Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
కేశాల యొక్క చిక్కుముడులను నివారించే ఎఫెక్టివ్ టిప్స్
సహజంగా జుట్టు సాఫ్ట్ అండ్ షైనీగా ఉంటే ఎంత అందంగా ఉంటుంది. చూడటానికి అందంగా కనబడుతుంటారు. సాఫ్ట్ అండ్ షైనీ జుట్టును ఎన్ని రకాల హెయిర్ స్టైల్స్ అయినా చేయించుకోవచ్చు. అందుకే చాలా మంది మహిళలు పొడవాటి మరియు హెల్తీ హెయిర్ ఉండాలని కోరుకుంటుంటారు. అయితే జుట్టు ముడి పడటం లేదా చిక్కులు ఉంటే ఏం చేస్తారు? ఆ విషయం వర్ణించడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.
అంతే కాదు, అందంగా కనబడకు చిరాకు పెడుతుంటుంది. అంతే కాదు జుట్టు పెరుగుదల లోపిస్తుంది. ఇంకా జుట్టును మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది. అటువంటి సమయంలో హెయిర్ కట్ చేయించుకొందమన్న ఆలోచన మనస్సులో పడుతుంది. అలా ఎన్ని సార్లని చేయించుకుంటారు? దానికంటే ముందుగా ఇలా జుట్టు తరచూ నాట్స్ (ముడులుగా)లేదా చిక్కుగా ఎందుకు ఏర్పడుతున్నదన్న విషయాన్ని తెలుసుకొని వాటికి పరిష్కార మార్గాలను కనుక్కొంటే సరిపోతుంది. కాబట్టి, ఎలాంటి హెయిర్ కట్స్ అవసరం లేకుండా ఆరోగ్యకరమైన మరియు అందమైన జుట్టును మీరు పొందడానికి కొన్ని ఎఫెక్టివ్ మార్గాలను తెలుగు బోల్డ్ స్కై మీకోసం అందిస్తున్నది.
READ MORE: చలికాలంలో చిట్లిన జుట్టును నివారించడానికి 15 సింపుల్ మార్గాలు
మీకు జుట్టు పొడవుగా ఉన్నా లేదా పొట్టిగా ఉన్నా, ఇలాంటి సమస్యను ఎదుర్కొనే వారికోసం ఎఫెక్టివ్ గా నివాిరంచగలిగే కొన్ని చిట్కాలను ఈక్రింది విధంగా తెలపడం జరిగింది. మరి ఆ చిట్కాలేంటో చూద్దాం..

ఆయిల్ మసాజ్:
తల మరియు జుట్టులో ఎక్కువగా ముడులు ఉన్నప్పుడు తలకు నూనె పట్టించి ఆయిల్ మసాజ్ చేయాలి. తర్వాత దువ్వెనతో నిదానంగా దువ్వుతూ ముడులను తొలగించాలి.

టవల్ :
మీ తలలో కేశాలు చిక్కు బడుటకు లేదా ముడులుగా ఏర్పడానికి ముఖ్య కారణం మీరు ఉపయోగించే టవల్. తలస్నానం చేసిన తర్వాత కాటన్ టవల్ కు బదులుగా రఫ్ గా ఉన్న టవల్ ను వాడుతుంటారు.

తలస్నానం:
మీ తలలో మరియు కేశాల్లో ముడులు లేదా చిక్కు అసౌకర్యంగా ఉన్నప్పుడు, మీజుట్టును చాలా సింపుల్ గా తలస్నానం చేసుకోవాలి. స్నానం చేసేప్పుడు కేశాలు మద్యలో వేళ్ళ పెట్టి, కేశాలను ముడులను విడమర్చుతూ తలస్నానం చేయాలి.

నిద్రించే ముందు:
మీరు నిద్రించడానికి ముందు మీ కేశాలను దువ్వువాలి . ఇలా చేయడం వల్ల జుట్టు చిక్కుబడకుండా ఉంటుంది. మరియు జుట్టు పొడవుగ మరియు త్వరగా పెగడానికి సహాయపడుతుంది.

హెయిర్ బ్రష్ :
కేశాల్లో ముడులు లేదా చుక్కను తొలగించుకోవడానికి మరో పర్ఫెక్ట్ మార్గం హెయిర్ బ్రష్ . అయితే ఇది కొద్దిగా ఎక్కువ సమయం తీసుకుంటుంది. మరియు ఓపిగ్గా చేయాల్సి ఉంటుంది.

కేశాలను మొత్తం సమంగా దువ్వాలి:
టూత్ కూంబ్ తో కేశాలను పై నుండి క్రింది వరకూ ఒకే లెవల్లో దువ్వడం వల్ల, చిక్కు బడిన జుట్టు నేచురల్ వదులుతుంది . అప్పటికి చిక్కు విడవకుంటే కొద్దిగా లోషన్ అప్లై చేసి దువ్వుకోవాలి.

ఫింగర్స్ :
కొన్ని సందర్భాల్లో లేదా మీకు సమయం దొరికినప్పుడు జస్ట్ కేశాల్లో చేతి వేళ్ళ ద్వారా చిక్కువు విడిపించుకోవచ్చు. అయితే ఇలా చేసేటప్పుడు మీ చేతులు తడిగా లేకుండా జాగ్రత్త తీసుకోవాలి . లేదంటే తడిగా ఉన్న వేళ్ళతో తీయడం వల్ల కేశాలు తెగిపోవడం లేదా లాగివేయడటం జరుగుతుంది.

కేశాలను మొత్తం సమంగా దువ్వాలి:
టూత్ కూంబ్ తో కేశాలను పై నుండి క్రింది వరకూ ఒకే లెవల్లో దువ్వడం వల్ల, చిక్కు బడిన జుట్టు నేచురల్ వదులుతుంది . అప్పటికి చిక్కు విడవకుంటే కొద్దిగా లోషన్ అప్లై చేసి దువ్వుకోవాలి.

ట్రీట్మెంట్ :
తలస్నానం చేసిన తర్వాత, మీ జుట్టు ముడులుగా ఏర్పడుతుంది . మీ తలలో ముడులను లేదా చిక్కును నివారించడానికి బటర్ ను తలకు పట్టించాలి.

బనాన మాస్క్:
అరటిపండును మెత్తగా చేసి, అందులో కొద్దిగా పాలు పోసి బాగా మిక్స్ చేసి తలకు పట్టించాలి. తర్వాత దువ్వెనతో దువ్వడం వల్ల చిక్కు పోతుంది . అంతే కాదు తలస్నానం చేసిన తర్వాత జుట్టుకు మంచి షైనింగ్ ను అందిస్తుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్:
చాలా సింపుల్ గా మీ జుట్టుకు మసాజ్ చేయాలి. సహజ నూనెలు ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు కొబ్బరి నూనె వంటి నూనెలు జుట్టు ముడులను మరియు చిక్కును నివారించడానికి గ్రేట్ గా సహాయపడుతాయి.



Click it and Unblock the Notifications
