Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
జుట్టు నుండి ఎగ్ స్మెల్ ను నివారించే నేచురల్ పద్దతులు
జుట్టు ఆరోగ్యం కోసం తరచూ మనం హెయిర్ కండీషనర్ ను అప్లై చేస్తుంటాం. అంతే కాదు జుట్టు అందంగా, సాఫ్ట్ గా మార్చడం కోసం, అనేక జుట్టు సమస్యలను నివారించడం కోసం వివిధ రకాల పదార్థాలను జుట్టుకు వాడుతుంటారు. ముఖ్యంగా జుట్టు మన్నికను పెంచడానికి మరియు ఒత్తైన జుట్టును పొందడానికి అనేక హెయిర్ ప్యాక్స్ లో గుడ్డును విరివిగా ఉపయోగిస్తుంటాము . ఎగ్ మిశ్రమంతో హెయిర్ ప్యాక్ వేసుకొన్నప్పుడు జుట్టును నుండి ఎగ్ వాసన తొలగించడం మంచిది. అది హెయిర్ ప్యాక్ లో ఎగ్ మిక్స్ చేసేప్పుడు, పచ్చసొనను తొలగించాలి . ఎగ్ హెయిర్ ప్యాక్ ఎక్కువ ప్రోటీనులు కలిగి ఉంటుంది. ఈ ప్రోటీన్స్ మీ జుట్టుకు యొక్క నాణ్యత పెంచుతుంది మరియు నేచురల్ లుక్ ను అందిస్తుంది.
ఎగ్ హెయిర్ ప్యాక్ ను ఇంట్లో తయారుచేయడం ాచలా సులభం మరియు ప్రోటీన్ హెయిర్ ట్రీట్మెంట్ కోసం ఎగ్ ను తరచూ వినియోగిస్తుంటారు . అయితే కొన్ని సందర్భాల్లో జుట్టుకు ఎగ్ హెయిర్ ప్యాక్ ను అప్లై చేయడం వల్ల, జుట్టు మొదళ్ళ నుండి చాలా భయంకరమైన వాసన వస్తుంటుంది. ఇది మిమ్మల్ని నలుగురిలో ఇబ్బందికి గురిచేస్తుంది . అలా ఇబ్బందికి గురికాకుండా, జుట్టు నుండి ఎగ్ స్మెల్ నివారించడానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఎగ్ స్మెల్ బలంగా కేశాలకు అంటుకోవడం వల్ల బయట వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికి గురి అవుతుంటారు . వాసన వచ్చే హెయిర్ తో మీరు పనిచేసే ప్రదేశంలో కూడా ఇబ్బందికరంగా భావిస్తారు. మీ జుట్టు నుండి వచ్చే దుర్వాసనతో పక్కవారు ఇబ్బంది పడుతూ లోలోపల నవ్వుకోవడం మీకు అసౌకర్యంగా మరియు ఇబ్బంది కరంగా ఉంటుంది.
భరించలేని దుర్వాసన వల్ల వికారానికి గురికావల్సి వస్తుంది. ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కోకుండా కొన్ని వ్యక్తిగత పరిశుభ్రత చిట్కాలను పాటించడం ద్వారా జుట్టు నుండి ఎగ్ స్మెల్ నివారించుకోవచ్చు. జుట్టు నుండి ఎగ్ స్మెల్ ను నివారించడానికి కొన్ని నేచురల్ పద్దతులు...

1. దాల్చిన చెక్క మరియు తేనె: ఇబ్బంది కలిగించే ఎగ్ స్మెల్ నివారించడానికి దాల్చిన చెక్క మరియు తేనె గ్రేట్ గా సహాయపడుతాయి. వీటిలో యాంటీఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్ానయి . ఒక కప్పు వేడి నీళ్ళలో అర చెంచా దాల్చిన చెక్కవేసి 30నిముషాలు నాననివ్వాలి . తర్వాత ఆ నీటిలో ఒక చెంచా తేనె వేసి బాగా మిక్స్ చేయాలి . ఈ మిశ్రమాన్ని మీ తలకు మరియు జుట్టు పట్టించాలి. ఒక గంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.

2. ఆరెంజ్ జ్యూస్: జుట్టు నుండి ఎగ్ స్మెల్ నివారించడానికి ఆరెంజ్ జ్యూస్ ఇది చాలా విలువైన చిట్కా. ఆరెంజ్ జ్యూస్ జుట్టుకు మంచి సువాసన అందిస్తుంది మరియు తల మరియు కేశాల నుండి అదనపు నూనెను తొలగిస్తుంది. తాజా ఆరెంజ్ జ్యూస్ ను మీ జుట్టుకు పట్టించి 5 నిముషాల తర్వాత తలస్నానం చేసుకోవాలి.

3. లెమన్ జ్యూస్: లెమన్ జ్యూస్ జుట్టు మరియు చర్మ సంరక్షణకు చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. ఫ్రెష్ గా ఉండే నిమ్మరసం తల మరియు జుట్టు శుభ్రం చేయడంతో పాటు మంచి సువాసన కలిగి ఉంటుంది. షాంపుతో తలస్నానం చేసిన తర్వాత నిమ్మరసం వాటర్ ను జుట్టుకు స్ప్రే చేయాలి . ఈ వాటర్ ను కొద్ది సేపు కేశాల మీద అలాగే ఉంచి తర్వాత మంచి నీటితో తలస్నానం చేసుకోవాలి.

4. బేకింగ్ సోడ: బేకింగ్ సోడా ఒక ఎఫెక్టివ్ చిట్కా. ఇది జుట్టు నుండి ఎగ్ స్మెల్ ను నివారిస్తుంది . ఇది మీ జుట్టు నుండి జిడ్డును నివారిస్తుంది . కొద్దిగా నీరు తీసుకొని అందులో బేకింగ్ సోడా వేసిమిక్స్ చేసి పెట్టుకోవాలి. తలను నీటితో తడిపి తర్వాత బేకింగ్ సోడా వాటర్ ను అప్లై చేయాలి . 5 నిముషాలు అలాగే ఉంచి తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి.

5. వెనిగర్: జుట్టు నుండి ఎగ్ స్మెల్ నివారించడంలో వెనిగర్ చాలా ఎఫెక్టివ్ చిట్కా. దాని కంటే మందుగా వెనిగర్ వల్ల జుట్టు కలిగే ప్రయోజనాలను తెలుసుకోవాలి. ఇది జుట్టు చిక్కుబడకుండా నివారిస్తుంది. జుట్టుకు మంచి షైనింగ్ ఇస్తుంది. కేశాలను శుభ్రపరుస్తుంది. జుట్టు సంబంధిత అన్ని సమస్యలను చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.



Click it and Unblock the Notifications