Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
బట్టతల రాకుండా కాపాడే సహజ సిద్దమైన ఉపాయాలు...

అందులోను జుట్టు రాలడాన్ని నియత్రించేందుకు డబ్బులుపోసి పార్లర్లకు పరిగెత్తక్కర్లేదు. ఇంట్లోనే చేసుకునే ఎన్నో మంచి చిట్కాలు ఉన్నాయి. ముందుగా జుట్టు రాలడానికి కారణాలు తెలుసుకుని ఆ తరువాత వాటికి తగ్గ రెమెడీలు పాటిస్తే చాలు బట్టతలకు దూరంగా ఉండొచ్చంటున్నారు నిపుణులు.
పోషాకాహరం తీసుకోకపోవడం, విటమిన్, జన్యు లోపాలు, అధిక ఒత్తిడి, ఆందోళన, ఇబ్బందులు, టైఫాయిడ్, రక్తహీనత, విరేచనాలు, కామెర్ల వంటి దీర్ఘకాల అనారోగ్యాల వంటివి జుట్టు రాలడానికి కారణాలవుతాయి. వీటితోపాటు రక్త సరఫరా సరిగా లేకపోవడం, తల సరిగా శుభ్రం చేసుకోవడం వంటివి కూడా కారణాలే. జుట్టు రాలకుండా ఇంట్లోనే పాటించే కొన్ని జాగ్రత్తలు మీకోసం...వీటిని అనుసరించి బట్టతల బారిన పడకుండా జాగ్రత్తపడొచ్చు.
1. రోజూ ఉదయాన్నే ఒక ఉసిరి కాయ తినాలి.
2.. ప్రతిరోజూ రాత్రి ఐదు బాదం గింజలను నానపెట్టి వాటిని తెల్లవారి ఉదయాన పొట్టు తీయకుండా తినేయాలి.
3. ఒక గిన్నెడు మొలకెత్తిన గింజలు తినాలి. ప్రొటీన్ల కోసం ప్రతిరోజూ ఒక గుడ్డు తినాలి. కోడి కూర కూడా తినాలి.
4. స్ట్రాబెర్రీలు, అరటిపండ్లు, యాపిల్స్, మామిడి పండ్లు, సపోట, ద్రాక్షలను రోజూ రెండు లేదా మూడు పళ్లు తింటే మంచిది.
5. ఉదయాన్నే అవిసె గింజలు నానపెట్టిన ఒక గ్లాసు మంచి నీటిని తీసుకోవాలి. అవిసె గింజల్లో ఒమెగా 3 ఆమ్లాలు ఉంటాయి. ఇది జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది.
6. మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. రోజూ ఎనిమిది నుంచి పది గ్లాసుల నీళ్లు తప్పక తాగాలి. ఇవి జుట్టుకి కావలసిన పోషకాలను అందిస్తాయి.
7. టీ, కాఫీలు తగ్గించాలి. పూర్తిగా మానేస్తే మంచిది. అలాగని టీ, కాఫీ ప్రియులు నోరు కట్టేసుకోలేరు కాబట్టి రోజుకి రెండు గ్లాసుల వెన్న తీసిన పాలు తాగితే ఎంతో లాభం.
8. వారానికి ఒకసారి మెంతి గింజల గుజ్జును మాడుకు పట్టించి అరగంట తరువాత తల శుభ్రం చేసుకోవాలి. అలాగే పరగడుపున మెంతులు నానపెట్టిన నీళ్లు తాగాలి.
9. కూరగాయలు ఎక్కువగా తీనాలి. పాలకూర ఎంత ఎక్కువగా తింటే అంత మంచిది. చేపలు, కోడి, గుడ్లు వాడకం పెంచితే జుట్టు బాగుంటుంది. రెడ్ మీట్‌కి దూరంగా ఉండాలి.
10. తలస్నానం చివర్లో ఒక టీ స్పూను నిమ్మరసంతో కడిగేయాలి. ఇలా చేస్తే జుట్టు మెరుస్తూ ఉంటుంది. చుండ్రు రాదు.



Click it and Unblock the Notifications