Latest Updates
-
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే -
వీటిని ఫ్రిజ్లో పెట్టి తింటే క్యాన్సర్ రావడం పక్కా.. పొరపాటున కూడా ఈ పని చేయకండి.! -
అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే.. -
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.!
జుట్టు చిట్లకుండా ఉండేదుకు బెస్ట్ హెయిర్ మాస్కులు
ప్రస్తుత రోజుల్లో చివర్లు చిట్లిన శిరోజాలు చాలామందిని వేధించే సాధారణ సమస్య. జుట్టు చివర్లు చిట్లిపోవడానికి అనేక కారణాలున్నాయి..ముఖ్యంగా వాతావరణం అధిక ఉష్ణోగ్రత మరియు కాలుష్యం వల్ల జుట్టు తొందరగా పొడిబారి చిట్లిపోతుంది. వీటితో పాటు కెమికల్ ప్రొడక్ట్స్, హాట్ స్టైలింగ్ టూల్స్, ఎప్పుడూ తలస్నానం చేయడం, తక్కువ నాణ్యత గల ఉత్పత్తుల వినియోగం, ఇవన్నీ కూడా జుట్టు చివర్లు చిట్లిపోవడానికి ప్రధాన కారణంగా ఉన్నాయి. దాంతో వాటి ఎదుగుదల సరిగా ఉండదు. అంతేకాకుండా జుట్టు బలహీనంగా మారిపోతుంది. శిరోజాలు నిర్జీవంగా మారి రాలిపోతాయి.
స్త్రీలు మరియు పురుషులలో శిరోజాలు చిట్లటం అన్నది సర్వసామాన్యమైన విషయమే. దురదృష్టవశాత్తు, మనలో చాలా మందికి ఈ పరిస్థితి నుండి ఎలా బయటపడాలో లేదా దీనికి చికిత్స ఏమిటి అన్నది తెలియదు. వెంట్రుకలు చిట్లటం వలన మీ సహజమైన అందం లోపిస్తుంది మరియు మీ జుట్టు పెరుగుదలను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ పరిస్థితి ముఖ్యంగా జుట్టును తప్పు పద్ధతుల ద్వారా నిర్వహించినప్పుడు వొస్తుంది. ఒకసారి శిరోజాలు చిట్లటం ప్రారంభమవుతే, అది సంవత్సరాలవరకు సాగుతుంది.
చిట్లిన జుట్టుకు చెక్ పెట్టాలంటే కొన్ని ఇంట్లో తయారు చేసుకొనే బెస్ట్ హోమేడ్ హెయిర్ మాస్క్ ఉన్నాయి. వీటిని ఉపయోగిండం వల్ల జుట్టు చిట్లకుండా నిరోధించవచ్చు. మరి ఆ హెయిర్ మాస్క్ ఏంటో ఒక సారి చూద్దాం...

ఎగ్ మాస్క్:
ఒక గుడ్డు తీసుకొని అందులో మూడ టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ మరియు ఒక టేబుల్ స్పూన్ తేనె మిక్స్ చేసి తలకు బాగా మసాజ్ చేయాలి. తర్వాత తలకు షవర్ క్యాప్ ధరించి ఒక గంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

బొప్పాయి మాస్క్:
మీ కేశాల పొడవును బట్టి, బాగా పండిన బొప్పాయి గుజ్జును తీసుకొని దానికి పెరుగు మిక్స్ చేసి బాగా మెత్తగా చేయాలి. ఈ పేస్ట్ ను మీ తల మాడుకు కేశాలకు పట్టించాలి. తర్వాత నిదానంగా మసాజ్ చేసి పది నిముషాలు అలాగే ఉంచాలి. 15నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.

ఆయిల్ మాస్క్ :
ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, బాదాం ఆయిల్ మరియు ఆముదం తీసుకొని బాగా మిక్స్ చేసి తలకు బాగా మసాజ్ చేయాలి. 15నిముషాల తర్వాత వేడినీటిలో ముంచిన టవల్ తో తలకు చుట్టి పది నిముషాలు అలాగే ఉంచాలి. ఇలా మూడు సార్లు మళ్ళీ మళ్ళీ చేసి చివరగా సాధారణ నీటితో తలస్నానం చేసుకోవాలి.

తేనె మాస్క్:
రెండు టేబుల్ స్పూన్ల తేనె కు రెండు టేబుల్ స్పూన్ల పెరుగు మరియు నిమ్మరసం మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసి పేస్ట్ లా తయారయ్యాకు తలకు ప్యాక్ లా వేసుకోవాలి. పదిహేను నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

అవొకాడో మాస్క్:
ఒక అవొకాడో పండును గుజ్జులా తయారు చేసుకొని అందులో ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి తలకు బాగా పట్టించాలి. ఇది చిట్లిన జుట్టుకు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అరగంట తర్వాత తలస్నానం చేసుకోవాలి.

బీర్ మాస్క్:
బీర్ కేశాలకు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మంచి ఫలితాలను ఇస్తుంది. బీర్ ను ఒక మగ్గునీటిలో మిక్స్ చేసి తలంటు పోసుకోవాలి. లేదా స్ప్రే బాటిల్ ఉపయోగించి కేశాలకు బీర్ స్ప్రే చేసుకోవచ్చు . తర్వతా 20నిముషాల తర్వాత నార్మల్ వాటర్ తో తలస్నానం చేయాలి.

మయోనైజ్ మాస్క్:
1/4కప్పు మొయోనైజ్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ తేనె, అరకప్పు అవొకాడో గుజ్జు మిక్స్ చేయాలి. మెత్తగా పేస్ట్ లా చేసి తలకు బాగా పట్టించాలి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications
