మగవాళ్ళలో హెయిర్ ఫాల్ మరియు బట్టతలను నివారించే మెంతి, ఉల్లి, కరివేపాకు

ప్రస్తుత రోజుల్లో స్త్రీ, పురుషులిద్దరిలోనూ జుట్టు రాలడం మరియు జుట్టు పల్చబడటం అనేది చాలా సాధారణ సమస్య. కోల్పోయిన జుట్టును తిరిగి పొందడానికి తరచూ డాక్టర్ ను కలుస్తుంటారు. మరియు ఇటువంటి హెయిర్ ట్రీట్మెంట్లు చిన్న యంగ్ ఏజ్ లోనే తీసుకోవడం బాధాకరం అనిపిస్తుంటుంది. మరి యంగ్ ఏజ్ లో ఇలాంటి జుట్టు సమస్యలకు ముఖ్య కారణం డైట్, స్ట్రెస్, అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం మరియు కొన్ని సందర్భాల్లో హార్మోనులు ప్రభావం కూడా స్త్రీ, పురుషులిద్దరిలోనూ చాలా తీవ్రంగా చూపుతున్నది.

పురుషులో జుట్టురాలడం అరికట్టేందుకు పరిష్కారం..!

అందంగా కనబడుటకు కేశాలకు చాలా ముఖ్య పాత్రను పోషిస్తాయి . స్త్రీలైనా, పురుషులైనా అందానికి అదనపు ఆకర్షణ జుట్టు. అలాంటి జుట్టును కోల్పోవడం వల్ల వ్యక్తులను మరింత ఒత్తిడికి గురి చేస్తుంది. అందుకు కారణం కోల్పోయిన జుట్టు తిరిగి పెరగకపోవడమే. ఈ విషయంలో ఎక్కువగా పురుషులను గమనించినట్లైతే తెలుస్తుంది. కోల్పోయిన జుట్టు తిరిగి పెరగకపోవడం వల్ల బట్టతలకు కారణం అవుతుంది . ఒక్క సారి జుట్టు రాలడం ప్రారంభమైతే అది తిరిగి పెరగడానికి కష్టం అవుతుంది. అందుకు అన్ని రకాల ట్రీట్మెంట్స్ ను వారు ప్రయత్నించి ఉంటారు. ఇలాంటి పరిస్థితిని అలోపిసియా అని అంటారు.

పురుషుల్లో జుట్టు రాలే సమస్యలకు ఉత్తమ చిట్కాలు

సాధారణం ప్రతి ఒక్కరూ రోజుకు 100 వరకూ వెంట్రుకలను కోల్పోవడం జరగుతుంది, అయితే, ఇలా రాలిపోయిన జుట్టు, తిరిగి పెరగడం జరుగుతుంది . అయితే వందకంటే ఎక్కువ జుట్టు రాలడానికి కారణం అయితే, అది తీవ్రస్థితిగా గుర్తించాలి. అందుకు మీరు చింతించాల్సి పనిలేదు, కొన్ని ఎఫెక్టివ్ మార్గాలున్నాయి.

జుట్టు ఊడిపోవడానికి గల 10 ప్రధాన కారణాలు..!

ఈ హోం రెమెడీస్ జుట్టు పెరుగదలతో పాటు, జుట్టు మందగా, హెల్తీగా మరియు పొడవుగా పెరగడానికి సహాయపడుతాయి మరి మహిళల్లో జుట్టు రాలడం అరికట్టి, పురుషుల్లో బట్టతలను నివారించే కొన్ని హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా.....

1. ఫిష్ ప్రోటీన్ పౌడర్ (మెరైనా ప్రోటీన్ సప్లిమెంట్)

1. ఫిష్ ప్రోటీన్ పౌడర్ (మెరైనా ప్రోటీన్ సప్లిమెంట్)

జుట్టు పెరుగుదలకు ఇది హైలీ రెకమెండెడ్ ప్రోటీన్ సప్లిమెంట్ . మెరైన్ ఫిష్ ను తయారుచేసిన నేచురల్ ప్రోటీన్ సప్లిమెంట్ . ప్రోటీన్ పౌడర్ ను మెర్యురీ మరియు ఇతర టాక్సిన్స్ ను నివారిస్తుంది. ప్రోటీన్ పౌడర్లో ఓమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ మెరైజ్ ప్రోటీన్ సప్లిమెంట్ హెయిర్ గ్రోత్ ను నివారిస్తుంది జుట్టు రాలడం అరికడుతుంది మరియు జుట్టుపల్చబడ్డం కూడా తగ్గుతుంది.

