Latest Updates
-
తిన్న వెంటనే కడుపు ఉబ్బిపోతోందా?.. ఇలా చేస్తే జీర్ణక్రియ మెరుగుపడి, కడుపు ఉబ్బరం తగ్గిపోతుంది!.. -
‘అద్దం’తో దంపతుల మధ్య తరచూ గొడవలు.. ఎందుకంటే.? -
ఆగ్రా ఫేమస్ పేఠా స్వీట్.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా.. -
కారం లేకుండానే ఘాటుఘాటు రుచితో వైట్ మటన్ పులావ్.. మసాలా నషాళానికి అంటాల్సిందే.! -
గ్రహణం రోజు ఈ పూజ తప్పనిసరిగా చేయాలట.. శాస్త్రాలు చెప్పే పూర్తి నియమాలు ఇవే! -
Chanakya Niti: చాలామంది జీవితంలో ఆలస్యంగా నేర్చుకునే 8 పాఠాలు..టాలెంట్ ఉన్నా ఫెయిల్? -
జూన్ 3: గ్రహాల కదలికలతో ఈ రాశుల వారికి అకస్మాత్తుగా ధనయోగం, కెరీర్లో ఊహించని అద్భుతాలు! -
జూన్ 3న అద్భుత గ్రహ గతులు.. ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం, విజయం ఖాయం! -
గ్యాస్, ఎసిడిటీకి గుడ్ బై.. మీ జీర్ణక్రియను పెంచే సంజీవని పుదీనా కంజి వడ..ఎలా చేసుకోవాలంటే.. -
శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఈ ఒక్క గీతా శ్లోకం.. మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు
జుట్టు పల్చబడిపోతోందా?ఇదిగో గొప్ప పరిష్కారం
ప్రస్తుత రోజుల్లో స్త్రీ, పురుషులిద్దరూ అనేక జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. జుట్టు రాలడం, చుండ్రు, దురద, వంటి అనేక సమస్యలు. ఇటువంటి సమస్యలన్నింటికి ప్రధాన కారణం జీవనశైలిలో మార్పులు, పోషకాహార లోపం, అలెర్జీలు, హార్మోనులు అసమతుల్యలతలు, జుట్టు సంరక్షణలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, కొంత మంది జీన్స్ సమస్యలు. ఈ సమస్యలన్నింటి నివారించుకోవడంలో అనేక థెరఫీలు మరియు ట్రీట్మెంట్లు ఉన్నాకూడా తగినంత ఫలితాలను ఇవ్వవు.
కెమికల్స్ ట్రీట్మెంట్స్ మరియు థెరపీలకు బదులుగా హోం ట్రీట్మెంట్స్ చక్కగా పనిచేస్తాయి. మీరు మంచి హెయిర్ గ్రోత్ మరియు మందపాటి, నల్లని కురులను పొదడానికి ప్రయత్నిస్తుంటే కనుక నేచురల్ హెం రెమెడీస్ ను ఉపయోగించండి. పల్చబడుతున్న మీ జుట్టును తిరిగి మందంగా జుట్టును పొందడానికి కొన్ని వంటింటి చిట్కాలు అద్భుతంగా సహాయపడుతాయి. ఈ నేచురల్ హోం రెమడీస్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పల్చబడిన జుట్టును తిరిగి పొందడంలో అద్భుతంగా సహాయపడుతుంది.
పల్చని జుట్టుకు బెస్ట్ హోం రెమడీస్:

1.అలోవెర(కలబంద)
జుట్టు పల్చబడుతుంటే, కలబంద అద్భుతంగా సహాయపడుతుంది . అలొవెరా జెల్ ను తలకు పట్టించి బాగా మసాజ్ చేసి 30నిముషాలు అలాగే చింతి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం తలస్నానం చేసుకోవాలి. అలాగే కలబంద రసాన్ని ప్రతి రోజు ఉదయం పరగడపున తీసుకోవడం వల్ల అనేక వ్యాధులను నివారించడంతో పాటు, పల్చబడిన జుట్టు తిరిగి పెరిగేలా సహాయపడుతుంది.

