Latest Updates
-
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా..
తలలో మొటిమలను నివారించుకోవడానికి సులభ చిట్కాలు
తలలో మొటిమలు ఉండటం వల్ల చాలా అసౌకర్యంగా ఉంటుంది. తలలో మొటిమల వల్ల తల దువ్వడం మరియు తలను శుభ్రం చేసుకోవడం చాలా కష్టంగా మారుతుంది. తలలో మొటిమలున్నప్పుడు తలస్నానం చేయడం కూడా చలా బాధకరమైన పరిస్థితిని ఎదుర్కోవల్సి వస్తుంది.
కాబట్టి, మీ తలలో మొటిమలను ఎలా ఎదుర్కోవాలి? తలను శుభ్రం చేసుకోవడం చాలా అవసరం. కొన్ని సందర్భాల్లో తలలో మొటిమలు అదనంగా దురదకు, చిరాకు, వాపుకు మరియు నొప్పికి కారణం అవుతుంది.
READ MORE: పురుషుల జుట్టు సమస్యలకు 20 బెస్ట్ హోం రెమడీస్...!
మరి మొటిమలకు కారణం ఏంటి? మీ చర్మంలో రంద్రాలు ఉంటాయి. వీటిని ఆయిల్ గ్లాండ్స్ (నూనెగ్రంతులు) అనిపిలుస్తాము. వీటి ద్వారా విడులయ్యే సెబమ్ వల్ల చర్మానికి రక్షణ కల్పిస్తుంది . నేచురల్ ఆయిల్స్ లేకుండా మీ చర్మం చాలా డ్రై అవుతుంది . చర్మం మురికి మరియు డెడ్ స్కిన్ సెల్స్ తో బ్లాక్ అయినప్పుడు బ్యాక్టీరియా చేరి చర్మంను ఇన్ఫెక్షన్ కు గురిచేస్తుంది. ఇది ఇన్ఫ్లమేషన్ కు కూడా గురిచేస్తుంది.
READ MORE: గ్రే హెయిర్ నివారించడానికి అవసరం అయ్యే ఉత్తమ హో రెమెడీస్
మరో కారణం, తలలో దురద, ఎర్రగా మారడం, వాపు మరియు పస్స్ విడుదలవ్వడం వల్ల తలను క్లీన్ గా మరియు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

మీ తలను శుభ్రం చేసుకోవాలి:
తలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి . అందుకోసం తరచూ తలస్నానం చేస్తుండాలి. అందుకోసం మీ తలను మరీ డ్రైగా మార్చుకోనవసరం లేదు.

వెనిగర్ ఉపయోగించాలి:
ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ ను ఒక మగ్గు నీటిలో మిక్స్ చేసి తలస్నానం చేసిన తర్వాత తలారాపోసుకోవాలి. ఇది బ్యాక్టీరియాను తగ్గిస్తుంది . మరియు ఇది తలలో మొటిమలను నివారించడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

ప్రొడక్ట్స్ ను మార్పుచేయాలి:
ప్రస్తుతం మీరు ఉపయోగిస్తున్న హెయిర్ కేర్ ప్రొడక్ట్ ను మార్పు చేసుకోవాలి. మీ జుట్టుకు సరిపడే ప్రొడక్ట్ ను డెర్మటాలజిస్ట్ ను అడిగి తెలుసుకోవాలి .

ఫెర్క్యూమ్ ప్రొడక్ట్స్ ఉపయోగించకూడదు:
సువాసనలు మరియు కఠినమైన కెమికల్స్ ఉన్న ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.

చుండ్రును వదిలించుకోవాలి:
కొన్ని సందర్భాల్లో, చుండ్రు కూడా మొటిమలకు దారితీస్తుంది. అలాంటి పరిస్థితుల్లో చుండ్రు నివారించే షాంపును ఉపయోగిస్తే మొటిమలను నివారించుకోవచ్చు.

ఆరోగ్యకరమైన ఫుడ్స్ తీసుకోవాలి:
మీరు హెల్తీ మరియు నేచురల్ ఫుడ్స్ ను తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం కూడా ఆరోగ్యకరమైన జుట్టును పొందడానికి సహాయపడుతుంది. ఇది తలలో మొటిమలను నివారించడానికి సహాయపడుతుంది.

హ్యాట్స్ మరియు క్యాప్స్:
తలకు హ్యాట్స్ మరియు క్యాప్స్ ను వాడటం నివారించాలి . తలకు బాగా గాలి సోకే విధంగా ఉంచుకోవాలి.

దురద పెడితే గోకకూడదు:
ఇన్ఫెక్షన్ వల్ల తలలో దురద కలిగినప్పుడు గోకకుండా ఉండాలి . దాంతో బ్రేక్ అవుట్స్ కలగకుండా ఉంటాయి.



Click it and Unblock the Notifications
