Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
పళ్ళకు క్లిప్స్ వేసుకున్న దంతాలను తెల్లగా మెరిపించే ఈజీ హోం రెమెడీస్
ముఖానికి చిరునవ్వే అసలైన అందం! ఆ అరనవ్వులో.. ఎన్నెన్నో భావాలు. ఎంతో సోయగం. ఆ క్షణంలో ఆనందం తాండవిస్తుంది. ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. చక్కటి పలువరస పలకరిస్తుంది. అన్నీకలిసి... ప్రకృతిలోని కళాత్మక సౌందర్యం తళుక్కున మెరుస్తుంది.
అందుకే చిరునవ్వుకూ, ఆత్మవిశ్వాసానికీ, పలువరుసకూ, అందానికీ.. అంతటి విడదీయరాని బంధం! ఎగుడుదిగుడు పళ్లు.. రంగుమారిపోయిన దంతాలు.. విరిగిపోయిన ముందుపళ్లు.. మరీ ముందుకు తోసుకొచ్చే ఎత్తుపళ్లు.. పళ్ల మధ్య పెద్దపెద్ద సందులు.. అసహజంగా తయారైన చిగుళ్లు... ఇవి కేవలం నోటి ఆరోగ్యాన్నే కాదు.. మొత్తం మనిషి అందాన్నే మార్చేస్తాయి.
మనసులో న్యూనత పేరుకుపోయేలా చేసి ఆత్మవిశ్వాసాన్నీ దెబ్బతీస్తాయి. అయితే ఇవేవీ సరిచెయ్యలేనివి కాదు. అందుకే... ఆధునిక దంత వైద్యంలో 'సౌందర్య' విభాగానికి అంతటి ప్రాముఖ్యం పెరిగింది. వీటన్నింటినీ సరిచేసేందుకు ఇప్పుడు ఎన్నో అత్యాధునికమైన విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఏకంగా చిరునవ్వునే కళాత్మకంగా తీర్చిదిద్దే 'స్మైల్ డిజైన్' ప్రక్రియలూ వూపందుకున్నాయి.

ఎత్తుపళ్లు ఉన్నవారికి బ్రేసెస్‌తో సరిచేస్తారు. ఎత్తుపళ్లు ఉన్నవారు చిన్నతనంలోనే బ్రేసెస్ వాడటం మంచిది. వీటిల్లో అవసరమైనప్పుడు తీయటానికి వీలైనవి (రిమూవబుల్), ఎప్పుడూ లోపలే ఉండేవి (ఫిక్స్‌డ్) అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం పారదర్శకంగా ఉండే సిరమిక్ బ్రేసెస్‌ను ఎక్కువగా వాడుతున్నారు. ఇవి మెటల్ బ్రేసెస్‌లా పైకి ఎబ్బెట్టుగా కనిపించవు.
అయితే ఒక కామన్ కంప్లైంట్ ఏంటంటే బ్రేసెస్ లేదా క్లిప్స్ వేసుకోవడం వల్ల దంతాల యొక్క ఎనామిల్ తగ్గి, తెలుపు దనం తగ్గుతుందని చాలా మంది అపోహ. బ్రేసెస్ ఆర్థో డెంటిక్ డివైస్ . దీన్ని నోటిలోపల ఫిక్స్ చేయడం జరుగుతుంది. బ్రేసెస్ ట్రీట్మెంట్ ముఖం అందంగా కనబడుతుంది కానీ బ్రేసెస్ లేదా క్లిప్స్ వేసుకోవడం వల్ల దంతాల కలర్ మారుతుందనే వారి కోసం కొన్ని సింపుల్ రెమెడీస్ ఉన్నాయి. ఇవి దంతాలను తెల్లగా మార్చుతాయి. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అది టెంపరరీ అయినా, పర్మనెంట్ అయినా ఈ హోం రెమెడీస్ ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

బేకింగ్ సోడ, లెమన్ మరియు ఉప్పు
ఈ హోం రెమెడీ వల్ల దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు , దంతాలకు క్లిప్స్ లేదా బ్రేసెస్ వేసినా, వేయకపోయినా దంత క్షయం ఉన్నావారైనా సరే బేకింగ్ సోడ, నిమ్మరసం, ఉప్పు మిక్స్ చేసి దంతాలకు అప్లై చేసి బ్రష్ చేస్తే దంతాలు తెల్లగా మిళమిళ మారుతాయి. ఈ టూత్ పేస్ట్ ను రోజూ ఇన్ స్టాంట్ గా, రెగ్యులర్ గా ఫ్రెష్ గా తయారుచేసుకోవచ్చు.

దంతాలను తెల్లగా మార్చడానికి ఫ్లూయిడ్స్
పగటి సమయంలో దంతాల మీద బ్రేసెస్ లేదా క్లిప్స్ అలాగే ఉంటాయి, వాటి మీద బ్రష్ చేయడం కూడా కుదరదు. మరి ఈ సమస్యకు ఒక సింపుల్ చిట్కా ఉంది. రెండు ద్రవాలు కలిపినప్పుడు దంతాలు తెల్లగా మారుతాయి. అవేంటంటే ఆపిల్ సైడర్ వెనిగర్, కొబ్బరి నూనె.
ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు కొబ్బరి నూనెను రెండు ఒక్కో స్పూన్ తీసుకుని నోట్లో పోసి పుక్కలించి, రెండు మూడు నిముషాల తర్వాత నోటిని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా రోజూ చేసుకుంటుంటే మంచి ఫలితం ఉంటుంది. భోజనం, డిన్నర్ చేసిన ప్రతి సారి ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ చిట్కా వల్ల దంతాలు తెల్లగా మారుతాయి. బ్రేసెస్ లేదా క్లిప్పులను వేసుకున్నా కూడా ఎటువంటి సమస్య ఉండదు.

వైట్ టూత్ పేస్ట్ ను ఉపయోగించడం
బ్రేసెస్ వేసుకున్నా కూడా బ్రష్ చేసే విధానంలో ఎలాంటి మార్పు ఉండదు. బ్రేసెస్ వేసుకున్నా కూడా రోజులో ఎన్ని సార్లైనా బ్రష్ చేసుకోవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు. బ్రేసెస్ లేదా క్లిప్స్ వేసుకున్నప్పుడు బ్రష్ చేసుకోవడానికి వైట్ టూత్ పేస్ట్ ను ఉపయోగించాలి. రెగ్యులర్ గా ఉపయోగించే వైట్ టూత్ పేస్ట్ ను మాత్రమే ఉపయోగించుకోవాలి. ఇది దంతాల యొక్క ఒరిజినల్ కలర్ ను తెలుపుతుంది.



Click it and Unblock the Notifications
