Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
ఒత్తైన ..బలమైన కేశ సౌందర్యానికి నిమ్మరసం....

1. ఔషధ విలువలు కలిగిన నిమ్మకాయతో సౌందర్య పోషణ కూడా చేసుకోవచ్చు. నిమ్మపండును ముక్కలు కోసి ముఖమంతా రుద్దండి. రసమతా ముఖంమీద రాత్రంతా అలాగే ఆరనివ్వండి. తెల్లారి లేచి కడుక్కుంటే మఖంపై వున్న మచ్చలు పోతాయి. చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
2. సౌందర్య పోషణతోపాటు కేశ సౌందర్యానికీ నిమ్మకాయ ఉపయోగపడుతుంది. స్నానం చేసేముందు నిమ్మదబ్బల్ని తలకురాసుకుని, గంట తర్వాత స్నానం చేస్తే శరీరంలోని వేడి తగ్గించడమే కాదు కేశ సంరక్షణ చేస్తుంది.
3. తలస్నానం చేసే ముందుగా కుంకుడు లేదా షీకాయ రసంతో నిమ్మరసం కలుపుకుని రద్దుకుంటే జుట్టు నిగనిగలాడుతూ ఆరోగ్యకరంగా ఉంటుంది.
4. కొంతమంది జుట్టు జిడ్డుగా, నూనె కారుతూ ఉంటుంది. తలస్నానం చేసిన కొద్దిసేపటికే జుట్టు జిడ్డుగా తయారై రాలిపోతుంటుంది. ఇటువంటివారు ఒకవేళ కండీషనర్ వాడదలుచుకుంటే పెరుగును మాత్రం వాడుకోవాలి. కండీషనర్‌ను తలకు కాకుండా వెంట్రుకల కొసలకు ప్రయోగించాలి. స్నానానికి ఉపయోగించే నీళ్లకు కొద్దిగా నిమ్మరసాన్ని చేర్చితే జిడ్డు వదులుతుంది.
5. శీకాకాయ, పెసలు, ఉసిరి, కరివేపాకు, నిమ్మతొక్కలు, మెంతులు వీటిన్నిటిని గాలికి ఆరబెట్టి, ఎండిపోసిన తరువాత విడివిడిగా పొడిచేసుకొని ఒకటిగా కలిపి తలస్నానచూర్ణంగా వాడుకుంటే తలకు పట్టిన జిడ్డు వదిలిపోయి కేశాలు ప్రకాశవంతంగా తయారవుతాయి.
6. ఎప్పుడూ వేడి శరీరం కలవారు నిమ్మను ఎక్కువగా వాడటం మంచిది. వీరు రోజూ రెండు నిమ్మపళ్ళరసాన్ని దాదాపు పావులీటర్ నీళ్ళలో ఉదయాన్నే కలుపుకోవాలి. దాన్ని సగం అయ్యేవరకు బాగా మరిగించండి. ఆ తరువాత చల్లార్చి ఉంచుకోండి. తలంటు అయ్యాక ఈ నీటిని తలపై పోసుకుంటే కండిషనర్ లా పనిచేస్తుంది. జుట్టు వత్తుగా ఆరోగ్యంగా కనబడుతుంది. నిమ్మరసం పోసుకున్నాక మళ్లీ తలపై నీళ్ళు మాత్రం పోయొద్దు
7. ఒక గుడ్డులోని తెల్లసొనలో ఐదు టేబుల్ స్పూన్ల హెన్న ఒక కప్పు వేడినీళ్ళు అందులో రెండు టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్ కలిపి తలకు బాగా పట్టించి, అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో తలస్నానం చేయాలి ఇలా చేయడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది.
8. రెండు టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్ లో కొద్ది కోకోనట్ వాటర్ కలిపి తలకు పట్టి అరగంట తర్వాత మంచి కండిషనర్ షాంపుతో తలస్నానం చేస్తే వెంట్రుకలు రాలడాన్ని అరికట్టి జుట్టు మెరుస్తూ వత్తుగా పెరుగుటకు సహాయపడుతుంది.
9. రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని అరకప్పు పెరుగులో కలిపి తలకు బాగా మస్కలా వేసి, అరగంట తర్వాత తల స్నానం చేస్తే వెంట్రుకలు పొడిబారకుండా ఉంటాయి.
10.నిమ్మతో తయారుచేసిన పానీయాలను, పదార్థాలను లెమన్ షోడా, లెమన్ జ్యూస్, లెమన్ వాటర్, లెమన్ రైస్ గా పిలువబడుతూ ఆహారంగా నిమ్మ ఉపయోగపడుతుంది.



Click it and Unblock the Notifications
