Latest Updates
-
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026
జుట్టు ఊడిపోవడానికి గల 10 ప్రధాన కారణాలు..!
మీరు తల దువ్విన తరువాత దువ్వెన పెద్ద, నల్లని జుట్టుని పట్టుకొని ఉందా? అలా అయితే మీకు బట్టతల వచ్చే అవకాశం ఉంది. మీరు ఊడిపోయే జుట్టుకు కారణాలు ఏమిటో గుర్తించడం సాధ్యం కాదు? బట్టతలకు, జుట్టు వూడిపోవడానికి క్రింద ఇచ్చిన 10 కారణాలను చదవండి.

ఒత్తిడి: వేగవంతమైన, తీవ్రమైన జీవన శైలి మీ శక్తిని బైటికి పంపి వత్తిడి స్థాయిలను పెంచుతుంది. ఎక్కువ శాతం ప్రజలు వొత్తిడిని నిరోధించలేక పోవడం వల్ల ఎక్కువ జుట్టును పోగొట్టుకుంటున్నారు, కానీ తప్పనిసరిగా బట్టతలకు ఒక్క ఒత్తిడి మాత్రమె కారణం కాదు.

కుటుంబ చరిత్ర: కుటుంబంలో బట్టతల ఉంటె, మీరు ఏమి చేసినా దీనిని చక్కదిద్దలేరు. మీరు సరైన ఆహరం, జీవనశైలిని అనుసరించడం ద్వారా ఎక్కువ జుట్టును కోల్పోయే ప్రమాదాన్ని తగ్గించవచ్చు, కొన్ని పనులు చేయకపోవడం వల్ల కూడా వేగంగా జుట్టు రాలడానికి దోహదపడుతుంది.

వెంట్రుకల శైలిని మార్చే పరికరాలు: తల స్నానం చేసిన తరువాత బ్లో తో పొడిబారేటట్లు చేయడం తేలిక, సరైన పద్ధతి కాదు, కానీ అనేక అధ్యయనాలు ప్రతిరోజూ జుట్టుని బ్లోతో పొడిబారేటట్లు చేస్తే జుట్టు రాలడానికి దోహదపడుతుందని సూచించాయి. స్త్రైట్నింగ్, కర్లింగ్ వంటి ఇతర స్టైలింగ్ చికిత్సలు తరచుగా చేస్తే, మీ జుట్టుదువ్వే దువ్వేనపై కొన్ని అదనపు వెంట్రుకలు పోగవుతాయి.

హార్మోన్ల మార్పువల్ల: ముఖ్యంగా గర్భం దాల్చినపుడు, ప్రసవ సమయంలో హార్మోన్ల హెచ్చు తగ్గుల వల్ల అధిక స్థాయిలో వెంట్రుకలు రాలడం జరుగుతుంది. థైరాయిడ్ లో హెచ్చుతగ్గులు, మేనోపాస్, ఇతర హార్మోన్లకు సంబంధించిన పరిస్థితులు కూడా జుట్టు రాలడానికి కారణాలు కావచ్చు.

రసాయన ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగించడం: షాంపూలు, కండిషనర్లు, జుట్టు నూనెలు ఒకటి కంటే ఎక్కువ మార్గాలలో మీ జుట్టును విసిగింప చేస్తాయి, ఇవి అనేక రసాయనాలతో నిండి ఉంటాయి. జుట్టు కుదుళ్ళు బలహీనపడడానికి, జుట్టు చివర్లు విడిపోయే, జుట్టు రాలే, ఇంకా అనేక ఇతర జుట్టుకు సంబంధించిన విషయాలకు దోహదపడే హానికరమైన రసాయనాలు కలిగిఉండే సౌందర్య ఉత్పత్తులను మనం కొనుగోలు చేస్తున్నాము.

జంక్ ఫుడ్: పోషకాహార లోపలకు దోహదపడే జంక్ ఫుడ్ తీసుకోవడం బట్టతలకు దారితీస్తుంది. ప్రజలు ఒక పద్ధతి లేకుండా తినడ౦ వల్ల కూడా జుట్టు రాలడం సమస్య ఎక్కువగా ఉంటుంది.

కఠినమైన వాతావరణ పరిస్థితులు: మీ కార్యాలయంలో, మీ ఇంటిలో ఉండే ఎయిర్ కండిషనర్ సౌకర్యవంతమైనది, అనుకూలమైనది, అనుకూలమైన విధంగా ఉంటుంది, కానీ అది మీ జుట్టుకు సరైనది కాదు. పెళుసైన, నష్టపోయే అవకాశం ఉండడంతో జుట్టు ఏ వాతావరణ మర్పులకైన తీవ్రంగా స్పందిస్తుంది. మీ జుట్టు రాలిపోకుండా ఉండడానికి ఇటువంటి పరిస్థితులను నివారిచడమే మంచి మార్గం.

జెండర్: జుట్టు రాలడం, బట్టతల అనేవి మగ, ఆడ ఇద్దరిలో ఉన్నప్పటికీ, మహిళలు ఒకే విధానంలో జుట్టును కోల్పోతారు - తల చుట్టూ, పురుషులు ఒక ప్రత్యేకమైన (కేశాలు నెమ్మదిగా తగ్గుతుండడం) నమూనాలో జుట్టును కోల్పోతారు. సాధారణంగా పురుషులకు సంభవించే రోగనిరోధక పరిస్థితుల వల్ల కూడా బట్టతల వస్తుందని భావిస్తారు.

నిద్రలేమి: నిద్రలేమి అనేది మీ కళ్ళ కింద, అలాగే మీ తలపై కూడా ప్రభావితం చూపుతుంది. నిద్రలేమి, నార్కోలెప్సీ, ఇతర నిద్ర రుగ్మతలు మీ జుట్టు ఆరోగ్య౦పై ప్రభావితం చేయవచ్చు, కాలక్రమేణా, అది బట్టతలకు కూడా కారణం కావచ్చు.

మందులు, చికిత్సలు: మానసిక నొప్పిని, గాయాన్ని కలుగచేసే ఒక ప్రమాదకరమైన సంఘటన జీవితంలో తీవ్రమైన మార్పును తెస్తుంది. చికిత్సలను, మందులను అనుసరించడం వల్ల మాత్రమె మీ ఊడిపోయే జుట్టును ఆరోగ్యంగా ఉంచవచ్చు. కొన్ని మందులను, అధిక మోతాదులో (కీమోతేరపీ వలె) ఉపయోగించడం వల్ల అధికంగా జుట్టు రాలడం, బట్టతల వచ్చే ప్రమాదం ఉంది.



Click it and Unblock the Notifications











