Latest Updates
-
రోజూ నిమ్మరసం తాగుతుంటే కిడ్నీ రాళ్లు రావా? -
చలికాలం స్పెషల్ రోగనిరోధక శక్తిని పెంచే ప్రొటీన్ రిచ్ పెసరపప్పు సూప్..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ -
బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే పెసరపప్పు పరోటా ఇంట్లోనే చేసుకోండిలా.. -
పొద్దున్నే 9 గంటలలోపు ఈ 5 పనులు చేస్తే.. మీ ఆయుష్షు 20 ఏళ్లు పెరుగుతుంది! -
శరీరంలో చెత్త మొత్తాన్ని తొలగించి, లివర్ ని శుభ్రపర్చే టీ ..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
చలికాలంలో దగ్గు, జలుబు మాయం చేసే సూప్ ఇదే..ఇడ్లీతో ముంచుకుని తిన్నా కేక -
అందమైన అమ్మాయి పిలిచిందని వెళ్తే..యువకుడికి ఊహించని షాక్! -
విటమిన్ A, C, K, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉండే ఈ కూర తింటే చలికాలంలో రోగాలన్నీ పరార్! -
బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే రవ్వ బన్ అప్పం.. తింటే వదలరు..10 నిమిషాల్లోనే చేసుకోండిలా -
కీళ్ల నొప్పులు మాయం చేసే 1:4 మ్యాజిక్..ఇలా చేస్తే జీవితంలో మోకాళ్ల నొప్పులు రావు!
చలికాలంలో ఏ రోటీలు తింటే ఆరోగ్యానికి మంచిది? సజ్జ, జొన్న, రాగి లేదా గోధుమ?
చలికాలం వస్తే చాలు మన కడుపు ఏదైనా వేడివేడిగా, కమ్మగా లాగించేయాలని ఆరాటపడుతుంది. అందులోనూ పొగలు కక్కే రొట్టె, ఆకుకూర పప్పు, పైన కాస్త కరిగిన నెయ్యి వేసుకుని తింటే ఆ మజాయే వేరు. సాధారణంగా మనం రోజూ గోధుమపిండితో చేసే రోటీలు లేదా చపాతీలు తింటుంటాం. కానీ చలికాలంలో సజ్జ, జొన్న, రాగి రొట్టెలకు ఉండే క్రేజే వేరు. అయితే ఈ చలి వాతావరణంలో మీ ఆరోగ్యానికి, రుచికి ఏ పిండితో చేసిన రోటీ, చపాతీలు బెస్ట్ అని ఎప్పుడైనా ఆలోచించారా?
కమ్మని రుచి.. సజ్జ రొట్టె
చలికాలంలో సజ్జ రొట్టెలు సూపర్ హిట్. ఇవి కాస్త మందంగా, గరుకుగా ఉన్నా.. వీటి రుచి మాత్రం అద్భుతం. పల్లెటూరి వాతావరణాన్ని గుర్తుచేసే ఈ వేడివేడి సజ్జ రొట్టెలపై కాస్త నెయ్యి రాసుకుని, బెల్లం లేదా ఆవకూరతో తింటే స్వర్గమే. ఫైబర్, ఐరన్ పుష్కలంగా ఉండే సజ్జలు చలిలో శరీరానికి కావాల్సిన వెచ్చదనాన్ని ఇస్తాయి. సంప్రదాయ వంటకాలను ఇష్టపడేవారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

పంజాబీ స్టైల్.. మొక్కజొన్న రొట్టె
ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా పంజాబ్ లో చలికాలం ఈ వంటకం లేనిదే గడవదు. మొక్కజొన్న పిండిలో సాగే గుణం (గ్లూటెన్) ఉండదు కాబట్టి దీన్ని కర్రతో రుద్దకుండా చేత్తో తడుతూ రొట్టెలు చేస్తారు. కాస్త వెన్న లేదా బెల్లంతో తింటే ఈ రొట్టెల రుచి అమోఘం.
జొన్న రొట్టె
సజ్జలు, మొక్కజొన్న కాకుండా కాస్త తేలికైన ఆహారం కావాలంటే జొన్న రొట్టెలు బెస్ట్. ఇవి సహజంగానే గ్లూటెన్ ఫ్రీ, పైగా పీచుపదార్థం మెండుగా ఉంటుంది. పిండికి జిగురు ఉండదు కాబట్టి, గోరువెచ్చని నీటితో కలిపి సున్నితంగా రొట్టెలు చేయాలి. దీని రుచి సజ్జల కంటే మైల్డ్ గా ఉండి అందరికీ నచ్చుతుంది.
పోషకాల గని.. రాగి పిండి
రాగులు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. క్యాల్షియం, ఐరన్, ఫైబర్ ఇందులో పుష్కలం. దీని రుచి కాస్త భిన్నంగా, చాలా కమ్మగా ఉంటుంది. ఇందులో కూడా గ్లూటెన్ ఉండదు కాబట్టి వేడి నీటితో పిండిని కలుపుకోవాలి. వేడివేడి కూరలు, ఆకుకూరలు లేదా పెరుగుతో తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి.
నిత్యం వాడే గోధుమ పిండి
మన ఇళ్లలో రోజూ ఎక్కువగా వాడేది గోధుమ పిండే. ఇందులో ఉండే గ్లూటెన్ వల్ల పిండి బాగా కలిసిపోయి, రొట్టెలు మృదువుగా, సులభంగా ఒత్తుకోవడానికి వస్తాయి. రోజూ మెత్తటి ఫుల్కాలు, పరాటాలు తినాలనుకునే వారికి ఇది ఎవర్ గ్రీన్ ఆప్షన్.
చలికాలానికి ఏది బెస్ట్?
ఈ ఐదింట్లో ఫలానా పిండి మాత్రమే బెస్ట్ అని చెప్పలేం. ఎందుకంటే దేని ప్రత్యేకత దానిదే. మీరు సంప్రదాయ రుచుల వైపు మొగ్గు చూపితే సజ్జ రొట్టె, పంజాబీ స్టైల్ కావాలంటే మొక్కజొన్న, గ్లూటెన్ ఫ్రీ డైట్ ఫాలో అయితే జొన్న లేదా రాగి ఎంచుకోండి. రోజువారీ సౌలభ్యం కోసం గోధుమలు ఉండనే ఉన్నాయి.
ఒక మంచి చిట్కా ఏంటంటే.. గోధుమ పిండిలో కాస్త జొన్న, రాగి లేదా సజ్జ పిండి కలిపి మల్టీగ్రెయిన్ రొట్టెలు చేసుకోండి. దీనివల్ల రొట్టెలు మృదువుగా రావడమే కాకుండా, అన్ని రకాల ధాన్యాల పోషకాలు మీ శరీరానికి అందుతాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
