Latest Updates
-
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.!
టీనేజ్ లో చుండ్రు సమస్య అధికంగా ఉంటే...?

1. చుండ్రును నివారించేందుకు క్రమంతప్పకుండా షాంపూతో తలస్నానం చేస్తూ ఉంటే చర్మంపైన పొట్టు లేకుండా ఉంటుంది. ఓటీసి డాండ్రఫ్ షాంపూను వాడితే ఫలితం వుంటుంది. తలస్నానం చేసే ముందు తలకు పూర్తిగా గోరు వెచ్చని నూనెను మర్దన చేసిన గంట లేదా రెండు గంటల తర్వాత తలస్నానం చేసుకొంటే మంచి ఫలితం ఉంటుంది.
2. ఒక కప్పు పెరుగు తీసుకొని అందులో ఒక గుడ్డు సొన మిక్స్ చేసి, తల మాడుకు అంటే విధంగా అప్లై చేయాలి. అరగంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే డాండ్రఫ్ ను వదిలించుకోవచ్చు.
3. ఒక చెంచా నిమ్మరసంలో ఒక చెంచా ఆలివ్ నూనెను వేసి మిక్స్ చేసుకొని తలకు బాగా పట్టించి ముని వేళ్ళతో మర్దన చేయాలి. తర్వాత పాత కర్చీఫ్ తో తలను కప్పి గట్టిగా ముడివేసుకొని రాత్రంతా అలాగే ఉంచి, ఉదయాన్నే షాంపూతో తలస్నానం చేసుకోవాలి.
4. చెంచా మెంతి పొడి తీసుకొని అందులో గుడ్డు సొనను మిక్స్ చేసి తలకు మట్టించి ఒక గంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి.
5. చిన్న గిన్నెలో చెంచా మెంతి పొడి, ఒక కప్పు పెరుగు తీసుకొని బాగా మిక్స్ చేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసి అరగంట తర్వాత స్నానం చేసుకోవాలి.
6. మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రెండు చెంచాల బీట్ రూట్ రసం మరియు గుడ్డు సొన, ఒక చెంచా నిమ్మరసం మిక్స్ చేసి తలకు మాడుకు బాగా పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.
7. వేపాకులను నీళ్ళలో వేసి బాగా మరిగించి, ఆ నీటితో తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
8. రాత్రి నిద్రించేందుకు ముందు తలకు బాగా నూనె రాసుకోవాలి. తర్వాత రోజు ఉదయం ఒక గిన్నెలోనికి ఒక చెంచా నిమ్మరసం, అరచెంచా ఉప్పు, వేసి మిక్స్ చేసి తల మాడను రబ్ చేయాలి. అవసరం అయితే నిమ్మతొక్కను ఉపయోగించవచ్చు. ఒక గంట తర్వాత తలస్నానం చేసుకోవాలి.
9. అరకప్పు పెరుగులో పచ్చని పెసలు పౌడర్ ను మిక్స్ చేసి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేసుకొంటే చుండ్రు తొలగిపోతుంది.
10. చుండ్రు మరీ ఎక్కువగా ఉన్నట్లైతే రెండు మూడు రోజులు వరుసగా పెరుగును తలకు పట్టించి గోరు వెచ్చని నీటితో తలస్నానం చేస్తే చుండ్రు సమస్యను నివారించవచ్చు.



Click it and Unblock the Notifications
