Latest Updates
-
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.!
కురుల తీరును బట్టే ముఖారవిందం...!

మామూలుగా కురులు నాలుగు రకాలుగా ఉంటాయి. పొడి వెంట్రుకలు (dry hair), జిడ్డు వెంట్రుకలు greecy hair), సాధారణ వెంట్రుకులు(normal hair), కలగలసిన వెంట్రుకలు (combination hair) - అనేవి ఆ నాలుగు రకాలన్నమాట. ఇలా శిరోజాలు ఒక్కొక్కరికీ ఒక్కో విధంగా ఉండటానికి, శిరోజాల లక్షణాల్లో తేడాలు వుండటానికి కారణం చాలా వరకు వంశపారంపర్య కారణాలే దీనికి మూలం. తర్వాత రెండవది పౌషటికాహారం లోపం, శిరోజాల పట్ట అశ్రధ్ద తదితర కారణాలు.. అయితే ముఖ్యంగా ఈ నాలుగు రకాలైనటువంటి శిరోజాలలో ఎక్కువగా మనలో ఉండేది పొడిజుట్ట, జిడ్డుగా ఉండే జుట్టు, సాధారణ జుట్టు ఎరికో కొందరికే ఉంటుంది. ఆయిల్ హెయిర్ పల్చగా, ఆరోగ్యంగా ఉంటుంది. డ్రై హెయిర్ వత్తుగా ఉంటుంది. అయితే ఈ రకం జుట్టు మదువుగా ఉండదు. మీది ఏరకమైన జుట్టు అన్నది తెలుసుకోవాలంటే తలస్నానం చేసిన తర్వాత జుట్టు ఆరబెట్టుకుని, ఒక కాగితంతో మీ తలపై రుద్దాలి. కాగితంపై నూనెవంటి మరకలు కనపడితే మీది ఆయిలీ హెయిర్ అని లెక్క. అలాకాకుంటే డ్రై హెయిర్ అనే చెప్పాలి.
పొడి వెంట్రుకలు(డ్రై హెయిర్): ఈ తరహా వారికి జుట్టు బిరుసుగా ఉంటుంది. వయసు పెరిగేకొద్దీ ఇంకా బిరుసుగా తయారవుతుంది. ఇలాంటి వెంట్రుకలవల్ల అందం రాదు. అయితే ఈ తరహా వెంట్రుకల్లో మార్పు తేవచ్చు. అందుకోసం స్కల్ప్ ఆయిల్ ట్రీట్మెంట్ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా తలకు బాదం నూనెతో బాగా మర్దన చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
జిడ్డు వెంట్రుకలు(ఆయిల్ హెయిర్): కొందరి జుట్టు ఎప్పుడూ జిడ్డు ఓడుతూ ఉంటుంది. ఆఖరికి అప్పుడే తల అంటుకున్నా సరే సిల్కీగా మెరుస్తూ కనిపించదు. నూనె పట్టించినట్టుగా జిడ్డుగా ఉంటుంది. వెంట్రుకలు మరీ పొడిగా ఉన్నాయన్నా, జిడ్డుగా కనిపిస్తున్నాయన్నా అందుకు కారణం శరీరంలోని హార్మోన్లలో వచ్చే మార్పులే. వాతావరణంలో మార్పుచేర్పులు, పరిసరాల కాలుష్యం మొదలైనవి కూడా వెంట్రుకలను మారుస్తూ ఉంటాయి. ఈ రకమైన జుట్టు ఉన్నవారికి నూనె అవసరం పెద్దగా ఉండదు. కాస్ట్రాయిల్ మరీ జిడ్డుగా ఉంటుంది కనుక దానికి దూరంగా ఉండటం మంచిది. వీళ్ళు ఎప్పుడో వారానికి ఒకసారి కాకుండా ప్రతిరోజూ తలస్నానం చేయడంవల్ల ప్రయోజనం ఉంటుంది.
సాధారణ జుట్టు కంటే రింగుల జుట్టు పెళుసుగా ఉండడంతో పాటు పొడిగా ఉంటుంది. సాధారణ జుట్టు కంటే రింగుల జుట్టు వాతావరణ మార్పులకు వెంటనే ప్రభావితమవుతుంది కాబట్టి రింగుల జుట్టు ఉన్నవారు మరింత శ్రద్ధ తీసుకోవాలి. అందుకనే షాంపూతో వారానికోసారైనా తప్పకుండా తల స్నానం చేయాలి. దానివల్ల జిడ్డులేకుండా ఉంటుంది. మాయిశ్చరైజింగ్ షాంపూ అయితే జుట్టుని పొడిగా ఉంచడానికి తోడ్పడుతుంది. వారంలో వీలయినన్ని సార్లు షాంపూతో తలస్నానం చేసినా జుట్టు జిడ్డులేకుండా ఆరోగ్యంగా కనిపిస్తుంది. షాంపూ వాడని రోజుల్లో జుట్టుని వేడినీటితో కడగాలి. దీనివల్ల పోషణ ఇచ్చే సహజనూనె పదార్థాలు కోల్పోకుండా జట్టు ఆరోగ్యంగా కనిపిస్తుంది.



Click it and Unblock the Notifications