2. టోకోట్రియోనల్ క్యాప్స్యూల్స్ :

2. టోకోట్రియోనల్ క్యాప్స్యూల్స్ :

టోకోట్రియోనల్ క్యాప్స్యూల్స్ లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది . ఈ సప్లిమెంట్ తీసుకోవడం వల్ల జుట్టు మందంగా మరియు పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది. 100ml tocotrienol capsules ను ప్రతి రోజూ తీసుకోవడం ద్వారా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది మరియు జుట్టు రాలడం నివారిస్తుంది. పురుషుల్లో జుట్టు రాలడం నివారించే బెస్ట్ హోం రెమెడీ.

3. మెలటోనిన్ లిక్విడ్:

3. మెలటోనిన్ లిక్విడ్:

మేల్ బాల్డ్ నెస్ ను నివారించే మరో ట్రీట్మెంట్ మెలటోనిన్. ఈ మెలటోనిన్ లిక్విడ్ మెడికల్ షాపుల్లో అందుబాటులో ఉంది . ఈ సొల్యూషన్ ను తలకు అప్లై చేయడంవల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇది మన శరీరంలో నేచురల్ గా ఉత్పత్తి అయ్యే హార్మోన్ ఇది నిద్రను క్రమబద్దం చేస్తుంది . జుట్టు పెరుగుదలకు సంబంధం కలిగి ఉంటుంది.

4. గుమ్మడివిత్తనాలతో తయారుచేసిన ఆయిల్ క్యాప్స్యూల్స్ :

4. గుమ్మడివిత్తనాలతో తయారుచేసిన ఆయిల్ క్యాప్స్యూల్స్ :

పంప్కిన్ సీడ్ ఆయిల్ క్యాప్స్యూల్స్ లో ఓమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి . మరియు ఇతర ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా అధికంగా ఉంటాయి. ఈ ఫ్యాటీ యాసిడ్స్ మీ జుట్టు పొడవుగా మరియు హెల్తీగా పెరగడానికి సహాయపడుతుంది . అందుకోసం మీరు పంప్కిన్ సీడ్ ఆయిల్ క్యాప్స్యూల్స్ ను ఓరల్ గా ప్రతి రోజూ (400ml)తీసుకోవాలి. ఈ ఆయిల్ ట్రీట్ తో పురుషుల్లో బట్టతలను నివారించుకోవచ్చు.

5. పెప్పర్ మింట్ ఆయిల్:

5. పెప్పర్ మింట్ ఆయిల్:

ఈ పెప్పర్ మింట్ ఆయిల్ ఫ్రెష్ ఫ్లేవర్ కలిగి ఉంటుంది. హెయిర్ గ్రోత్ కూడా చాలా ఎపెక్టివ్ గా సహాయపడుతుంది . జుట్టు పెరుగుదలను వేగంగా పెంచుకోవాలి . ఈ పెప్పర్ మింట్ ఆయిల్ ను తలకు అప్లై చేసుకోవాలి. ఈ పెప్పర్ మింట్ ఆయిల్ ను వారంలో నాలుగు సార్లు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా 4వారాలు అప్లై చేసి ఫలితం చూడండి . ఈ పెప్పర్ మింట్ ఆయిల్ ను డైలీ షాంపులలో కూడా ఉపయోగించుకోవచ్చు.

6. మినోక్సిడిల్ సొల్యూషన్:

6. మినోక్సిడిల్ సొల్యూషన్:

ఇది మెడికేటెడ్ సొల్యూషన్. దీన్ని తలకు అప్లై చేసుకోవచ్చు . ఇది మెడికల్ స్టోర్స్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ నూనెను తలకు అప్లై చేసి మసాజ్ చేయకుండా అలాగే ప్రెస్ చేసి ఉంచాలి. ఈ ట్రీట్మెంట్ ను మూడు నెలలు కంటిన్యుగా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

7. ఆలివ్ ఆయిల్:

7. ఆలివ్ ఆయిల్:

గోరువెచ్చని ఆలివ్ ఆయిల్ ను తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. రాత్రుల్లో నిద్రించే ముందు అప్లై చేయడం మరింత ఎఫెక్టివ్ ఫలితాలను మీరు గమనించవచ్చు . ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది . తలలో బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది . ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఈ ఆలివ్ ఆయిల్ కేశాలకు పోషణను అందించి హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది.

