారించడమైనా తేలికేమో కానీ.. బ్లాక్ హెడ్స్ తొలగించడం చాలా కష్టం. ముఖ్యంగా ముక్కు భాగంలో ఏర్పడే బ్లాక్ హెడ్స్ తొలగించాలంటే.. చాలా నొప్పిగా ఉంటుంది.
కాబట్టి ఈ బ్లాక్ హెడ్స్ ని పార్లర్ లో తొలగించడం కంటే.. ఇంట్లోనే హోం రెమిడీస్ ఉపయోగించి తొలగించడం వల్ల నొప్పి లేకుండా.. ఎఫెక్టివ్ గా నివారించవచ్చు. అయితే.. ఇంట్లో తయారు చేసుకునే ఈ స్క్రబ్స్ ఊరికే చెబుతున్న చిట్కాలు కాదు.. వీటిని ట్రై చేసి, ఫలితాలు పొందిన తర్వాతే మీకు పరిచయం చేస్తున్నాం.
మరి బ్లాక్ హెడ్స్ తొలగించే ఈ ఎఫెక్టివ్, ఈజీ హోంమేడ్ స్క్రబ్స్ ని మీరూ ట్రై చేయండి. హోం మేడ్ స్క్రబ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

బియ్యం పిండి, గ్రీన్ టీ, పాలు
బియ్యం పిండిలో యాంటీ ఏజింగ్ గుణాలు ఉంటాయి. దీన్ని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల.. దీర్ణకాలిక ప్రయోజనాలు పొందవచ్చు. ఈ స్క్రబ్ డెడ్ స్కిన్ సెల్స్ ని బయటకు పంపించి బ్లాక్ హెడ్స్ ని తేలికగా తొలగిస్తుంది.

తయారు చేసే విధానం
ఒక బౌల్ తీసుకుని 1 టీస్పూన్ బియ్యం పిండి, ఒక గ్రీన్ టీ బ్యాగ్ ని కట్ చేసి కలపాలి. ఇప్పుడు 2 టీస్పూన్ల పాలు కలిపి అన్నింటినీ బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 5 నిమిషాలు గుండ్రంగా మసాజ్ చేయాలి. తర్వాత.. కడిగేసుకుని హైడ్రేటింగ్ క్రీమ్ అప్లై చేయాలి.

పంచదార, నిమ్మ, తేనె
పంచదారలో ఎక్స్ ఫోలియేటర్ గా పనిచేస్తుంది. నిమ్మ, తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఈ మూడింటిని ఉపయోగించడం వల్ల ఎఫెక్టివ్ గా బ్లాక్ హెడ్స్ తొలగించవచ్చు.

తయారు చేసే విధానం
1 టీస్పూన్ పంచదార, అర టీస్పూన్ నిమ్మరసం, 1 టీస్పూన్ తేనె తీసుకుని అన్నింటినీ.. ఒక గిన్నెలో బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.. బాగా స్క్రబ్ చేయాలి. తర్వాత శుభ్రం చేసుకుంటే.. మెరిసే చర్మం మీ సొంతం.

తేనె, బాదాం, నిమ్మ
బాదాంలో విటమిన్ ఏ, ఈ పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు విటమిన్స్ చర్మానికి మంచిది. ఈ స్క్రబ్ ఉపయోగించడం వల్ల.. చర్మానికి ఎక్స్ ఫోలియేట్ చేస్తుంది.

స్క్రబ్ తయారు చేసే విధానం
ఒక టీస్పూన్ బాదాం పొడి, అరటీస్పూన్ నిమ్మరసం, ఒక టీ స్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి స్క్రబ్ లా ఉపయోగిస్తే.. బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.

ఓట్ మీల్, పెరుగు, పసుపు, తేనె
మీరు సెన్సిటివ్ స్కిన్ కలిగి ఉండి.. బ్లాక్ హెడ్స్ తో బాధపడుతుంటే.. ఈ హోంమేడ్ స్క్రబ్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఓట్స్ ముఖంపై గుంతలు మాయం చేస్తాయి. పసుపు చర్మానికి నిగారింపు అందిస్తుంది. తేనె బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.

స్క్రబ్ చేసే విధానం
ఒక టీ స్పూన్ ఓట్ మీల్, ఒక టీస్పూన్ పెరుగు, చిటికెడు పసుపు, ఒక టీస్పూన్ తేనె కలపాలి. అన్నింటినీ బాగా మిక్స్ చేసి.. ముఖానికి స్క్రబ్ లా ఉపయోగించాలి.

సీ సాల్ట్, నిమ్మరసం, తేనె
సీసాల్ట్ ఉండే మినలర్ దుమ్ముని తొలగిస్తుంది. తేనె మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది. నిమ్మరసం చర్మాన్ని ప్రకాశించేలా చేస్తుంది.

స్క్రబ్
ఒక టీస్పూన్ సీసాల్ట్, ఒక టీస్పూన్ నిమ్మరసం, ఒక టీస్పూన్ తేనె తీసుకుని అన్నింటినీ ఒక గిన్నెలో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి స్క్రబ్ లా ఉపయోగించి.. 5 నుంచి 6 నిమిషాలు స్క్రబ్ చేయాలి. తర్వాత శుభ్రం చేసుకుంటే.. బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.



Click it and Unblock the Notifications
