Latest Updates
-
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. !
రింగ్ లెట్ హెయిర్ స్టైల్ తో కేశాలకు కొత్త లుక్ ...!

ఈ హెయిర్ స్టయిల్ మీ రూపానికి కొత్తదనాన్ని తీసుకువస్తుంది. ‘రింగ్ లెట్స్ హెయిర్ స్టయిల్' అమ్మాయిలకు, అబ్బాయిలకు ఇద్దరికీ బాగా నచ్చుతుంది. అబ్బాయిలు తమ భుజాల వరకు జుట్టును లైట్ గా రింగ్ ఆకారంలో ఉండాలని కోరుకుంటున్నారు. అదే అమ్మాయిలకైతే షార్ట్స్, స్కర్ట్ తో పాటు ఈ లుక్ చాలా బాగుంటుంది. ఈ రింగ్ లెట్స్ హెయిర్ స్టయిల్ చాలా రకాలున్నాయి.
అవి సాఫ్ట్ స్పైరల్', హార్డ్ రర్మ్', బోటం కలర్స్', ‘అవుట్ కర్ల్ పర్మ్', టెక్చర్ రింగ్ లెట్స్, పెర్మనెంట్ బ్లో, మొదలైనవి. ప్రస్తుతం సాస్ట్ వెట్, వేవీ రింగ్ లెట్స్ ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. హెయిర్ కేర్ నిపుణులు రింగ్ లెట్స్ చేయించుకుంటే సాప్ట్, క్యూట్ లుక్ వస్తుందని అంటున్నారు. వ్యక్తిత్వం లోనూ చాలా మార్పు వస్తుందన్నారు. ఏదైనా పార్టీకీ లేదా ఫంక్షన్ కు వెళ్ళాలనుకుంటే రింగ్ లెట్స్ హెయిర్ స్టయిల్ ప్రయత్నించవచ్చు. ఈ స్టయిల్ చీర, గాగ్ర, గౌన్.. ఇలా అన్నింటిపైనా చక్కగా సూటవుతుంది.
రింగ్ లెట్స్ రోలర్: రింగ్ లెట్స్ రోలర్ లో ఫిష్ పర్మ్, చోపస్టిక్ రోలర్ ను వాడుతారు. ఇందులో రోలర్ డిజైన్ ను బట్టి జుట్టు రింగులు ఏ ఆకారంలో వస్తాయో తెలుస్తుంది. రింగ్ లెట్స్ చేయించుకునే ముందు దాని టెక్చర్ గురించి తెలుసుకోవడం అవసరం. వాటిలో రకరకాల టెక్చర్ లు ఉంటాయి.
క్రిపింగ్, స్పైరల్, సాప్ట్ లుక్ తో ఉండే రింగ్ లెట్స్ మొదలైనవి. రింగ్ లెట్స్ రోలర్ ను టెక్చర్ ను అనుసరించి చేస్తారు. అందుకే రోలర్ పొడవు, వెడల్పుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మీరు ‘స్టెప్ కట్', యూ కట్, లేయర్ కట్ లాంటి హెయిర్ స్టయిల్స్ లోనూ రింగ్ లెట్స్ చేసుకోవచ్చు. రింగ్ లెట్స్ చేయడానికి జుట్టు మీడియం లేదా పొడవుగా ఉండాలి. రింగ్ లెట్స్ చేయించుకుంటే జుట్టు పొడవుగా ుండాలి. రింగ్ లెట్స్ చేయించుకుంటే జుట్టు పొడవు సగానికి తగ్గిపోతుంది. కాబట్టి పొడవాటి జుట్టు ఉన్నవారికి ఇది బాగా నప్పుతుంది.
రింగ్ లెట్స్ హెయిర్ సంరక్షణ: రింగ్ లెట్స్ చేయించుకున్న తర్వాత జుట్టును టైమ్ ప్రకారం దువ్వుతూ ఉండాలి. రింగ్ లెట్స్ చేసేటప్పుడు జుట్టుపై రసాయనాలను వాడతారు. దీంతో జుట్టు నిర్జీవంగా మారుతుంది. ఈ సమస్య రాకుండా జుట్టుకు కండీషనింగ్ చేయించుకోవాలి.
రింగ్ లెట్స్ రెండు రకాలుగా చేయించుకోవచ్చును. ఒకటి టెంపరరీ, రెండవది పెర్మనెంట్, టెంపరరీ రింగ్ లెట్స్, చేయించుకోవడానికి గంట సమయం పడుతుంది. దీనికి ఖర్చు 500 నుండి వెయ్యి రూపాయల వరకు ఉంటుంది. పెర్మనెంట్ రింగ్ లెట్స్ చేయడానికి మూడు గంటల నుండి నాలుగు గంటలు సమయం పడుతుంది. అందుకు పదిహేను వందల నుంచి ఐదు వేల రూపాయాల వరకు ఖర్చు అవుతుంది.



Click it and Unblock the Notifications