ఆవనూనె మరియు హెన్నా లీవ్స్:

ఆవనూనె మరియు హెన్నా లీవ్స్:

ఒక కప్పు మస్టర్డ్ ఆయిల్లో గుప్పెడు హెన్నా లీవ్స్ వేసి రెండింటి బాగా మరిగింాచలి. ఈ రెండింటి మిశ్రమం బాగా మరిగించి చల్లార్చి నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను ప్రతి రోజూ రెగ్యులర్ గా బట్టతల ఉన్న ప్రదేశంలో అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

మినాక్సిడిల్:

మినాక్సిడిల్:

మినాక్సిడిల్ అనే ట్రోపిల్ ట్రీట్మెంట్ ఇది మేల్ బాల్డ్ నెస్ మెడిసిన్ . ఇది లోషన్ రూపంలో ఉంటుంది దీన్ని ప్రతి రోజూ ఎఫెక్టెడ్ ఏరియాలో అప్లై చేయాలి. బట్టతల ఉన్న ప్రదేశంలో అప్లై చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. కేవలం 5 చుక్కలు మాత్రం తీసుకొని అప్లై చేయాలి. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

బ్లాక్ పెప్పర్:

బ్లాక్ పెప్పర్:

బట్టతలను నివారించే మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ బ్లాక్ పెప్పర్. ఇది ఒక ముఖ్యమైన పదార్థం. దీని వల్ల మ్యాజిలక్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. బ్లాక్ పెప్పర్ ను మెత్తగా పొడి చేసి అందులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి బట్టతల ఉన్న ప్రదేశంలో అప్లై చేసి తలకు మొత్తానికి స్పెడ్ చేయడం వల్ల బట్టతల ప్రాంతంలో కొత్త వెంట్రుకలు మెలవడంతో పాటు, ఉన్న జుట్టు ఊడిపోకుండా సహాయపడుతుంది.

బీట్ రూట్ లీవ్స్:

బీట్ రూట్ లీవ్స్:

బీట్ రూట్ యొక్క ఆకులు వండర్ ఫుల్ హోం రెమెడీ. నీటిలో కొన్ని బీట్ రూట్ ఆకులు వేసి బాగా మరిగించాలి. ఆకులు మెత్తగాఉడికిన తర్వాత బీట్ ఆకులతో పాటు, హెన్నా లీవ్స్ కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని తలకు పట్టించి 20నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. అలాగే బీట్ రూట్ ఆకులను పసుపుతో కలిపి పేస్ట్ చేసి తలకు పట్టిస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది.

హెయిర్ ఆయిల్ మసాజ్

హెయిర్ ఆయిల్ మసాజ్

కొబ్బరి నూనె,బాదం నూనె,ఆలివ్ నూనె,ఆముదము,ఉసిరి నూనె వంటి సహజ జుట్టు నూనెలు బట్టతల చికిత్సలో ఉపయోగిస్తే ప్రభావవంతముగా పనిచేస్తాయి. మీ జుట్టు పెరుగుదలలో చైతన్యం నింపి మరియు సహాయం కొరకు రోజులో మీ జుట్టు మసాజ్ కొరకు బహుళ నూనెలను ఉపయోగించడానికి ఎంచుకోవచ్చు. మీ చర్మం ద్వారా నూనెలు ఎక్కువ శోషణ ఉంటుంది. కాబట్టి కొంత మేరకు వేడి నూనెలను ఎంచుకోండి.

