Latest Updates
-
నెయ్యి తాలింపు,జీడిపప్పుల క్రంచ్..స్వర్గాన్ని తలపించే జొన్న పిండి ఉప్మా..టేస్ట్ వేరే లెవెల్ అంతే! -
ఘుమఘుమలాడే దోసకాయ మటన్..వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే ఆహా స్వర్గమే! -
రోజూ 10 వేల అడుగులు పూర్తి చేయాలంటే ఎన్ని కిలోమీటర్లు నడవాలి? ఎన్ని కేలరీలు కరుగుతాయి? -
వేడి వేడి అన్నంలోకి అమృతం లాంటి ధనియాల రసం.. ఇలా చేస్తే గిన్నెలు గిన్నెలు తాగేస్తారు! -
స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ ఇంట్లోనే..ఎలాంటి సాస్ లు లేకుండానే అదిరిపోయే వెల్లుల్లి కారం ఎగ్ ఫ్రైడ్ రైస్.. -
పెసరపప్పు వెజిటేబుల్ ఇడ్లీ..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కేవలం 15 నిమిషాల్లో రెడీ! -
ఎప్పుడూ అలసిపోతున్నారా? అయితే మీ శరీరంలో ఈ విటమిన్ తగ్గినట్లే..డాక్టర్ చెప్పిన సంచలన నిజం! -
కరకరలాడే కాకరకాయ కాజు ఫ్రై..ఒక్కసారి వండితే రుచి మర్చిపోలేరు..అన్నం, పప్పు, రసంలోకి కేక! -
ఉగాది స్పెషల్ తమిళనాడు ఫేమస్ వెప్పం పూ రసం..హెల్త్ కి హెల్త్.. టేస్ట్ కి టేస్ట్! -
షుగర్ పేషెంట్లకు శుభవార్త.. ఈ స్వామిని దర్శిస్తే డయాబెటిస్ పూర్తిగా నయం!
అనేక జుట్టు సమస్యలకు శాశ్వత పరిష్కారం మన ఇంటి వైద్యం
జుట్టును సంరక్షించుకోవడంలో మనం చేయని ప్రయోగాలంటూ ఉండవు. ఎందుకంటే జుట్టు అందంగా, ఒత్తుగా, పొడవుగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కాబట్టి. జుట్టు సంరక్షణకు ఉపయోగించడానికి అనేక బ్యూట్రీ వస్తువులు(పదార్థాలు)ఉన్నాయి. అటువంటి బ్యూటీ వస్తువులు, పెరుగు, నిమ్మ, ఆయిల్, లేదా ఉడికించిన మందార పువ్వులు వంటివి మాత్రమే జుట్టు సంరక్షణలో ఉపయోగపడే పదార్థాలని మీరు అనుకుంటే, మీరు పొరపాటు పడ్డట్లే.
ఎందుకంటే మన వంటగదిలో మనకు తెలియకుండా మన జుట్టుకు ఉపయోగపడే పదార్థాలు అనేకం ఉన్నాయి. వాటిని ఉపయోగించి మన జుట్టుకు సరైన సంరక్షణ కల్పించవచ్చు. ఈ పదార్థాలను జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలను, జుట్టు రాలడంతో సహా, చుండ్రు, పొడి జుట్టు, తలదురద వంటి మరికొన్ని సమస్యలను నివారించుకోవచ్చు.
జుట్టు సంరక్షణ పదర్థాలు ఉసిరి, క్యాస్ట్రో ఆయిల్(ఆముదం), గుడ్డు, పెరుగు, వెనిగర్, నిమ్మ, మెహింది, వేపఆకులు, ఆలివ్ ఆయిల్ మొదలగునవి వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తాం. ఈ పదార్థాలు వివిధ జుట్టు సమస్యలకు చికిత్సకోసం హోం నివారణలుగా ఉపయోగిస్తాం. ఉదా: వేప ఆకులు చుండ్రు మరియు జుట్టు రాలే సమస్యలను నివారించడం కోసం ఉపయోగిస్తాం. అలాగే మెహిందిని కూడా జిడ్డుగా ఉన్న జుట్టు, మరియు రాలే జుట్టు నివారణల కోసం ఉపయోగిస్తుంటాం. ఇక వెనిగర్ మరియు గుడ్డు జుట్టు సంరక్షణ పదార్థాల్లో ఇవి కూడా అద్భుతమైనవి జుట్టును మృదువుగా మరియు మందగా పెరిగేందుకు ఉపయోగపడుతాయి . కాబట్టి ఆర్టిఫిషియల్ హెయిర్ ప్రొడక్ట్స్ కోసం డబ్బు వృధా చేయడం కంటే, ఇంట్లో లభించే ఇటువంటి ప్రభావంతమైన వస్తువులను ఉపయోగించి జుట్టును సంరక్షించుకోండి.
మరి మన ఇంట్లో దొరికే 20 హెయిర్ కేర్ పదార్థాలు

