Latest Updates
-
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే
కురులకు హాని కలిగించే 7 రకాల నీళ్ళు...
సాధారణంగా శీతాకాలంలో, హెయిర్ ఫాల్ గురించి చాలా కంప్లైంట్ వింటుంటాం..జుట్టు రాలిపోవడం, పొడిబారి, ఎడినట్లు ఉండటం. నిర్జీవంగా కళ లేకుండా పోవడం వంటివి ఎక్కువ. అందుకు కారణం వాతావరణంలో మార్పులు, కెమికల్ హెయిర్ ప్రొడక్ట్స్ మొదలైనటువంటివి. కాబట్టి శీతాకాలంలో జుట్టు రాలడాన్ని అరికట్టడానికి, జుట్టు సంబంధిత సమస్యలను ఎదుర్కోవడానికి కొన్ని హెయిర్ కేర్ ప్రొడక్ట్స్, వంటింటి చిట్కాలును ఉపయోగించి మంచి ఫలితాలను పొందవచ్చు.
అయితే చాలా కాలం నుండి హెయిర్ కేర్ ప్రోడక్ట్స్, ట్రీట్మెంట్స్ తీసుకుంటాన్నా కూడా జుట్టు రాలడం, ఇతర సమస్యలు అలాగే ఉంటే దానికి గల కారణాన్నిప్రత్యేకంగా తెలుసుకోవాలి. ఒక వేళ వాటర్ వల్ల కూడా ఈ సమస్యలు ఉండవచ్చమో కనుక్కోండి. కాబట్టి నీటివల్ల జుట్టు రాలడం, జుట్టు సంబంధిత సమస్యలు ఏర్పడేటప్పుడు తలస్నానానికి ఎటువంటి నీటిని ఉపయోగిస్తున్నారో తెలుసుకోవాలి. నీటి కారణంగానే జుట్టు రాలిపోవడం, ఎండిపోవడం వంటివి జరుగుతాయి కాబట్టి నీటిని మార్చి చూడండి. ఉదాహరణకు మీరు హార్డ్ వాటర్ తో తలస్నానం చేస్తున్నట్లైతే ఈ నీళ్ళల్లో అధికంగా క్లోరిన్ కలిసి ఉండటం వల్ల జుట్టు అధికంగా రాలిపోతోందని పసిగట్టాలి. జుట్టు రాలడానికి, జుట్టు సంబంధిత సమస్యలకు కారణం అయ్యే కొన్ని రకాల నీటి గురించి తెలుసుకుందాం...

1. క్లోరిన్ వాటర్: కోరిన్ వాటర్ కి కొన్ని క్రిమిసంహారక రాసాయనాలను తగినంత మోతాదులో వాడినప్పు జుట్టుకు ఎటువంటి హానీ కలగదు. అయితే క్లోరిన్ వాటర్ తలకు పోసుకోవడం వల్ల జుట్టు ఖచ్చితంగా పొడి బారి, ఎండినట్లు కనిపిస్తుంటుంది. కొన్ని స్విమ్మింగ్ పూల్స్ లో ఉన్న నీరు ఎప్పుడూ క్లీనింగ్ ఉండాలనేసి అందులో క్లోరిన్ కలుపుతుంటారు. కాబట్టి స్విమ్ చేసేటప్పుడు తలకు క్యాప్ పెట్టుకోవడం తప్పనిసరి.
2. హార్డ్ వాటర్: హార్డ్ వాటర్ లో ఎక్కువగా మెగ్నీషియం, క్యాల్షియం, సిలికా మరియు కరిగిపోయే మినిరల్స్ అధికంగా ఉండటం వల్ల కురులు ఎండినట్లు అయిపోవడం, మద్యకు తెగిపోవడం, జుట్టు పల్చబడటం వంటి సమస్యలు ఏర్పడుతాయి. హార్డ్ వాటర్ లోని సిలికా చుండ్రకు కారణం అవుతుంది.