ఉసిరి

ఉసిరి

సాధారణంగా భారతదేశంలో ఉసిరిని ఇండియన్ ఉన్నత జాతి పండు రకముగా చెప్పుతారు. సహజ మరియు వేగవంతముగా జుట్టు పెరగటానికి భారతదేశం అంతటా విస్తృతంగా ఉపయోగిస్తారు.ఉసిరిలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. శరీరంలో విటమిన్ సి లోపం కారణంగా జుట్టు కోల్పోవడం జరగవచ్చు. మీ జుట్టుకు ఉసిరి గుజ్జు మరియు నిమ్మరసం మిశ్రమంను సమానంగా రాయాలి. రాత్రిపూట వదిలివేసి ఉదయం స్నాన సమయంలో మీ జుట్టును షాంపూతో రుద్దుకోండి.

మెంతులు

మెంతులు

భారతదేశంలో దీనిని మెంతి అని కూడా పిలుస్తారు. మెంతులు జుట్టు ఫాల్ చికిత్సలో అత్యంత ప్రభావవంతమైన మూలకంగా ఉంది. మెంతులు జుట్టు అభివృద్ధి విస్తరించేందుకు మరియు జుట్టు గ్రీవము పునర్నిర్మాణంలో సహాయపడతాయి. అంతేకాకుండా జుట్టు పెరుగుదల ఉత్తేజితం చేసే ప్రోటీన్లు మరియు నికోటినిక్ ఆమ్లం ఉంటాయి. మెంతులను రాత్రిపూట నీటిలో నానబెట్టి పేస్ట్ చేయండి. ఈ పేస్ట్ ను మీ జుట్టుకు బాగా పట్టించి ఒక గంట తర్వాత షవర్ స్నానం చేయండి.

ఉల్లిపాయ

ఉల్లిపాయ

ఉల్లిపాయ చికిత్స ఉల్లిపాయలు చెదురుమదురుగా బట్టతల చికిత్సకు ప్రభావవంతంగా పనిచేస్తుంది. పెద్ద ఉల్లిపాయను నూరి రసం తీయాలి. ఈ ఉల్లిపాయ రసంలో కలబంద రసం కలిపి మీ జుట్టుకు బాగా పట్టించి 10-15 నిమిషాల తర్వాత షవర్ స్నానం చేయండి.

అమర్ నాత్ లీవ్స్ :

అమర్ నాత్ లీవ్స్ :

బట్టతల నివారించడంలో అమర్ నాత్ లీవ్స్ జ్యూస్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఆకులను పేస్ట్ చేసి దాని నుండి వచ్చిన రసాన్ని హెయిర్ రూట్స్ కు పట్టించడం వల్ల బట్టతల నివారించబడుతుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

మందారం ఆకులు:

మందారం ఆకులు:

మందారం ఆకులు కేశాలకు పోషణ అందివ్వడంతో పాటు జుట్టు రాలడం తగ్గిస్తుంది . ఒక గ్లాసుల నీటిలో ఆకులు వేసి ఉడికించి, చల్లార్ని ఆనీటిలో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి షాంపులా ఉపయోగించుకోవచ్చు. అలా ఫ్రెష్ లీవ్స్ ను పేస్ట్ లా చేసి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

కరివేపాకు:

కరివేపాకు:

బట్టతల నివారకు కరివేపాకు కూడా గ్రేట్ రెమెడీ. కొబ్బరినూనెలో కరివేపాకు వేసి బాగా నల్లగా మారే వరకూ మరిగించాలి. దీన్ని వడగట్టుకొని నిల్వ చేసుకొని ప్రతి రోజూ రెగ్యులర్ గా తలకు పట్టిస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

దాల్చిన చెక్క పౌడర్:

దాల్చిన చెక్క పౌడర్:

దాల్చిన చెక్క పౌడర్ బట్టతలను నివారిస్తుంది. దాల్చిన చెక్కను మెత్తగా పేస్ట్ చేసి, అందులో కొద్దిగా తేనె, ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి తలకు పట్టించి మసాజ్ చేసి 20నిముషాల తర్వాత తలస్నానం చేసుకోవాలి.

త్రిఫల పౌడర్

త్రిఫల పౌడర్

బట్టతల నివారించడంలో మరోగ్రేట్ రెమెడీ త్రిఫల పౌడర్ . త్రిఫల పౌడర్ లో కొద్దిగా అలోవెర జెల్ మిక్స్ చేసి తలకు పట్టించి చల్లటి నీటితో తలస్నానం చేయాలి. మంచి ఫలితం కోసం మూడు వారలకొకసారి క్రమం తప్పకుండా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది

Desktop Bottom Promotion