ఆమ్లా(ఉసిరి):
దీన్నే ఇంగ్లీష్ లో గూస్బెర్రీ అంటారు, జుట్టు రాలడాన్ని, చుండ్రతో పోరాడి మరియు జుట్టు అంటువ్యాధులను తగ్గించడంలో ఒక అద్భుతమైన పదార్థం ఉసిరికాయ. కాబట్టి ఉసిరికాయ పొడి లేదా ఉడికించి పేస్ట్ చేసి పెరుగులో మిక్స్ చేసి ఉసిరికాయ మిశ్రమాన్ని హెయిర్ ప్యాక్ గా ఉపయోగించుకోవచ్చు.

పెరుగు:
పెరుగును జుట్టు మంచి షైనింగ్ తో, బలంగా మరియు మందగా ఉండాలని కోరుకునే వారు పెరుగును జుట్టుకు ఉపయోగిస్తారు. అందుకు మీరు నేరుగా పెరుగును జుట్టుకు పట్టించడం లేదా తెనె లేదా నిమ్మరసం వంటి ఇతర వస్తువులతో చేర్చి తలకు ప్యాక్ వేసుకోవచ్చు.

నిమ్మరసం:
జుట్టు రాలడాన్ని అరికట్టి, చుండ్రును నివారించడంలో మరో అద్భుతమైన బ్యూటీ పదార్థం నిమ్మరసం. అంతే కాదు నిమ్మరసాన్ని తలలో దురద మరియు జిడ్డును వదిలించుకోవడానికి కూడా ఉపయోగించవచ్చు.

కొబ్బరి నూనె:
జుట్టుకు ఉపయోగించే నూనెల్లో కొబ్బరి నూనె చాలా ప్రసిద్ది చెందినది. అనేక జుట్టు సమస్యలకు కొబ్బరి నూనె అద్భుతంగా పనిచేస్తుంది. కొబ్బరి నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల తలలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దాంతో జుట్టు రాలడాన్ని అరికడుతుంది.

మెహింది:
దీన్ని హెన్నాతో తయారు చేస్తారు. గోరింటాకు పొడిని పెరుగు మరియు నిమ్మరసంతో మిక్స్ చేసి తలకు పట్టిస్తుంటారు. జుట్టును మృదువుగా మరియు సిల్కీ బ్లాక్ కలర్ లో ఉంచడంలో ఇది చాలా ప్రభావంతమైన హెయిర్ ప్యాక్.

వెనిగర్:
జుట్టు సహజంగానే మృదువుగా మరియు నునుపుగా మార్చడంలో వెనిగర్ అద్భుతంగా పనిచేస్తుంది. హెయిర్ వాష్ తర్వాత ఒక కప్పు వెనిగర్ ను ఒక మగ్గునీళ్ళలో వేసి తలమీద పోసుకోవాలి.

వేపఆకులు:
వేపలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల వేపాకులను ఉపయోగించడం వల్ల జుట్టు రాలడంతో పోరాడుతుంది మరియు పేలను వదలగొడుతుంది మరియు స్లాప్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది.

మెంతులు:
మెంతులు అనేకు జుట్టు సమస్యలను చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. హెయిర్ ఫాల్, చుండ్రు, పొడి జుట్టు, మరియు చిట్లను జుట్టును నివారిస్తుంది.

