Latest Updates
-
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.!
జుట్టు సంరక్షణకు బెవరేజస్ తో అధిక లాభం.!
ప్రస్తుత కాలంలో జుట్టు సమస్యలు స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ అధికంగా ఉన్నా, స్త్రీలు మాత్రం అధిక శ్రద్ద తీసుకొని, మార్కెట్లో లభించే అన్ని రకాల హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ను కొని, వారి జుట్టు పోషణ కొరకు ఉపయోగిస్తుంటారు. తలలో దురద మరియు చుండ్రు, ఇతర జుట్టు సమస్యలకు ఎల్లప్పుడు నేచురల్ హెయిర్ ట్రీట్మెంట్స్ చాలా సులభం మరియు ఉపయోగకరం. హెయిర్ కేర్ విషయంలో చాలా సులభంగా లభించే బెవరేజస్ అందుబాటులో ఉన్నాయి.
బెవరేజస్ (పానియాలు)మీ జుట్టును ఆరోగ్యంగా, మరింత బౌన్సీ మరియు ఒక్క వారంలో మీ జుట్టు సమస్యలన్నింటినీ వదిలించుకోవచ్చు. ఈ జుట్టు సంరక్షణ విధాన చికిత్సను రోజువారీ చేయవల్సిన అవసరం లేదు. మరియు దీనికి ఎక్కువ సమయం కూడా పట్టదు. ఈ నేచురల్ హెయిర్ ట్రీట్మెంట్ కు ఒక ఖచ్చితమైన సమయం మరియు ఉపయోగించే విధానం తెలుసుండాలి.
మీ జుట్టుకు ఏ ఒక్క రెమడీనీ అప్లై చేయాలన్నా ముందుగా మీర స్పెషలిస్ట్ ను సంప్రదించాలి. మీరు తల, జుట్టు సమస్యలతో బాధపడుతున్నప్పుడు, హెయిర్ కేర్ స్పెషలిస్ట్ తో టెస్ట్ చేయించుకోవడం చాలా అవసరం. అయితే ఇక్కడ మేము ఇస్తున్న హెయిర్ కేర్ ట్రీట్మెంట్ తలకు, కేశాలకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కలిగించవు. కాబట్టి వీటిని ఉపయోగించడం సురక్షితమే...
జుట్టు సంరక్షణకు ఉపయోగపడే కొన్ని పానీయాలు

మజ్జిగ:
ఈ ఇండియన్ బెవరేజ్ చుండ్రుకు ఒక మంచి నేచురల్ హెయిర్ ట్రీట్మెంట్ గా ఉపయోగించవచ్చు. మజ్జిగ, పెరుగు వంటివి దురద పెట్టి తలకు చాలా ఎఫెక్టివ్ గా ప్రభావం చూపెడుతుంది. పెరుగు, లేదా మజ్జిగలో ఉండే ఆయిల్ తలకు నేచురల్ కండీషనర్ గా ఉపయోగపడుతుంది.

బీర్:
మీ కేశాలకు వాల్యూమ్ జోడించడానికి, జుట్టు సంరక్షణకు ఉపయోగపడే పానీయాల్లో ఒక ఉత్తమ పానీయం బీర్. మూడు వారాలకొకసారి బీర్ తో మీ కేశాలను శుభ్రపరచుకోవడం వల్ల కేశాల యొక్క నాణ్యత పెరుగుతుంది. ఇంకా బీర్ తలకు పట్టించడం వల్ల చుండ్రు నివారించబడుతుంది.

టీ:
జుట్టు సంరక్షణలో బ్లాక్ టీ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది ఒక నేచురల్ హెయిర్ ట్రీట్మెంట్.ముందుగా టీఆకును బాగా ఉడికించి వడగంటి, తలమీద పోసుకోవాలి. పది, పదిహేను నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఈ నేచురల్ హెయిర్ ట్రీట్మెంట్ వల్ల జుట్టు ఒత్తుగా, మందంగా పెరుగుతాయి .

