Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
రోజూ తలస్నానం చేయడం వల్ల కలిగే నష్టం ఎంత?
మీరు తలస్నానం ఎన్ని రోజులకు చేస్తుంటారు? ప్రతి ఒక్క మహిళ ఇతరులతో అడిగే ప్రశ్న. ఎందుకంటే కొంత మంది జుట్టు రోజురోజుకు ఫ్రెష్ గా, నునుపుగా మంచి షైనింగ్ తో మెరుస్తుంటుంది. ఆ సందేహంతోనే ఇతరులను ఇటువంటి ప్రశ్నల అడగడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే రెగ్యులర్ ప్రతి రోజూ తలస్నానం చేయడం జుట్టు ఆరోగ్యానికి మంచిదేనా? రోజు తలస్నానం చేయడం వల్ల తల మరియు స్లాప్(తల)లో ఉత్పత్తి అయ్యే నేచురల్ ఆయిల్స్ కు ఏదైనా ఇబ్బంది కలుగుతుందా?
ప్రతి రోజూ తలస్నానానికి మీరు ఉపయోగించే షాంపు మంచిది మన్నికైనది కాకపోతే, ఆ షాంపులో ఉండే కెమికల్స్ జుట్టు రాలడానికి దారితీస్తుంది మరియు తలలో చుండ్రు పెరిగేలా చేస్తుంది. కొన్ని పరిశోధనల ప్రకారం, రెగ్యులర్ గా ప్లెయిన్ వాటర్ తో తలస్నానం చేయడం వల్ల హెయిర్ రూట్స్ డ్యామేజ్ అవుతాయని నిర్ధారించారు. అంటే ప్రతి రోజూ తలస్నానం చేయడం ద్వారా జుట్టు రఫ్ గా మారుతుంది . తలస్నానానికి ఉపయోగించే నీళ్ళు మరింత హార్డ్ గా ఉండటం వల్ల మీ జుట్టుకు హాని కలిగిస్తుంది. సాఫ్ట్ వాటర్ తో పోల్చితే హార్డ్ వాటర్ లో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే జుట్టుకు హాని ఎక్కువగా కలిగిస్తాయి.
అందువల్ల మీరు ప్రతి రోజూ తలస్నానం చేయకపోవడమే మంచిది. వేడి నీళ్ళు జుట్టులోని బలాన్ని తగ్గించి నీర్జీవంగా మరియు బలహీనంగా మార్చుతుంది. ప్రతి రోజూ తలస్నానం చేయకపోవడానికి మరో కారణం కూడా ఉంది. రోజూ తలస్నానం చేస్తే తలలో ఉత్పత్తి అయ్యే నేచురల్ ఆయిల్స్ కోల్పోవడం వల్ల ప్రీమెచ్యుర్ గ్రే హెయిర్ కు కారణం అవుతుంది. కాబట్టి, రెగ్యులర్ హెయిర్ వాష్ నివారించడం ఉత్తమం. అంతే కాదు, ప్రతి రోజూ తలస్నానం చేయకుడదు అనడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి...

1. నేచురల్ ఆయిల్స్:
రెగ్యులర్ గా తలస్నానం చేస్తే తలలో ఉత్పత్తి అయ్యే నేచురల్ ఆయిల్ కోల్పోతే, తిరిగి పొందడం కష్టం అవుతుంది. అంతలోపు జుట్టుకు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఈ నేచురల్ ఆయిల్స్ జుట్టకు తగినంత బలాన్ని మరియు చూడటానికి మంచి షైనింగ్ ను అందివ్వడంతో పాటు, ఆరోగ్యంగా ఉంచుతాయి. అందువల్ల మీరు ప్రతి రోజూ తలస్నానం చేయకపోవడం మంచిది.
2. స్టైలింగ్ విషయంలో:
ప్రతి రోజూ తలస్నానం చేయడం వల్ల జుట్టు ఎక్కువగా రాలడం ప్రారంభం అవుతుంది? కాబట్టి, రెగ్యులర్ తలస్నానం చేయకపోవడం వల్ల ఇదొక ప్రయోజనం మనకు. ఈ ప్రయోజనాన్ని మనం కోల్పోకూడదనుకుంటే, ప్రతి రోజూ తలస్నానం చేయడం బ్యాడ్ ఐడియా...
3. కలర్ లాక్స్:
మీ జుట్టు యొక్క రంగు దీర్ఘకాలం అలాగే కొనసాగాలంటే, తలస్నానం చేయకపోవడం మంచిది. రెగ్యులర్ తలస్నానం చేయపోతే జుట్టు యొక్క నేచురల్ కలర్ అలాగే ఉంటుంది. లేదంటే హెయిర్ ఫేడ్ అయినట్లు ఉంటుంది. ఈ కారణం చేత మీరు రెగ్యులర్ తలస్నానం నివారించడం మంచిది.
4. మిమ్మల్ని మరింత బెటర్ గా కనిపించేలా చేస్తుంది:
అవును ఇది నిజం!ఏరోజైతే మీరు తలస్నానం చేయరో, మీరు ఒక ఫర్ ఫెక్ట్ హెయిర్ డేను కలిగి ఉంటారు. షాంపును వాడకపోవడం వల్ల మీ జుట్టు చిక్కుపడకుండా, పొడిబారకుండా అందంగా కనబడుతారు.
5. జుట్టుకు హీట్ తగలకుండా దూరంగా ఉంచవచ్చు:
ప్రతి రోజూ రెగ్యులర్ గా తలస్నానం చేయడం వల్ల మీ జుట్టుకున్న తడి ఆర్పడానికి హెయిర్ డ్రయ్యర్స్ ఎక్కువగా ఉపయోగిస్తుంటరు. దీని వల్ల జుట్టు ఎక్కువగా రాలడానికి కారణం అవుతుంది.



Click it and Unblock the Notifications
