Latest Updates
-
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.?
ప్రకృతి సిద్దమైన ఆయుర్వేదంతో కురుల సొగసులు...

చాలామందిలో శారీరకంగా, మానసికంగా ఒత్తిడి ప్రభావం జుట్టు మీద పడి జుట్టు రాలిపోవడం, జుట్టు తెల్లబడటం జరుగుతుంటుంది. అలాగే ఆహార లోపం వల్ల వచ్చే రక్తహీనత, తలలో పేలు, చుండ్రు ఇన్ ఫెక్షన్స్ కారణంగా తలపై వచ్చే గజ్జి, తామర వంటి వ్యాధుల వల్ల కూడా జుట్టు ఊడిపోతుంది. ముఖ్యంగా ఆడపిల్లలలో జుట్టు రాలిపోవటా నికి ముఖ్యకారణం హార్మోన్ల ప్రభావం. ఇంకా సాధరణంగా వాడే రకరకాల షాంపూలు, హెయిర్ డైలు, హెయిర్ కలర్ లు కారణంగా అనేక కెమికల్స్ కేశాలపై ప్రభావాన్ని చూపిస్తాయి. వీటన్నింటికీ హెయిర్ ప్యాక్ లు, హెయిర్ మాస్క్ లు, స్పాలు ఇలాంటివి కాకుండా సహజసిద్దమైనటువంటి ఆయుర్వేద పద్దతుల ద్వారా జుట్టు రాలడం అరికట్టుకోవచ్చు...
1. కెమికల్స్ ఉన్న షాంపూల వాడకం తగ్గించి ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే కుంకుడుకాయ రసంలో వేపాకు, మందారఆకు వేసి సేప్ట్ లా చేసి తలకు పట్టించి గోరువెచ్చటి నీటితో తలస్నానం చేయాలి. అలా చేయడం వల్ల ఆ రసంలో ఉన్న జిగురు జుట్టు మొదళ్లని శుభ్రం చేసి, సున్నిత త్వాన్ని ఇవ్వ డమే కాక జుట్టు మెరిసేలా చేస్తుంది.
2. వారానికొక్కసారి క్రమం తప్పకుండా తలకి నువ్వుల నూనె రాసుకుంటే ఉపశమనం లభిస్తుంది. నువ్వుల నూనెలో నీలగిరి తైలం కాస్త కలిపి మరగ కాచి ప్రతిరోజూ తలకి రాసుకుంటే జుట్టురాలడం తగ్గి చక్కగా పెరుగు తుంది.
3. వేపాకు, మందారం ఆకులు కలిపి పేస్ట్ లా చేసి నువ్వుల నూనెలో పోసి నూనె మిగిలేదాకా మరగ కాచి వడకట్టి సీసాలో పోసు కుని దాన్ని రోజూ తలకి రాసుకుంటే జుట్టు నిగనిగ లాడుతుంది.
4. పల్లేరు పువ్వులు, నువ్వులు సమానంగా తీసుకుని ముద్ద చేసి కాస్త నెయ్యి కలిపి తలకు పట్టిస్తే పేను కొరుకుడు వల్ల ఊడిపోయిన జుట్టు తిరిగి మొలుస్తుంది.
5. కొబ్బరినూనె లో మాచికాయ, కరక్కాయ, ఉసిరికాయ, కాచు ఉడికించాలి... ఈ తైలాన్ని రాత్రిపూట తలకు పట్టించుకుని ఉదయాన్నే తల స్నానం చేస్తే తెల్ల వెంట్రుకలు నల్లబడతాయి.



Click it and Unblock the Notifications