3. సాల్డ్ వాటర్: తలలోని తేమను ఉప్పు నీటితో తొలగింపబడి జుట్టు పొడిబారీనట్లై, జుట్టు తెగిపోవడి, నిర్జీవంగా మారడం, హెయిర్ ఫాల్ కు దారితీస్తుంది. అంతే కాదు ఈ నీటివల్ల పర్మనెంట్ గా కురులు తొలగిపోయి బట్టతల ఏర్పడేందుకు దారితీస్తుంది.
4. డిసాలినేటెడ్ వాటర్: డిసాలినేటెడ్ వాటర్, ఈస్ట్ కంట్రీస్ లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. సీ వాటర్ నుండి సాల్ట్ ను తొలగించి త్రాగడానికి ఉపయోగిస్తుంటారు. అటువంటి వాటర్ కురులకు చాలా హానికర. ఇందులో ఎక్కువగా క్లోరిన్, సోడియం ఉండటం వల్ల కురులు పొడిబారి, చిక్కుబడి అస్యహ్యంగా తయారవుతాయి.
5. వర్షపు నీరు: వర్షపు నీరుతో చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలున్నాయంటుంటారు. అంతే కాదు ఈ నీటిని శుద్దమైన నీరుగా, సాప్ట్ వాటర్ గా చెబుతుంటారు.అయితే తలస్నానానికి ఉపయోగపడవు. ఎందుకంటే వర్షపు నీరు ఎయిర్ పొల్యూషన్ వల్ల కురులు చిక్కువడి, డ్రైగా మారుతాయి.
6. సర్ ఫేస్ వాటర్: సర్ ఫేస్ వాటర్ నది లేదా సరస్సు నుండి పంపుల ద్వారా సరఫరా చేయబడుతాయి. ఈ సర్ ఫేస్ వాటర్ లో అతి తక్కువ మినిరల్స్ కలిగి ఉంటాయి. ఈ నీరు పర్యావరణ మరియు కాలుష్యంలో కలవడం వల్ల బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. అందుకు నీటిని శుద్దతకు క్లోరిన్, నిమ్మరసం కలిపి స్నానం చేసినాకూడా.. కోరిన్ ప్రభావం వల్ల కురులు ఎండిపోయి, హెయిర్ ఫాల్ కు దారితీస్తుంది.
7. గ్రౌండ్ వాటర్(బావి నీరు): గ్రౌండ్ వాటర్ వర్షపు నీరుభూమిలో చేరి భూమి పొరల గుండా మరియు భూమి అడుగున స్థిరపడి ఉంటాయి. అక్కడ ఎక్కువ ఖనిజాలు(ఇనుము మరియు మెగ్నీషియం)భూమిలోపల మట్టిలో కలవడం వల్ల ఆ నీటి ఉపయోగించడం వల్ల కూడా కురులు పొడిబారి, కేశాలు మెరుపును కోల్పాతాయి.
మనష్యులకు ఉన్న జుట్టు చాలా సహాజంగా ఉండి, తేమను కలిగి, ప్రోటీన్స్(కెరాటిన్ మరియు కేశాల రంగుకు ఉపయోగపడే మెలనిన్)ఉంటుంది. మారుతున్న ట్రెండ్ ప్రకారం కేశాలకు హానికరమైన రసాయనాలు మరియు రంగులు వాడటం వల్ల జుట్టుకు శాశ్వత నష్టం సంభవిస్తుంది. ఒక వేళ మీరు ఉపయోగించే నీటిలో హానికరమై రసాయాలను కనుక ఉంటే సమస్య మరింత జఠిలమవుతుంది. అందుచేత మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి నేచురల్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తూ, కేశాలకు రెగ్యులర్ ఆయిల్ మసాజ్ చేస్తూ, ఆరోగ్యకరమైన ఆహారాన్ని, ద్రవాలను ఎక్కువగా తీసుకుంటూ జుట్టు ఆరోగ్యవంతంగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం.



Click it and Unblock the Notifications