2.గుడ్డు
గుడ్డులో అత్యధికంగా ప్రోటీలు మరియు సల్ఫర్ పుష్కలంగా ఉంది. జుట్టు మందగా పెరగడానికి గుడ్డు అద్భుతంగా సహాయపడుతుంది. ఒక ఎగ్ వైట్ కు ఒక చెంచా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి తర్వాత తలకూ పూర్తిగా పట్టించి, 20నిముషాల తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేసుకోవాలి. ఇలా వారానికొక సారి చేసినా మంచి ఫలితం ఉంటుంది.

3.అవొకాడో
అవొకాడోలో అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలున్న విషయం మనందరికి తెలిసిన విషయమే. అవొకాడో మెత్తగా గుజ్జులా చేసి అందులో అరటిపండు గుజ్జు మిక్స్ చేసి తలకు బాగా పట్టించాలి. అరగంట తర్వాత నాణ్యమైన షాంపుతో తలస్నానం చేసి తర్వాత కండీషనర్ ను అప్లై చేయాలి.

4.ఆమ్లా
జుట్టు రాలిపోవడం మరియు జుట్టు పల్చబడటం వంటి సమస్యలకు ఇది ఒక గొప్ప హోం రెమడీ. ఆమ్లా ఇందులో గొప్పగా యాంటీఆక్సిడెంట్స్ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఇది జుట్టు సంరక్షణకు చాలా గొప్పగా పనిచేస్తుంది. ఉసిరికాయలను ఏదో ఒకరకంగా తీసుకోవడం కూడా శరీర ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఉసిరికాయను పేస్ట్ చేసి, తర్వాత అందులో నిమ్మరసం మిక్స్ చేసి దీన్ని తలకు పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి.

5.మెంతులు
మెంతులు ఒక సాధారణ వంటింటి చిట్కా. ఇది జుట్టు రాలడం తగ్గిస్తుంది. జుట్టు పల్చబడటం కూడా తగ్గిస్తుంది. మీ జుట్టు పొడవును బట్టి రెండు చెంచాలా మెంతులను నీటిలో నానబెట్టి, ఆ నీటితో తలమీద పోసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గిస్తుంది మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అలాగే మెంతులను రుబ్బి తలకు పట్టించవచ్చు.

6.హెన్నా లీవ్స్
గోరింటాకు కొన్ని దశాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. ఇది జుట్టు వాల్యూమ్ ను పెంచుతుంది., అలాగే గోరింటాకు హెయిర్ క్యూటికల్స్ ను బ్లాక్ చేస్తుంది, కేశకణాలను బలోపేతం చేస్తుంది. అలాగే ఇది మీ జుట్టుకు నేచురల్ కలర్ ను అంధిస్తుంది. తాజాగా ఉండే గోరింటాకు ఆకులను మెత్తగా రుబ్బి, తలకు పట్టించి గంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి.

7.కొబ్బరి నూనె
కొబ్బరి నూనె, జుట్టుకు ఒక నేచురల్ కండీషనర్ గా పనిచేస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కొబ్బరి నూనెలో అవసరం అయ్యే మినిరల్స్, ఫ్యాట్, ఐరన్ మరియు పొటాషియం పుష్కలంగా ఉండి, హెయిర్ బ్రేకేజ్ ను తగ్గిస్తుంది. గోరువెచ్చని కొబ్బరినూనెను తలకు పట్టిస్తే జుట్టు రాలడం ను త్వరగా అరికడుతుంది.

8.గ్రీన్ టీ
గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి, జుట్టు రాలడం అరికట్టడంలో మరియు జుట్టు పెరుగుదలకు ప్రోత్సహించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ఒక కప్పు నీటిలో గ్రీన్ టీ ఆకులను వేసి బాగా మరిగించి, గోరువెచ్చగా మారిని తర్వాత వాటిని తలకు పట్టించి ఒక గంట తర్వాత నీటితో తలస్నానం చేయడం వల్ల జుట్టు సిల్కీగా మరియు హెల్తీగా ఉంటుంది.



Click it and Unblock the Notifications