డ్రై హెయిర్ ను నివారించే 12 హెయిర్ ట్రీట్మెంట్స్...

ఆయిల్ హెయిర్ , డ్రై హెయిర్ చాలా ఇరిటేషన్ కలిగిస్తాయి. పొడి జట్టు నీర్జీవంగా మొండిగా ఉంటుంది. తలస్నానం చేసిన తర్వాత కూడా ముందు ఎలా ఉన్నదో అలాగే కనబడుతుంది. పొడి జుట్టు కొన్ని సందర్భల్లో మాత్రమే ఉంటుంది. ముఖ్యంగా సీజనల్ గా కూడా కొంత మందిలో హెయిర్ ఇలా డ్రైగా మారుతుంటుంది. వింటర్ లో ఆయిల్ హెయిర్ ఎక్కువ, సమ్మర్ లో రఫ్ హెయిర్ సమస్య ఎక్కువ. కానీ పొడి జుట్టు వల్ల చుండ్రు సమస్యను ఎదుర్కోవల్సి ఉంటుంది. కేశాలు జిడ్డుతత్వం కలిగి ఉన్నాకూడా చుండ్రు సమస్య ఏర్పడుతుంది. సాధారణ చుండ్రు కేవలం తల మాడు మీద, చర్మ మీద ఏర్పడుతుంది. చుండ్రు వల్ల కేశాలు నిర్జీవంగా కనబడుతాయి

పొడి జుట్టు ఏర్పడటానికి కెమికల్ ప్రొడక్ట్స్ ను ఉపయోగించడం లేదా ఇంటర్నల్ గా ఏదై అనారోగ్యసమస్యలు కారణం కావచ్చు. ఎక్స్ టర్నల్ గా చాలా కారణాల వల్ల జుట్టు పొడిబారడం జగుతుంది. ఉదాహరణకు: కెమికల్ బేస్డ్ షాంపులు, ఎప్పుడో ఒక సారి మార్థమే తలకు మర్ధన, హెయిర్ డై, హెయిర్ పెర్మ్స్, స్విమ్మింగ్ ఫూల్ లోని క్లోరిన్ మరియు హాట్ టబ్ లో స్నానం, బ్లో డ్రయ్యర్ మరియు కర్లింగ్ ఐరన్, ఎక్కవుగా సూర్యని తాపం లేదా గాలి, ఎక్కువ ఖనిజాలున్న స్థానిక నీటి సరఫరా.

బహిర్గితం కారణాల వల్ల జుట్టు డ్రైగా మారితే అందుకు కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి. హోం రెమెడీస్ తో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే డ్రైహెయిర్ ను నివారించుకోవచ్చు . కెమికల్ ప్రొడక్ట్స్ కు దూరంగా ఉండాలి. తర్వాత స్విమ్ చేసేటప్పుడు తలకు క్యాప్ పెట్టుకోవాలి. ఇంటి నుండి బయట వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా క్యాప్ ధరించాలి. అయితే అంతర్గత కారకాలకు అంత త్వరగా పరిష్కారం లేదు. పొడి జుట్టుకు కారణం అయ్యే అంతర్గత కారణాలు: క్యాన్సర్ ట్రీట్మెంట్, కొన్ని మందులు, పోషకాహార లోపం, దీర్ఘకాలిక అనారోగ్యం. కాబట్టి ఈ సమస్యలన్ని అధిగమించి, ఆరోగ్యవంతమైన జుట్టు పొందడానికి కొన్ని పరిష్కార మార్గాలను పరిశీలించండి...

వంటింటి వస్తువుల్లో అరటిపండు గుజ్జు, ఓట్స్ హెయిర్ మాస్క్ మరియు ఆలివ్ ఆయిల్ చాలా సింపుల్ గా ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. అలాగే ఈ క్రింది ఆహారాలను కూడా అనుసరించమని ఎందుకు చెబుతామంటే ఇవి చౌకైనవి మాత్రమే కాదు, మార్కెట్లో లభించి రసాయనికి ఉత్పత్తుల కంటే మేలైనవి. ఈ నేచురల్ పదార్థాలతో జుట్టుకు ఎలాంటి హాని జరగదు. మరి మీరు కూడా ఈ ఆహారాపదార్థాలను ఉపయోగించి, డ్రై గా ఉన్న మీ హెయిర్ ను స్మూత్ గా మార్చుకోండి. మరి అవేంటో తెలుసుకుందాం...డ్రై హెయిర్ సమస్య నుండి బయటపడదాం...

అరటి పండు గుజ్జు:

అరటి పండు గుజ్జు:

అరటిపండును రెండుగా చేసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో అరకప్పు పాలు పోసి బాగా మిక్స్ చేయాలి . ఈ మిశ్రమాన్నిహెయిర్ మాస్క్ ల తలకు పట్టించి 20 నిముషాల తర్వాత తలస్నానం చేస్తే డ్రై హెయిర్ సమస్య తగ్గుతుంది.

ఒట్ మీల్:

ఒట్ మీల్:

డ్రై హెయిర్ సమస్యను నివారించే మరో ఆహార పదార్థం ఓట్ మీల్. దీంతో హెయిర్ ప్యాక్ వేసుకోవడం ద్వారా, జుట్టు సాఫ్ట్ గా మారుతుంది మరియు జుట్టుకు నేచురల్ షైనింగ్ అందిస్తుంది.