గుడ్డు:
తలస్నానం చేయడానికి అరగంట ముందు గుడ్డును జుట్టుకు అప్లై చేయడం వల్ల మంచి హెయిర్ కండీషనర్ గా పనిచేస్తుంది.

ఆముదం:
జుట్టు రాలడాన్ని సహజంగా నివారించడంలో మరియు జుట్టు పెరుగుదలకు చాలా బాగా సహాయపడే మరో హెయిర్ బ్యూటీ ఇనిగ్రెంట్ ఆముదం.

అలోవెరా జెల్:
విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టును చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది జుట్టు పెలుసుదనంను పోగొడుతుంది మరియు చిట్లడాన్ని నివారిస్తుంది. మరియు మాయిశ్చరైజ్ చేస్తుంది.

కొత్తిమీర :
కొత్తిమీరను పెరుగుతో సహా, పేస్ట్ లా తయారు చేసి, జుట్టు మొత్తానికి అప్లై చేయాలి. ఇంకా ఇందులో ఎగ్ వైట్ కూడా వేసి జుట్టుకు పట్టించవచ్చు.

ల్యావెండర్ ఆయిల్:
జుట్టు డ్యామేజ్ ను అరికట్టడానికి మరియు జుట్టు మూలాలకు తగినంత బలాన్ని చేకూర్చడానికి, ఈ నూనె అద్భుతంగా సహాయపడుతుంది. అందువలన, ఎటువంటి ఆందోళన లేకుండా లావెండర్ ఆయిల్ ను తలకు బాగా పట్టించి జుట్టును సంరక్షించుకోండి.

తేనె:
జుట్టు మృదువుగా, షైనింగ్ తో ఉండాలంటే కొన్ని చుక్కల తేనెను మీ హెయిర్ ప్యాక్స్ లో మిక్స్ చేసుకోవాలి. గుడ్డు లేదా ఎగ్ వైట్ తో తేనె మిక్స్ చేసి, హెయిర్ ప్యాక్ లా వేసుకోవచ్చు.

షీ బట్టర్:
ఇది జుట్టుకు మంచి కండీషనర్ గా మరియు పొడి జుట్టును నివారించడానికి షీ బట్టర్ ను ఉపయోగించాలి. ఇది జుట్టును మాయిశ్చరైజ్ చేసి, జుట్టు రాలడాన్ని అరికడుతుంది.

మందార పువ్వులు:
ఉడికించిన మందార పువ్వులు చాలా ప్రభావంతంగా పనిచేస్తాయి. జుట్టు రాలడాన్ని అరికట్టడంలో ఇది ఒక గొప్ప హోం రెమడీ. మందరా పువ్వులను పెరుగు లేదా గుడ్డుతో మిక్స్ చేసి ప్యాక్ లా వేసుకోవచ్చు. లేదా కొబ్బరి నూనెలో కాచి తలకు మసాజ్ చేసుకోవచ్చు.

జోజోబా ఆయిల్:
ఈ హెయిర్ ఆయిల్ జుట్టుకు పోషణను అంధిస్తుంది మరియు డ్యామేజ్ అయిన జుట్టును తిరిగి కోలుకునేలా చేస్తుంది. మరియు జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

కొబ్బరి పాలు:
చిట్లన జుట్టును నివారించడానికి మరియు పొడి జుట్టు మరియు తలలో దురదను నివారించడానికి కొబ్బరి పాలతో తలను మసాజ్ చేయాలి. ఇది తలకు సహజంగానే పోషణను అందిస్తుంది.

మయోనైజ్:
పొడి జుట్టు మరియు డ్యామేజ్ హెయిర్ ను నివారించడానికి మయోనైజ్ ను అప్లై చేయాలి . మరియు ఇది జుట్టును సున్నితంగా చేస్తుంది మరియు జుట్టు తెగడాన్ని నివారిస్తుంది.

రీతా(కుంకుడుకాయ):
ఇది జుట్టు revitalises మరియు జుట్టు నష్టం నిరోధిస్తుంది. అంతేకాక, reetha జుట్టు నలుపు రంగులో ఉండేదుకు రక్షణ కల్పిస్తుంది. కాబట్టి, ఇది గ్రే హెయిర్ ను నివారిస్తుంది.



Click it and Unblock the Notifications











