Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
తెల్ల జుట్టును అరికట్టడం ఎలా...!

కొంతమంది చిన్న విషయాలకి, ఏమీలేని విషయాలకి ఎంతోదూరం ఆలోచిస్తుంటారు. వారి ఆలోచనలకి, భయాలకు అంతే ఉండదు. ఏదేదో ఊహించుకుని ఏదేదో చేసేసి, మరేదో అరచి లేదా ఆలోచించి పిచ్చిపనులు చేసి ఏమీలేని విషయాన్ని పెద్దది చేసి నిజంగానే అదో సమస్యలా చేసి ఆందోళనలో పడతారు. అందులోంచి బైటికి రాలేక సతమతమవుతూ ఉంటారు. దాంతో ఒత్తిడి, టెన్షన్ కూడా జట్టు తెల్లగా మారడానికి అవకాశం ఉంది. దాని ప్రభావం జుట్టుమీద చూపించడమే కాకుండా ముఖంలో కూడా చూపించవచ్చు. దాంతో ముఖంలో మొటిమలు, జిడ్డు, పేరుకుపోయి ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి వంశపారంపర్యగా డెబ్బై ఐదు పర్సెంట్ నష్టపోతుంటే, మిగిలిన ఇరవై ఐదు పర్సెంట్ ఒత్తిడి, ఇతర సమస్యలు కారణం అవుతున్నాయి. కాబట్టి వీటన్నింటిని పారదోలి జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకొన్నట్లైతే ఆరోగ్య కరమైన జుట్టు మీ సొంతం అవుతుంది.
1. టీ, కాఫీలు ఇవి ఈ కంప్యూటర్ ప్రపంచంలో బిజీ జీవితంలో వద్దన్నాలనుకున్నా తప్పవు. ఎక్కువగా టీ, కాఫీల వల్ల వేడిచేసి జుట్టు ఊడడం మొదలవుతుంది.
2. ముఖ్యంగా వేపుళ్లు ఎక్కువగా తినకనకుండా జాగ్రత్త పడాలి. కాఫీ, టీ లకన్నా మజ్జిగ ఎక్కువగా తీసుకోండి. మజ్జిగలో రెండు చుక్కల నిమ్మరసం కూడా కలిపి తీసుకోండి. మజ్జిగతో శరీరానికి, జుట్టుకి కావలసిన విటమిన్లు లభిస్తాయి. అలాగే పుల్లగా ఉండే ఆమ్లములు గల ఆహారపదార్థాలు తీసుకున్నపుడు కాపర్ వంటి పోషకాలు ఆహారంలో తగినన్ని లేనప్పుడు మెలనిన్ ఉత్పత్తి బాగా తగ్గి జుట్టు తేలికై తెల్లబడుతుంది.
3. అందుకోసం ప్రొటీన్ ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. ప్రొటీన్స్ ఎక్కువగా మొలకలు, ధాన్యసంబంధిత వాటిల్లో మాంసం సోయాచిక్కుళ్లలోనూ ఉంటాయి.
విటమిన్ ఎ, విటమిన్‌బి సమృద్ధిగా గల ఆహారం తీసుకోవాలి. ఈ విటమిన్లు ముదురు ఆకుపచ్చ కూరగాయల్లో పసుపురంగు ఉండే పళ్లలో సమృద్ధిగా ఉంటాయి.
4. తాజా ఆకుపచ్చని ఆకుకూరల్లో, అరటికాయల్లో టమోటా, కాలీఫ్లవర్, పప్పుధాన్యాలు, లివర్, కిడ్నీ, పెరుగు గోధుమలలో విటమిన్‌బి ఉంటుంది ఖనిజలవణాలు బాగా సమృద్ధిగా ఉండే ఐరన్‌లాంటివి తీసుకోండి. ఎర్రగా ఉండే మాంసములోనూ, ఆకుపచ్చని కూరగాయల్లోనూ జింక్ ఎక్కువగా ఉంటుంది.
5. ఎండిన ఆప్రికాట్స్, కొత్తిమీర, గుడ్లు, గుడ్డులోని పచ్చసొన, ధాన్యములలో ఐరన్ ఉంటుంది. సన్‌ఫ్లవర్ గింజలలో జీడిమామిడి ఆల్మండ్‌లలో కాపర్ ఎక్కువగా ఉంటుంది. అరటికాయలు, చేపలు, కేరట్‌లలో అయోడిన్ ఉంటుంది.
6. చిన్నవయస్సులో జుట్టు తెల్లబడినవారు, తాజా అల్లాన్ని తీసుకుని అరగదీసి తేనెతో కలిపి తీసుకోవటం వల్ల ఆమ్లాలను తలపై రుద్దుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జుట్టు నల్లబడుతుంది. రోజూ రెగ్యులర్‌గా కొబ్బరినూనెని నిమ్మపండురసంతో జతచేసి జుట్టుకు మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
7. పాలు కలవని టీ డికాషన్‌లో ఒక టేబుల్‌స్పూన్ ఉప్పు కలపండి. ఈ మిశ్రమంలో తెల్లబడిన జుట్టు ప్రాంతంలో బాగా మెత్తగా, మృదువుగా మసాజ్ చేసుకోండి. ఓ గంట పోయాక తలస్నానం చేయండి.
8. రెండు టీ స్పూన్ల హెన్నా పౌడర్ తీసుకోండి. ఒక టీస్పూన్ పెరుగు, ఒక టీ స్పూన్ మెంతుల పొడి, మూడు టీ స్పూన్ల పొదీనా రసంను కలపండి. మిశ్రమాన్నంతా పేస్ట్‌లా చేసి జుట్టుకు పట్టించండి. రెండు లేదా మూడుగంటలు తర్వాత షాంపూతో స్నానం చేయండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే తెల్లజుట్టు నల్లబడుతుంది.



Click it and Unblock the Notifications