Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
ఒత్తైన ఆరోగ్యకరమైన జుట్టుకు నేచురల్ హెయిర్ ప్యాక్స్
ప్రస్తుత రోజుల్లో ఒత్తైన జుట్టు కనబడటమే అరుదైపోయింది. ఎవ్వరికి చూడూ...జుట్టు రాలిపోవడం, జుట్టు పల్చబడటం, పచ్చని జుట్టును చూస్తున్నాము. అందుకు తరచూ మనం ఉపయోగించే రసాయనిక షాంపులు, హెయిర్ డ్రైయ్యర్స్, హెయిర్ స్ట్రెటనింగ్ ప్రొడక్ట్స్ , హెయిర్ జెల్స్ ముఖ్య కారణం. జుట్టు పల్చబడినప్పుడు అందం మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి ఒత్తైన జుట్టును కలవారిని చూడటం చాలా అరుదుగా జరుగుతున్నది. అలా ఒత్తైన జుట్టును పొందడం ఒక డ్రీమే..
జుట్టు రాలిపోయిన తర్వాత తిరిగి ఒత్తైన జుట్టును పొందడానికి మనం ఇప్పటి వరకూ ఉపయోగించిన కెమికల్ ప్రొడక్ట్స్ వల్ల దీర్ఘకాలంలో జుట్టు రాలడం దారితీస్తుంది. దాంతో అందం కాస్తా పాడవుతుంది. కొన్ని నేచురల్ ప్రొడక్ట్స్ మీ జుట్టును తిరిగి ఒత్తుగా పెరుగేలా చేస్తాయి . అంతే కాదు అవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. జుట్టు రాలడం అరికడుతాయి. READ MORE: పురుషు కొరకు 10 ఉత్తమ హోం మేడ్ హెయిర్ ప్యాక్స్
బౌన్సీ అండ్ వాల్యూమినస్ హెయిర్ కలిగి ఉండటం వల్ల మీరు చూడటానికి అందంగా కనబడుతారు. కాబట్టి, అందుకు ఇప్పుడు మీరు చింతించాల్సిన పనిలేదు. ఇంటి వద్దే బౌన్సీ హెయిర్ పొందడానికి కొన్ని చిట్కాలున్నాయి. అలాంటి ఎఫెక్టివ్ మరియు ఈజీ టిప్స్ ను మీకోసం ఈ క్రింది విధంగా...

మొయోనైజ్ మరియు అవొకాడో ఆయిల్ ప్యాక్:
ఒక కప్పు మోయోనైజ్ లో రెండు చెంచాల అవొకాడో ఆయిల్ మిక్స్ చేసి దీన్ని మీ జుట్టుకు అప్లై చేసి నాలుగు గంటల పాటు అలాగే ఉంచాలి. మరింత డీప్ కండీషన్ జరగాలంటే తలకు వేడినీటిలో ముంచిన టవల్ ను చుట్టాలి. వారానికొకసారి ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

అరటి, తేనె మరియు బాదం ప్యాక్:
రెండు చెంచాలా తేనెలో కొన్ని చుక్కల బాదం నూనె మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అరటిపండు గుజ్జులో వేసి మిక్స్ చేసి తలకు పట్టించాలి. 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా నెలకొకసారి చేస్తే ఒత్తైన జుట్టును మీరు పొందవచ్చు.

ఆలివ్ ఆయిల్ మరియు ఎగ్ ప్యాక్:
3 చెంచాల ఆలివ్ ఆయిల్ తీసుకొని రెండు గుడ్లు మిశ్రమంలో వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు మరియు కేశాలకు పట్టించి 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఒత్తైన జుట్టు మీరు పొందడానికి ఒది ఒక ఎఫెక్టివ్ హోం రెమెడీ.

అవొకాడో మరియు ఎగ్ హెయిర్ ప్యాక్:
అవొకాడో గుజ్జులో ఎగ్ వేసి మిక్స్ చేసి ఈ పేస్ట్ ను తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే జుట్టు రాలడం తగ్గుతుంది మరియు ఒత్తైన జుట్టును మీరు పొందవచ్చు.

పెరుగు హెయిర్ ప్యాక్:
పెరుగు బాగా స్మూత్ గా స్పూన్ తో మిక్స్ చేసి తలకు పట్టించాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. పెరుగు జుట్టుకు పోషణ అందిస్తుంది మరియు నేచురల్ కండీషనర్ గా పనిచేస్తుంది. ఇది ఒక బెస్ట్ నేచురల్ హెయిర్ ప్యాక్.

కాఫీ హెయిర్ ప్యాక్:
కాఫీపౌడర్ ను నీటిలో వేసి బాగా మరిగించి చల్లార్చి తలమీద పోసుకొని మసాజ్ చేసి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఒత్తైన జుట్టుతో పాటు హెయిర్ వాల్యూమ్ పెరుగుతుంది.



Click it and Unblock the Notifications