పెరుగు మాస్క్:

పెరుగు మాస్క్:

చిక్కటి పెరుగును జుట్టుకు, తలకు పట్టించి మసాజ్ చేయాలి. 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి.

ఎగ్ మాస్క్:

ఎగ్ మాస్క్:

డ్రై హెయిర్ నివారించడానికి ఎగ్ హెయిర్ మాస్క్ మరో చక్కటి హోం రెమెడీ. గుడ్డులోని తెల్లని పదార్థంను తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నాం చేస్తే జుట్టుకు అవసరం అయ్యే పోషకాలు అందడంతో పాటు, డ్రై హెయిర్ నివారించబడుతుంది.

కీరదోసకాయ మాస్క్:

కీరదోసకాయ మాస్క్:

కీరదోసకాయ ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి, ఆ నీటితో హెయిర్ వాష్ కు ఉపయోగించుకోవచ్చు . తర్వాత రోజ్ వాటర్ తో వాష్ చేసుకోవాలి . ఈ సింపుల్ హోం రెమెడీ ద్వారా మీ జుట్టును నేచురల్ గానే సాఫ్ట్ గా మార్చుకోవచ్చు.

హెన్నా

హెన్నా

జుట్టుకు హెన్నా అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఇది పొడి జుట్టు చికిత్సకు సహాయపడుతుంది. జుట్టు పోగులు బలంగా మరియు మృదువుగా ఉండటానికి మరియు చుండ్రు తగ్గటానికి సహాయపడుతుంది. హెన్నాలో యాంటీబాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండుట వలన మీ జుట్టుకు పోషణ మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్

మాస్క్ డ్యామేజ్ అయిన జుట్టు మరియు లిప్స్ ను ఒక బెస్ట్ హోం రెమెడీ ఇది. ఒక టీస్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కు 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ మరియు 3 గుడ్లను మిక్స్ చేసి తలకు పట్టించి మర్దన చేయాలి. తర్వాత అరగంట వరకూ ఒక ప్లాస్టిక్ కవర్ తో తలను చుట్టి, తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి

తేనె

తేనె

తేనె నేచురల్ పదర్థాలుంటాయి, ఇది జుట్టుకు కావల్సిన తేమను అందిస్తుంది. మీ పొడిబారిన మరియు చిట్లిన జుట్టుకు అద్బుతమైన మాయిశ్చరైజ్ ను అంధిస్తుంది. రెండు కప్పులు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా తేనె మిక్స్ చేసి, తలారా పోసుకోవాలి.

శెనగపిండితో

శెనగపిండితో

శెనగపిండితో ప్యాక్ డ్రై హెయిర్ నివారించడానికి ఇది ఒక ఎఫెక్టివ్ హోం మేడ్ చిట్కా. అందుకు ఒక కప్పు పచ్చిపాలు లేదా కొబ్బరి పాలు తీసుకోవాలి. ఇందులో 3 చెంచాలా శెనగపిండి మిక్స్ చేసి, సున్నితమైన పేస్ట్ ను తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. ఈ చిట్కా మీద ఎక్కువ శ్రద్దపెట్టండి. ఇలా చేసుకొన్న తర్వాత 15నిముషాల తర్వాత మన్నికైన షాంపుతో తలస్నానం చేయాలి.

 నిమ్మరసం:

నిమ్మరసం:

పొడి జుట్టును నివారించడంలో ఇది ఒక ఉత్తమ ఫ్రూట్ హెయిర్ ఫ్యాక్. దీన్ని మీ జుట్టుకు నేరుగా అప్లై చేయొచ్చు లేదా నిమ్మరసంలో కొద్దిగా పెరుగు మరియు తేనె మిక్స్ చేసి హెయిర్ ప్యాక్ వేసుకోవాలి.

పొటాటో హెయిర్ మాస్క్

పొటాటో హెయిర్ మాస్క్

పొటాటో హెయిర్ మాస్క్ ఒక పెద్ద బంగాళాదుంప తీసుకోని పై తొక్క తీసి మిక్సి చేసి దాని నుండి రసం తీయాలి. ఈ రసంలో ఒక స్పూన్ కలబంద జెల్ కలపాలి. ఈ మిశ్రమం బాగా మృదువుగా అయ్యేవరకు బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పదిహేను నిమిషాల పాటు జుట్టు మీద బాగా రుద్ది రెండు గంటల తర్వాత వాష్ చేయాలి. ఈ మాస్క్ జుట్టు పెరుగుదలలో సహాయపడుతుంది. అంతేకాక హెయిర్ ఫాల్ మీద పోరాటం చేస్తుంది.

మెంతి యాంటీ - డాండ్రఫ్ హెయిర్ మాస్క్

మెంతి యాంటీ - డాండ్రఫ్ హెయిర్ మాస్క్

రాత్రిపూట నీటిలో మెంతులను నానబెట్టాలి. తదుపరి రోజు మెత్తగా పేస్ట్ చేసి తల మీద చర్మం మరియు జుట్టు లోకి బాగా రుద్ది 20 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి. మీరు చివరగా షాంపూ తో శుభ్రం చేయవచ్చు.

Story first published: Saturday, May 28, 2016, 15:28 [IST]
Desktop Bottom Promotion