Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మహిళల్లో బట్టతల కారణాలు? చికిత్స చేయడం ఎలా?
మహిళల్లో సాధారణంగా కనపడే వివిధ రకాల కేశ నష్టాలలో ఒక దాన్ని మహిళల్లో బట్టతల తీరు అని అంటారు. ప్రతి వెంట్రుకా ఒక సన్నని రంద్రంగా కనపడే కుహరంలాంటి దాంట్లో, కూర్చొని ఉంటుందని అధ్యయనాలు చెప్తున్నాయి – దాన్నే ఫాలికిల్ లేదా కేశ పుటం అంటారు. సమయం గడిచేకొద్దీ కేశ పుటాలు సంకోచించి తత్ఫలితంగా బట్టతల వస్తుంది. అలా పొడవుగా, దట్టంగా వుండే కేశాలు పొట్టిగా పల్చగా తయారు అవుతాయి. మెల్లిగా ఈ పల్చ బడడం బట్టతలకు దారి తీస్తుంది. కేశ పుటం ఇక కొత్త వెంట్రుకలకు అవకాశం లేనంతగా బలహీన పడుతుంది.
మహిళల్లో, నమూనా బట్టతల పాపిడి దగ్గర మొదలై మెల్లిగా పల్చబడడం వల్ల వస్తుంది. దీంతో బాటు జుట్టు రాలిపోవడం కూడా కేశ నష్టానికి కారణమౌతుంది.

ఆడవారిలో నమూనా బట్టతలకు గల కారణాలు :
1. వారసత్వం లేదా ఆడవారికి కేశ నష్టం కుటుంబ చరిత్రలో వుండడం.
2. వయసు పైబడడం వల్ల
3. శస్త్ర చికిత్సలు, మందుల దుష్ప్రభావాలు లాంటివి
4. మెనోపాజ్ వల్ల
మీ బట్టతలకు సరైన కారణం కనుగొని తగిన చికిత్స పొందడం కోసం మీ చర్మవ్యాధుల నిపుణుడిని సంప్రదించండి. లేదా ఈ రంగంలో నిపుణులు అయిన, అనుభవం ఉన్న తెరపిస్ట్ లేదా వైద్యుడిని కూడా మీరు కలవవచ్చు. నమూనా బట్టతల స్త్రీ పురుషులిద్దరిలో కలుగుతుంది కానీ – జుట్టు పల్చబడే ప్రదేశాలు వేర్వేరుగా వుంటాయి. మగవారికి కణతల దగ్గర బట్టతల మొదలౌతుంది, అదే స్త్రీలకైతే పాపిడి దగ్గర మొదలౌతుంది. ఇదే అధిక కేశ నష్టానికి కూడా దారి తీస్తుంది. కేశ నష్టం వల్ల మీరు మానసికంగా కూడా బాధ, నిస్పృహకు గురౌతారు.
స్త్రీలలో బట్ట తల సమస్యకు చికిత్సా విధానాలు :
1. మీరు పెర్మ్ వాడవచ్చు, లేదా మీ కేశాలను ఒత్తుగా చూపించే లోషన్లు ఇతర కాస్మెటిక్ విధానాలు కూడా వాడవచ్చు.
2. స్త్రీలలో బట్ట తల చికిత్సకు అందుబాటులో వున్న విధానాలు తెలుసుకునెందుకు ప్రొఫెషనల్ కౌన్సెలింగ్ కు వెళ్ళవచ్చు.
3. కేశాలు జోడి౦చుకోవడం వల్ల కూడా మీకు ఉపశమనం కలుగవచ్చు. ఇది మీ తల కట్టులో సహజత్వాన్ని కనపడేలా చేస్తుంది. అయితే ఈ పరిష్కారం కోసం మీరు నిపుణులను సంప్రదించాలి.
4. స్త్రీలలో నమూనా బట్ట తలను తగ్గించడానికి మరో విధానం హెయిర్ రీప్లేస్మెంట్ శస్త్ర చికిత్స. నిపుణుల చేత నిర్ధారించబడినట్టుగా హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చాలా సమర్ధంగా పని చేస్తుంది.



Click it and Unblock the Notifications