కాఫీ:
కాఫీ మీ కేశాలకు మంచి మెరుపు అంధిస్తుంది . తలకు షాంపుతో స్నానం చేసిన తర్వాత చివరగా బ్లాక్ కాఫీని తలారా పోసుకోవాలి. అరగంట అలాగే ఉండనిచ్చి తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కేశాలను శుభ్రం చేసుకోవాలి. ఈ హెయిర్ కేర్ ట్రీట్మెంట్ ను నెలకు రెండు సార్లు చేసుకోవచ్చు.

వైన్:
ఎవరికైతే కేశాలు చూడటానికి నిర్జీవంగా ఉంటాయో అటువంటి వారు, ఈ వైన్ ఉపయోగించి కేశాలకు మంచి షైనింగ్ తో ఉండేలా చేసుకోవచ్చు. అరబక్కెట్ నీటిలో అర కప్పు వైన్ ను కలుపుకొని తలకు షాంపూ చేసిన తర్వాత ఈ వైన్ కలిపిన నీటితో తలస్నానం చేయాలి. ఇలా 15 రోజులకొకసారి చేయడం వల్ల మీకు మంచి ఫలితం ఉంటుంది.

వోడ్కో:
వోడ్కో చాలా మందికి ఇది ఒక మంచి బెస్ట్ డ్రిక్. కానీ, కొంత మంది మహిళలు, మాత్రం వోడ్కో హెయిర్ కేర్ కు ఒక ఉత్తమ బెవరేజ్ అంటారు. గోరువెచ్చని నీటిలో 20ml వోడ్కోను మిక్స్ చేసి తలస్నానం చేయడం వల్ల దీర్ఘకాలంగా మీ జుట్టును వేధిస్తున్న చిట్ల సమస్యను నివారిస్తుంది. వోడ్కో చిట్లిన జుట్టును నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

బియ్యం నీళ్ళు:
బియ్యం కడిగిన నీళ్ళను తలమీద పోసుకోవడం వల్ల, ఇది మంచి షైనింగ్ వస్తుంది . బియ్యం నీళ్ళు జుట్టుకు ఆరోగ్యంకరంగాను మరియు జుట్టు డ్యామేజ్ ను తొలగిస్తుంది. గంజిలో జుట్టుకు కావల్సిన పోషకాలు ఉండటం వల్ల తగినంత పోషణ ఇస్తుంది.

కొబ్బరి నీళ్ళు:
మీ జుట్టు చాలా రఫ్ గా ఉన్నప్పుడు కొబ్బరినీళ్ళుతో తలకు పట్టించడం వల్ల మంచి కండీషనర్ గా పనిచేస్తుంది. దాంతో కేశాలు, నునుపు, సున్నితంగా మారుతాయి. 100mlకొబ్బరి నీళ్ళను తలమీద పోసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇలా వారానికి ఒకసారి చేస్తే మేలు.

గ్రీన్ టీ:
జుట్టు రాలడాన్ని తగ్గించడంలో గ్రీన్ టీ అద్భుతంగా పనిచేస్తుంది. గ్రీన్ టీ వల్ల అనేక విధాలుగా..వివిధ రకాల ప్రయోజనాలు కలిగిస్తుంది. ఇది జుట్టు రాలడం నిరోధించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి మీరు స్నానం చేసే నీటిలో ఒక కప్పు గ్రీన్ టీ కలుపుకోవడం మంచిది.

ఆమ్లా జూస్:
హెయిర్ కేర్ లో ఒక అద్భుతమైన బెవరేజ్ ఆమ్లా హెర్బల్ జ్యూస్. ఉసిరిలో ఉండే పోషకాంశాలు జుట్టు రాలడాన్ని తగ్గించి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది . నెలకొకసారి ఉసిరి రసాన్ని తలకు పట్టించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.



Click it and Unblock the Notifications